Weird: సాలీళ్లతో జాగ్రత్త... కరిస్తే ముఖాలు వాచిపోతాయి
సాలీడు కరిచి ఓ మహిళ ఆసుపత్రి పాలైంది. చిన్న సాలీడు కాటుకే తన ముఖం మారిపోవడాన్ని ఆమె భరించలేకపోయింది.
పరిమాణాన్ని బట్టి శక్తి సామర్థ్యాలను అంచనా వేయకూడదు. చిన్న సాలీడు తన చిన్న కాటుతో ఓ మహిళను ఆసుపత్రి పాలు చేసింది. సాలీడు వంటి జీవులతో జాగ్రత్తగా ఉండాలని ఇలాంటి సంఘటనలు చెబుతున్నాయి. ఎందుకంటే వాటిల్లో కొన్ని విషపూరితమైనవి కూడా ఉన్నాయి.
అమెరికాలోని షెర్రీ అనే మహిళ తన కుటుంబంలో కలిసి నదిలో షికారుకు వెళ్లింది. ఎక్కడ్నించో వచ్చింది చిన్న సాలీడు ఆమె పైకి పాకింది. నేరుగా పెదవులపై చిన్నగా కొరికింది. చేతితో ఆ సాలీడును తీసి పడేసి తన ట్రిప్ ను ఎంజాయ్ చేసింది షెర్రీ. మరుసటి రోజు చిన్నగా నొప్పి మొదలైంది. యాంటీబయోటిక్స్ తీసుకున్నా ఫలితం లేదు. పెదాలు వాచిపోయి ఏమీ తినలేని పరిస్థితి. తీవ్రమైన నొప్పి. వెంటనే ఎమర్జెన్సీ సర్వీసుకు ఫోన్ చేసింది ఆసుపత్రిలో చేరింది షెర్రీ. అయిదురోజుల పాటూ ఆమెకు భ్రాంతిగానే అనిపించేది. ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని విధంగా భ్రమగా అనిపించేది. ఒక సాలీడు విషం తనని ఇలా చేస్తుందని ఊహించలేకపోయింది షెర్రీ. తాను చనిపోతాననే అనుకుంది ఆమె. కానీ వైద్యులు అతిత్వరగానే ఆమెను కరిచిన సాలీడు గురించి తెలుసుకున్నారు. దానికి తగ్గట్టు చికిత్స అందించారు. అయిదు రోజుల పాటూ చికిత్స అందించాక పెదవులపై వాపు తగ్గింది. షెర్రీ తన చుట్టూ జరుగుతున్నది అర్థం చేసుకునే స్థితిలోకి వచ్చింది. కానీ ఆమె ఇంకా యాంటీబయోటిక్స్ కొన్నాళ్లపాటూ వాడాల్సి ఉంటుందని చెప్పారు వైద్యులు.
అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ ఇలాంటి దేశాల్లో విషపు సాలీళ్లు ఎక్కువగా ఉంటాయి. తొమ్మిది రకాల సాలీడు జాతుల్లో ఇలా విషాన్ని చిమ్మే లక్షణాలు ఉంటాయి. వాటిలో బ్లాక్ విడో స్పైడర్ చాలా ప్రమాదకరమైనది. చూడటానికి చాలా చిన్నదిగా కనిపించినా, చాలా దేశాల్లో వీటి మూలంగా ప్రాణాలు కోల్పోయిన వారూ ఉన్నారు. ఎక్కడ సాలీడు కనిపించినా దాన్ని శరీరం మీదకి చేరకుండా చూసుకోండి. ఏ సాలీడు ఏ జాతితో కనిపెట్టడం కష్టం కదా.
Also read: ఈ లక్షణాలను తేలికగా తీసుకోకండి.. గుండె ఆరోగ్యాన్ని చెప్పేస్తాయివి
Also read: భవిష్యత్తులో కరోనా కూడా జలుబులా మారిపోతుంది... ఇంగ్లాండు శాస్త్రవేత్తలు
Also read: ఊరగాయలు, పెరుగు రోజూ తినడం మంచిదేనా? స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ఏం తేల్చింది?
Also read: ఇలాంటి వారికి కరోనా సోకితే మరణించే అవకాశాలు ఎక్కువ... తేల్చిన కొత్త అధ్యయనం
Also read: కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలా? ఆరోగ్యకరమైన పద్ధతులు ఇవిగో...