Katrina-Vicky Wedding Pics: కత్రినా-విక్కీ.. పెళ్లి ఫొటోలు వచ్చేశాయ్.. కొత్త జంట భలే ముచ్చటగా ఉంది!
కత్రినా-విక్కీ పెళ్లితో ఒక్కటయ్యారు. అంగరంగ వైభవంగా సాగిన వారి పెళ్లి ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
బాలీవుడ్ ప్రేమ జంట.. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ గురువారం పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి బాలీవుడ్ దిగ్గజాలంతా తరలివచ్చారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని గల లగ్జరీ హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో వీరి పెళ్లి జరిగింది. అయితే, వీరు తమ పెళ్లి వీడియోలు, ఫొటోలు బయటకు లీక్ కాకుండా జాగ్రత్తపడ్డారు. మీడియాకు కూడా లోనికి అనుమతించలేదు. పెళ్లిని రికార్డు చేసే బాధ్యతను ఓ సంస్థకు అప్పగించినట్లు తెలిసింది. అయితే, ఆ పెళ్లికి హాజరైన కొందరు అక్కడి చిత్రాలను తీసి సోషల్ మీడియాలో లీక్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌లే స్వయంగా తమ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దీంతో ముచ్చటైన ఆ జంటను చూసి ఫాన్స్.. అభినందనలతో ముంచెత్తుతున్నారు.
‘మేమిద్దరం కలిసి కొత్త ప్రయాణం మొదలుపెట్టాం. మీ ఆశీర్వాదాలు కావాలి’’ అంటూ విక్కీ, కత్రినా.. పోస్ట్ చేసిన ఈ చిత్రాలకు ఇన్‌స్టా్గ్రామ్‌లో షేర్ చేసిన 20 నిమిషాల్లోనే మిలియన్ లైక్స్ లభించాయి. హిందూ సాంప్రదాయంలో జరుగుతున్న ఈ పెళ్లిలో కత్రినా బుట్టబొమ్మలా మెరిసిపోతుంది. విక్కీ చేతిలో చేయి వేసి.. ఏడడుగులు వేయడం.. వరమాలను వేసి.. మురిసిపోతున్న కత్రినాను ఈ చిత్రాల్లో చూడవచ్చు. పెళ్లి సందర్భంగా బుధవారమే హల్దీ వేడుక, సంగీత్ నిర్వహించారు. ఈ వేడుకలకు కత్రినా, విక్కీల కుటుంబ సభ్యులతోపాటు వారి స్నేహితులు, బాలీవుడ్ సెలబ్రిటీలు తరలించారు.
View this post on Instagram
Also Read: చిన్నప్పుడు అజయ్ దేవగన్ బైక్ స్టంట్ చూస్తే.. అమ్మ తిట్టింది: ఎన్టీఆర్
Also Read:'పుష్ప' సెట్స్ లో గోల్డ్ బిస్కెట్స్ పంచిన బన్నీ..
Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?
Also Read: అల్లు అర్జున్ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ మృతి...
Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి