Karthika Deepam November 28th: విషమంగా దీప ఆరోగ్యం- నిజం తెలిసి మోనితని బురిడీ కొట్టించిన శివ
కార్తీకదీపం నవంబరు 26 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
కార్తీక్ దీప ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతకముందు వచ్చిన రోగం దీపకి మళ్ళీ తిరగబెట్టింది, గుండె కూడా చాలా వీక్ గా ఉంది అవసరమైతే స్టంట్ కూడా వేయాల్సి వస్తుంది. ఈ విషయం తనకి ఎలా చెప్పాలి అని మనసులో ఆలోచిస్తూ ఇంట్లోకి వస్తాడు కార్తీక్. దీప శౌర్య గురించి ఆత్రంగా అడుగుతుంది. లేదు అని చెప్పి హాస్పిటల్ లో మనం రెండు రోజులు ఉండాలి అని కార్తీక్ దీపతో అంటాడు. కానీ దీప మాత్రం అందుకు ఒప్పుకోదు. వంట చేస్తాను అని దీప వెళ్లబోతుంటే కార్తీక్ గట్టిగా అరుస్తాడు.
“వెళ్లొద్దని చెప్పను కదా వినవు ఏంటి.. నీకోక నిజం చెప్పాలి ఆ రిపోర్ట్స్ చూశాక నీకు చెప్పకతప్పడం లేదు. నేను నీ డాక్టర్ బాబుని దీప. గతం గుర్తుకు వచ్చింది నీకు ఆ విషయం చెప్తే మౌనిత ఎక్కడ నీ ప్రాణాలు తీస్తుందో అని భయపడి చెప్పలేదు. అదే కాదు ఇంకొక కారణం కూడా ఉంది. శౌర్యని నేను చూశాను కానీ అప్పుడు తనని గుర్తుపట్టలేకపోయాను. శౌర్య ఎక్కడ ఉందో మోనితకి తెలుసని అనుమానంగా ఉంది, అందుకే నాకు గతం గుర్తుకు వచ్చిందని తెలిస్తే శౌర్యని మనకి ఎక్కడ దూరం చేస్తుందో అని భయంగా ఉండి చెప్పలేదు. నా మాట విని హాస్పిటల్ లో జాయిన్ అవు తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుందాం” అని కార్తీక్ చెప్తాడు. వెనక్కి తిరిగి చూసేసరికి దీప స్పృహ తప్పి కిందపడిపోతుంది. అంతే కార్తీక్ చెప్పింది ఏది దీప వినలేదు. కార్తీక్ వెంటనే కంగారుగా తనని తీసుకుని హాస్పిటల్ కి వస్తాడు. అక్కడ తన గురించి చెప్పి వెంటనే దీపకి ఆపరేషన్ చేసి స్టంట్ వెయ్యాలని అంటాడు. ఆపరేషన్ కి ఏర్పాట్లు చెయ్యమని చెప్తాడు.
Also Read: కోర్టులో నేరం చేశానని ఒప్పుకున్న మాళవిక, షాకైన వేద - ఖుషి మీద అరిచిన ఆదిత్య
సౌందర్య ఆనందరావుకి ఫోన్ చేసి కార్తీక్, దీప బతికే ఉన్నారని విషయం చెప్తుంది. అది విని ఆనందరావు చాలా సంతోషిస్తాడు. శౌర్య కోసం వాళ్ళు వెతుకుతున్నారని సౌందర్య చెప్తుంది. కార్తీక్ దీపని చూసి చాలా బాధపడతాడు. నిజం ఎప్పుడు చెప్తానయ అని ఎదురుచూశాను కానీ చెప్పేలోపు ఇలా అయింది ఇంకా దేవుడు ఎన్నాళ్ళు మనం దూరంగా ఉండాలని అనుకుంటున్నాడో అని మనసులోనే బాధపడతాడు. దీప కళ్ళు తెరిచి తనకి ఏమైందని అడుగుతుంది.
దీప-కార్తీక్: గుండెలో చిన్న బ్లాకేజ్ ఉంది ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు నువ్వేమి కంగారు పడకు. నేను నిజంగానే బతుకుతానా డాక్టర్ బాబు, నేను బతకను అని అనిపిస్తుంది అన్ని విషయాల్లో పోరాడి ఒడిపోయాను. నేను నిజం చెప్పే టైమ్ కి నువ్వు కళ్ళు తిరిగిపడిపోయావు, ఇప్పుడు నిజం చెప్తే పట్టరాని ఆనందంతో ఉంటావు అది కూడా నీ ఆరోగ్యానికి ప్రమాదమే అని మనసులో అనుకుంటాడు.
మోనిత కార్తీక్ కోసం టెన్షన్ పడుతూ ఉంటుంది. శివకి కాల్ చేస్తుంది. శివ అప్పుడే వచ్చి మోనితకి విషయం చెప్తాడు. సంగారెడ్డి మొత్తం వెతికాను ఎక్కడ కార్తీక్ వాళ్ళు కనిపించలేదని చెప్తాడు. ఊరు మొత్తం వెతికాం కానీ ఎక్కడ లేదని శివ చెప్తాడు. వంటలక్క అక్కడికే వెళ్తాను అని చెప్పింది కదా అక్కడ లేకపోవడం ఏంటని మోనిత ఆలోచిస్తుంది. ‘అసలు నేను సంగారెడ్డి వెళ్తేనే కదా వాళ్ళు కనిపించడానికి. శివలత చెప్పింది వంటలక్క, కార్తీక్ సర్ భార్య భర్తలు అని. మీ మాట విని నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని విడగొట్టడం ఎందుకు’ అని శివ మనసులో అనుకుంటాడు. కార్తీక్ సర్ మీ భర్తనా వంటలక్క భర్తా అని శివ అడుగుతాడు. ఆ మాటకి మోనిత సీరియస్ అవుతుంది.
Also Read: గుండెలు పగిలేలా రోదించిన అనసూయ- ఉగ్రరూపం దాల్చి తల్లిని ఇంట్లోకి అడుగుపెట్టొద్దన్న నందు
ఆనందరావు, హిమ ఆత్రంగా సౌందర్య దగ్గరకి వస్తారు. వాళ్ళని చూడాలని చాలా ఆశపడతారు. దీప హాస్పిటల్ బెడ్ మీద ఉందా శౌర్య అంటించిన పోస్టర్ చూసి బాధపడుతుంది. శౌర్య ఇచ్చిన నెంబర్ ఎవరితో కనుక్కోమని దీప చెప్తుంది. నెంబర్ ఎవరిదో కనుక్కుని తప్పకుండా వెళ్తాను అని కార్తీక్ మాట ఇస్తాడు.
తరువాయి భాగంలో..
కార్తీక్ వచ్చేసరికి దీప హాస్పిటల్ బెడ్ మీద కనిపించదు. తన కోసం చాలా టెన్షన్ పడతాడు. అటు దీప రోడ్డు పక్కన పడిపోయి ఉంటుంది. అప్పుడే ఇంద్రుడు, శౌర్య వాళ్ళు వెళ్తున్న ఆటో అతను చూసి ఆపుతాడు. ఇంద్రుడు దీపని చూసి సైలెంట్ గా బాధపడతాడు. శౌర్య ఎవరు బాబాయ్ పడిపోయిందని అడుగుతుంది.