Gandhari Song: ‘గాంధారి’ వచ్చేసింది, డ్యాన్స్‌తో అదరగొట్టేస్తున్న కీర్తి సురేష్
కీర్తి సురేష్ ఏ సినిమాలోనూ ఇంతగా డ్యాన్స్ చేయలేదని ఆమె అభిమానులు అంటున్నారు. మరి మీరూ ‘గాంధారి’ వీడియో సాంగ్ చూశారా?
కీర్తి సురేష్ అస్సలు తగ్గడంలేదు. జయపజయాలతో పనిలేకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. కేవలం సినిమాల్లోనే కాదండోయ్.. ఇప్పుడు ఓ వీడియో సాంగ్‌లో కూడా కీర్తి సురేష్ తళుక్కున మెరిసింది. ఇన్నాళ్లు నటనతోనే ఆకట్టుకున్న కీర్తి.. ఇప్పుడు డ్యాన్స్‌తో అదరగొట్టగలనని చెబుతోంది. తాజాగా యూట్యూబ్‌లో విడుదలైన ‘గాంధారి’ సాంగ్‌లో కీర్తి సురేష్.. తన క్యూట్ లుక్స్‌తో డ్యాన్స్ ఇరగదీసింది. ఆ వీడియో సాంగ్ చూస్తే మీరు కూడా వహ్వా అనకుండా ఉండలేరు.
ఈ పాటలో కీర్తి సురేష్ లెహంగా వేసుకొని డాన్స్ చేస్తూ కనిపించింది. ఈ మ్యూజిక్ వీడియోకు ‘లవ్ స్టోరీ’ ఫేమ్ పవన్ సి.హెచ్ మ్యూజిక్ అందించారు. బృంద కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. సోనీ సంస్థ ఈ పాటను నిర్మించింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండవ్వుతోంది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్.. ఇటీవల ‘గుడ్ లక్ సఖి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఓటీటీలో కూడా వర్కవుట్ అవ్వలేదు. అయినప్పటికీ.. కీర్తికి వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
Also Read: ‘బెస్ట్‌సెల్లర్’ రివ్యూ: శృతిహాసన్‌లో మస్త్ షేడ్స్ ఉన్నాయ్! కానీ, పుస్తకమే..
కీర్తి ప్రస్తుతం నాని ‘దసరా’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మహేష్ బాబుతో కలిసి ‘సర్కారు వారి పాట’లో సినిమాలో చేస్తోంది. ‘భోళా శంకర్’ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా కనిపించనుంది. మలయాళంలో ‘వాశి’ అనే సినిమాలోనూ నటిస్తోంది. ఇందులో టొవినో థామస్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ లాయర్ గా కనిపించనుంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి.
కీర్తి ‘గాంధారి’ సాంగ్‌ను ఇక్కడ చూసేయండి:
View this post on Instagram