![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Heart Health: ఈ లక్షణాలను తేలికగా తీసుకోకండి.. గుండె ఆరోగ్యాన్ని చెప్పేస్తాయివి
వయసు తేడా లేకుండా దాడి చేస్తున్నాయి గుండె సమస్యలు. మహిళల్లో గుండె సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయి.
![Heart Health: ఈ లక్షణాలను తేలికగా తీసుకోకండి.. గుండె ఆరోగ్యాన్ని చెప్పేస్తాయివి Signs of poor heart health often go unnoticed in women Heart Health: ఈ లక్షణాలను తేలికగా తీసుకోకండి.. గుండె ఆరోగ్యాన్ని చెప్పేస్తాయివి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/09/2589b1f17dfaf3132604a3f80e123999_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ప్రపంచంలో ఏటా వేల మంది ప్రాణాలు గుండె జబ్బులకు బలైపోతున్నాయి. పురుషులతో పోలిస్తే మహిళల్లోనూ గుండె సంబంధ వ్యాధులు అధికమవుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. అయితే మహిళల్లో కనిపించే కొన్ని లక్షణాలను బట్టి గుండె సంబంధ వ్యాధులను అంచనా వేయచ్చు అంటున్నారు ఆరోగ్యనిపుణులు. చాలా మంది స్త్రీలు ఈ లక్షణాలను తేలికగా తీసుకుంటారు, పట్టించుకోరు. దీని వల్లే వారిలో మరణాల రేటు పెరుగుతోంది. పురుషులతో పోలిస్తే మహిళల గుండె కాస్త చిన్నదిగా ఉంటుంది. గుండె గోడలు కూడా సన్నగా ఉంటాయి. కాబట్టి సహజంగానే పురుషులతో గుండెతో పోలిస్తే స్త్రీలు గుండె ప్రతిసారి పది శాతం తక్కువ రక్తాన్ని సరఫరా చేస్తాయి. మహిళలు ఒత్తిడికి గురైనప్పుడు వారి పల్స్ రేటు పెరుగుతుంది. అలాగే మహిళల్లో మాత్రమే కలిగే పాలిసిస్టిక్ అండాశయ వ్యాధి వంటి లక్షణాలు, మధుమేహం, అధిక రక్తపోటు, ఎండో మెట్రియోసిస్ వంటివి స్త్రీలలో గుండె సంబంధ వ్యాధులను పెంచడానికి సహకరిస్తాయి. మహిళల్లో కనిపించే ఈ లక్షణాలను తేలిగకగా తీసుకోవద్దని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు.
లక్షణాలు... సంకేతాలు
1. పురుషుల్లో కనిపించే లక్షణాలే స్త్రీలలో కూడా కనిపించాలని లేదు. వీరిలో గుండెను పిండేస్తున్న భావన కలుగుతుంది. చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది.
2. చేతులు, వీపు, మెడ, దవడ భాగాల్లో నొప్పిగా అనిపిస్తుంది. అన్నింట్లో ఒకేసారి అనిపించకపోయినా వెన్నునొప్పి, దవడలు నొప్పిగా అనిపించడం లేదా మెడ భాగంలో నొప్పిగా అనిపించడం కలుగుతుంది.
3. కడుపు చాలా బరువైన వస్తువు పెడితే ఎలాంటి నొప్పి కలుగుతుందో అలా పొట్ట నొప్పి వస్తుంది.
4. శ్వాస ఆడకపోవడం, వికారంగా అనిపించడం, తలలో తేలికగా అనిపించడం, చల్లని చెమటలు పట్టడం ఇలాంటివన్నీ కలుగుతాయి. ఇవన్నీ ఒత్తిడి లక్షణాలుగా కనిపించవచ్చు కానీ గుండెపోటుకు కూడా దారి తీయవచ్చు.
5. విపరీతమైన అలసట స్త్రీలలో కనిపిస్తుంది. ఏ పనీ చేయకపోయినా నీరసంగా అనిపిస్తుంది. ఈ సంకేతానలు విస్మరించకూడదు.
పురుషుల్లో, మహిళలు ఎవరైనా కూడా తమ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సమయానికి తినడం, వ్యాయామం చేయడం, ఒత్తిడి స్థాయిని తగ్గించుకోవడం, బరువు పెరగకుండా చూసుకోవడం వంటివి పాటించాలి. ధూమపానం, ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: ఇలాంటి వారికి కరోనా సోకితే మరణించే అవకాశాలు ఎక్కువ... తేల్చిన కొత్త అధ్యయనం
Also read: కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలా? ఆరోగ్యకరమైన పద్ధతులు ఇవిగో...
Also read: ఊరగాయలు, పెరుగు రోజూ తినడం మంచిదేనా? స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ఏం తేల్చింది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)