Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?
వచ్చేవారం విడుదల కాబోతున్న 'లైగర్' సినిమాకి మళ్లీ ఐదు షోలు పడే ఛాన్స్ ఉంది.
'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్2', 'ఆచార్య', 'సర్కారు వారి పాట' వంటి పెద్ద సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉదయాన్నే బెనిఫిట్ షోలు పడ్డాయి. పది రోజుల పాటు రోజుకి ఐదు షోల చొప్పున థియేటర్లు నడిపించుకోవడానికి పర్మిషన్ దక్కింది. ఈ అవకాశాన్ని 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్2' సినిమాలు బాగానే వినియోగించుకున్నాయి. చివరిగా ఐదు షోలు పడ్డది 'ఎఫ్3' సినిమాకే. దానికి కూడా పెద్ద సంఖ్యలో స్పెషల్ షోలు వేయలేదు.
వేసిన షోలకు కూడా సరైన రెస్పాన్స్ లేదు. ఆ తరువాత ఐదు షోలు డిమాండ్ చేసే రేంజ్ లో సినిమాలు రాలేదు. 'మేజర్', 'విక్రమ్', 'బింబిసార', 'సీతారామం', 'కార్తికేయ2' సినిమాలు మంచి సక్సెస్ అయినప్పటికీ.. ఎక్స్ట్రా షోలు వేయాల్సిన అవసరం అయితే రాలేదు. 'బింబిసార', 'కార్తికేయ2' సినిమాలకు మాత్రం లిమిటెడ్ నెంబర్ లో కొన్ని అర్లీ షోలు పడ్డాయి.
Liger movie to restart 5 shows trend: ఇదిలా ఉండగా.. వచ్చేవారం విడుదల కాబోతున్న 'లైగర్' సినిమాకి మళ్లీ ఐదు షోలు పడే ఛాన్స్ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల పాటు ఈ సినిమాను ఐదు షోలు చొప్పున రన్ చేసుకోవడానికి అనుమతులు కోరబోతున్నారు. రెండు రాష్ట్రాల్లో ఈ ఐదు షోలకు అనుమతి దొరికేలానే ఉంది. అయితే థియేటర్లలో రీజనబుల్ రేట్లు పెడితేనే మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మల్టీప్లెక్స్ లో రూ.275కి బదులు రూ.200, సింగిల్ స్క్రీన్స్ లో రూ.150 చొప్పున టికెట్స్ అమ్మితే మాత్రం సినిమాకి మంచి రీచ్ ఉంటుంది. టాక్ బాగుంటే లాంగ్ రన్ కూడా ఉంటుంది. మరి టికెట్ రేట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!
లైగర్ సెన్సార్ డీటైల్స్:
ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాలు. అయితే ఈ సినిమాకి సెన్సార్ టీమ్ ఏడు మార్పులు సూచించినట్లు తెలుస్తోంది. అందులో కొన్ని డైలాగ్స్ మార్చాల్సి వచ్చింది, కొన్ని చోట్ల మ్యూట్ వేయాల్సి వచ్చింది. నిడివిలో మాత్రం ఎలాంటి మార్పులు లేదు.
ఇక 'లైగర్' సినిమా విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో రమ్యకృష్ణ విజయ్ తల్లి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక - నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.
Also Read: తిరు రివ్యూ : ధనుష్, నిత్యా మీనన్ సినిమా ఎలా ఉందంటే?
Also Read: విద్యా బాలన్ 'డర్టీ పిక్చర్'కు సీక్వల్, ఆ పాత్ర చేసేందుకు కంగనా తిరస్కరణ?