Samantha: సమంత ట్వీట్ పై స్పందించిన మంచువారమ్మాయి
విడాకుల ప్రకటన తరువాత సమంతపై ట్రోలింగ్ ఎక్కువైంది. వాటికి సామ్ గట్టిగానే రిప్లయ్ ఇస్తోంది.
క్యూట్ కపుల్ చైతూ-సామ్ తమ భార్యభర్తల బంధాన్ని తెంచేసుకున్నట్టు ప్రకటించారు. ఆ ప్రకటన తరువాత సమంతపై చాలా రూమర్లు వస్తూనే ఉన్నాయి. విడాకులకు ఆమె ప్రవర్తనే కారణమంటూ కొంతమంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తన పర్సనల్ డిజైనర్ ప్రీతమ్ జువల్కర్ తో సన్నిహితంగా ఫోటోలను వెలికితీసి మరీ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. సమంత పిల్లలను వద్దనుకుందని, శ్రుతి మించి ఎక్స్ పోజింగ్ చేస్తోందని ఇలా రకరకాల వాదనలు తెరపైకి వచ్చాయి. ఫ్యామిలీ మ్యాన్ లో చేసిన కొన్ని సీన్లే గొడవరకు కారణమని వాదించిన వాళ్లు ఉన్నారు. మొత్తమ్మీద ఈ పరిస్థితి రావడానికి సమంతే కారణమంటూ విపరీతంగా కామెంట్లు పెట్టిన వారూ ఉన్నారు. వీటన్నింటికీ సామ్ గట్టిగానే సమాధానం ఇచ్చింది.
తనపై చూపిస్తున్న సానుభూతికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసిన సామ్ ఆ ట్వీట్ లో తన వేదనను బయటపెట్టింది. తనకు ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లలు వద్దనుకున్నానని, అబార్షన్ చేయించుకున్నానని ఇలా చాలా అంటున్నారని చెప్పింది. విడాకులు తీసుకోవడం అన్నది చాలా బాధాకరమైన అంశమని, కొన్ని రోజులు తనను వదిలేయమని కోరింది. ఎవరు ఎంత బాధపెట్టిన తాను చెదరనని చెప్పింది. ఆమె ట్వీట్ ను రకుల్ మద్దతునిస్తూ రీట్వీట్ చేసింది. దానికి బైసెప్స్, లవ్ సింబల్ ను యాడ్ చేసింది. ఇప్పుడు మంచు లక్ష్మి కూడా సమంతకు మద్దతుగా నిలిచింది. ఆమె ట్వీట్ ను రీట్వీట్ చేసి దానికి బైసెప్స్, లవ్ సింబల్స్ తో ‘దట్స్ మై గర్ల్’ అని క్యాప్షన్ పెట్టింది. హీరోయిన్ మంజిమా మోహన్ కూడా సామ్ కు మద్దతు ప్రకటించింది. గతంలో మంజిమా నాగ చైతన్యతో కలిసి నటించింది.
💪that’s my girl🥰 https://t.co/0pewxeSEkN
— Lakshmi Manchu (@LakshmiManchu) October 8, 2021
Also read: భవిష్యత్తులో కరోనా కూడా జలుబులా మారిపోతుంది... ఇంగ్లాండు శాస్త్రవేత్తలు
Also read: ఈ లక్షణాలను తేలికగా తీసుకోకండి.. గుండె ఆరోగ్యాన్ని చెప్పేస్తాయివి
Also read: సోనూసూద్ సిమ్ కార్డు... 10జి నెట్ వర్క్, అంతా ఉచితమే
Also read: కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలా? ఆరోగ్యకరమైన పద్ధతులు ఇవిగో...
Also read: ఊరగాయలు, పెరుగు రోజూ తినడం మంచిదేనా? స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ఏం తేల్చింది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్స్క్రైబ్ చేయండి