Sonusood: సోనూసూద్ సిమ్ కార్డు... 10జి నెట్ వర్క్, అంతా ఉచితమే
కరోనా వేళ ఎంతో మందిని ఆదుకున్న సోనూసూద్ పై ప్రజల్లో అభిమానం ఏ మాత్రం తరగడం లేదు.
తెరపై విలన్ గా కనిపించే సోనూసూద్, తెర వెనుక మాత్రం నిజ జీవిత హీరో అనిపించుకున్నారు. గతేడాదిగా కరోనా సంక్షోభ వేళ ఎంతో మందికి ఆయన నేరుగా సాయం అందించారు. దీంతో సోనూను ఆరాధించే వారి సంఖ్య పెరిగిపోయింది. మొన్నటికి మొన్న తెలంగాణాలోని ఓ గ్రామంలో సోనూకు గుడి నిర్మించి పూజలు చేశారు. ఇప్పుడు మరో అభిమాని అతడి పేరు మీద ఓ సిమ్ కార్డును తయారుచేశాడు. అది నిజం సిమ్ కార్డు కాదులెండి. చిన్న సిమ్ కార్డుపై సోనూ సూద్ చిత్రాన్ని అందంగా పెయింట్ చేశాడు. ఆ అభిమాని పేరు సోమిన్. ఆ సిమ్ కార్డు ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. దాన్ని సోనూ సూద్ చూసి రీట్వీట్ చేశాడు.
రీట్వీట్ చేయడంతో పాటూ ‘ఫ్రీ 10జి నెట్ వర్క్’అనే క్యాప్షన్ కూడా జతచేశాడు. అతని ట్వీట్ కు నెటిజన్లు భారీగా స్పందించారు. 7000 లైకులతో పాటూ, వందల మంది కామెంట్లు చేశారు. ఆగస్టులో పర్వతారోహకులు ఉమాసింగ్ ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతం కిలిమంజారోను సైకిల్ అధిరోహించారు. ఆ ఘనతను ఈ నటుడికే అంకితమిచ్చారు ఉమా సింగ్. పర్వతం శిఖరంపై నిల్చున్న ఆయన చేతుల్లో సోనూసూద్ ఫోటో ఉన్న పోస్టర్ పట్టుకుని ఉన్నారు. తనకు స్ఫూర్తిగా నిలిచినందుకు సోనూసూద్ కు కృతజ్ఞతలు తెలిపారు.
గతేడాది సిద్ధిపేట జిల్లా దుబ్బతండా గ్రామంలో సోనూకు గుడి కట్టారు గ్రామస్థులు. కరోనా సమయంలో ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఇలా గుడి కట్టినట్టు చెప్పారు గ్రామస్థులు. తాజాగా ఖమ్మం జిల్లాలోని బోనకల్ జోన్ లోని గార్లపడ గ్రామంలో వెంకటేష్ అనే అభిమాని సోనూ సూద్ కు ఆలయాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు. తన ఇంటి ముందు సోనూసూద్ విగ్రహాన్ని ప్రతిష్టించారు.
Free 10 G network ,😄 https://t.co/uwUUSMBXLW
— sonu sood (@SonuSood) October 7, 2021
Also read: సాలీళ్లతో జాగ్రత్త... కరిస్తే ముఖాలు వాచిపోతాయి
Also read: భవిష్యత్తులో కరోనా కూడా జలుబులా మారిపోతుంది... ఇంగ్లాండు శాస్త్రవేత్తలు
Also read: ఊరగాయలు, పెరుగు రోజూ తినడం మంచిదేనా? స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ఏం తేల్చింది?
Also read: ఇలాంటి వారికి కరోనా సోకితే మరణించే అవకాశాలు ఎక్కువ... తేల్చిన కొత్త అధ్యయనం
Also read: కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలా? ఆరోగ్యకరమైన పద్ధతులు ఇవిగో...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్స్క్రైబ్ చేయండి