Pushpa: బన్నీకి డబ్బింగ్ చెబుతోన్న బాలీవుడ్ హీరో..
రెగ్యులర్ గా హిందీ సినిమాలకు డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ లు కాకుండా.. బన్నీ పాత్రకు ఓ యంగ్ హీరోతో డబ్బింగ్ చెప్పించడానికి రెడీ అయ్యారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నారు. తొలిసారి బన్నీ ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తెలుగు సినిమాలను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేసే గోల్డ్ మైన్ ఫిలిమ్స్ సంస్థ 'పుష్ప' హిందీ హక్కులను సొంతం చేసుకుంది. ఏఏ ఫిలిమ్స్ ఈ సినిమాను నార్త్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ సంస్థ 'పుష్ప' హిందీ డబ్బింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది.
రెగ్యులర్ గా హిందీ సినిమాలకు డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ లు కాకుండా.. బన్నీ పాత్రకు ఓ యంగ్ హీరోతో డబ్బింగ్ చెప్పించడానికి రెడీ అయ్యారు. అతడు మరెవరో కాదు.. శ్రేయాస్ తల్పాడే. బాలీవుడ్ లో 'ఇక్బాల్' సినిమాతో మంచి పాపులారిటీ దక్కించుకున్న శ్రేయాస్.. ఆ తరువాత గోల్ మాల్ సిరీస్ లో నటించాడు. 'ఓం శాంతి ఓం' కూడా నటుడిగా శ్రేయాస్ రేంజ్ ను మరింత పెంచింది. ఇప్పుడు ఈ యంగ్ హీరో పుష్ప రాజ్ పాత్రకు డబ్బింగ్ చెప్పబోతున్నారు.
'పుష్ప' సినిమా హిందీ ట్రైలర్ లాంఛింగ్ సమయంలో శ్రేయాస్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ఇండియాలోనే మోస్ట్ పవర్ ఫుల్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి వాయిస్ ఇచ్చినందుకు చాలా గర్వంగా ఉందంటూ బన్నీ గురించి గొప్పగా మాట్లాడారు శ్రేయాస్. నిన్న తెలుగు ట్రైలర్ విడుదల కాగా.. ఈరోజు హిందీ ట్రైలర్ వచ్చింది. ఒకరోజు ఆలస్యంగా ట్రైలర్ విడుదలైనా.. నార్త్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నారు. మరి బన్నీ తన సినిమాతో బాలీవుడ్ లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో చూడాలి. డిసెంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. అలానే అనసూయ, సునీల్ లాంటి నటులు కీలకపాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించింది.
Also Read:'పుష్ప' సెట్స్ లో గోల్డ్ బిస్కెట్స్ పంచిన బన్నీ..
Also Read: అషూ రెడ్డి ప్రెగ్నెంట్.. తల్లి చేతిలో చావుదెబ్బలు, వీడియో వైరల్
Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?
Also Read: అల్లు అర్జున్ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ మృతి...
Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి