అన్వేషించండి

Ennenno Janmalabandham November 28th: కోర్టులో నేరం చేశానని ఒప్పుకున్న మాళవిక, షాకైన వేద - ఖుషి మీద అరిచిన ఆదిత్య

సులోచనకి యాక్సిడెంట్ చేసిన మాళవిక అని అనుకుని వేద తన మీద కేసు పెట్టి కోర్టుకి వేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

వేద, యష్ కోర్టుకి చేరుకుంటారు. ఖుషి కోసం మన మధ్య దూరం రాకూడదని వేద యష్ ని మాట ఇవ్వమని అంటుంది. మన మధ్య మూడో వ్యక్తికి చోటు ఉండదు అని యష్ వేద చేతిలో చెయ్యి వేసి మాట ఇచ్చే టైమ్ కి మాళవిక వచ్చి పిలుస్తుంది. దీంతో యష్ ప్రామిస్ చెయ్యకుండానే వెళ్ళిపోతాడు. వేద ఫీల్ అవుతుంది. మాళవిక వేదని కావాలనే రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.

మాళవిక: కోర్టుకి వచ్చేసరికి టెన్షన్ లో ఉన్నట్టు ఉన్నావ్

వేద: ఎందుకు టెన్షన్ న్యాయం నావైపు ఉంది. నీకు గుర్తుందా ఖుషి కోసం వచ్చాను గెలిచాను, ఇప్పుడు మా అమ్మ కోసం వచ్చాను గెలుస్తాను

మాళవిక: ఈసారి ఖచ్చితంగా నువ్వు ఒడిపోతావ్ ఎందుకంటే ఆరోజు నువ్వు గెలిచావ్ అంటే యశోధర్ నీవైపు ఉన్నాడు కానీ ఈరోజు యశోధర్ నావైపు ఉన్నాడు అనేసి వెళ్ళిపోతుంది.

వేద యష్ ప్రామిస్ చేయకుండా వెళ్ళిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మాలిని వచ్చి మాట్లాడుతుంది. నీభర్తతో పోరాడుతున్నానందుకు బాధపడుతున్నావా అని అడుగుతుంది. ఆయన్ని ఎప్పుడు అపార్థం చేసుకొను కానీ అని వేద అంటుంటే మాలిని ఆ మాళవిక గురించి ఎందుకు భయపడుతున్నావ్ అది నీ కాలి గోటికి కూడా సరిపోదు అని ధైర్యం చెప్తుంది. అప్పుడు ఖుషి కోసం ఫైట్ చేశావ్ ఇప్పుడు తల్లికోశం చేస్తున్నావ్ న్యాయం నీవైపే ఉంది నువ్వు గెలుస్తావ్ అని చెప్తుంది. మాళవికని ఖచ్చితంగా జైలుకి పంపించాలి అని మాలిని అంటుంది. అప్పుడే లాయర్ ఝాన్సీ ఎంట్రీ ఇస్తుంది. ఇదంతా జరగాలి అంతే వేద సపోర్ట్ ఫుల్ గా ఉండాలి అని అంటుంది.

Also Read: గుండెలు పగిలేలా రోదించిన అనసూయ- ఉగ్రరూపం దాల్చి తల్లిని ఇంట్లోకి అడుగుపెట్టొద్దన్న నందు

నేరం చేసిన ఆ మాళవికని ఈ ప్రపంచంలో ఎవరు కాపాడలేరు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వేద ధైర్యంగా చెప్తుంది. అటు స్కూల్ లో ఉన్న వినాయకుడి దగ్గరకి వెళ్ళి ఖుషి తన తల్లి వేద కేసులో గెలవాలని కోరుకుంటుంది. ఆదిత్య కూడా తన తల్లి మాళవికని కాపాడాలని ప్రేయర్ చేస్తాడు. ఆదిత్య ఖుషి మీద కోప్పడతాడు. మన ఇద్దరికీ అమ్మ మాళవికనే అని అంటాడు. డాడీ మనకి సపోర్ట్ చేస్తున్నాడు వేద ఆంటీ మాత్రం అమ్మకి పనిష్మెంట్ ఇవ్వాలని చూస్తుందని చెప్తాడు. కానీ ఖుషి మాత్రం తనకి అమ్మ వేదనే అని చెప్పేసరికి ఆదిత్య కోపంగా అయితే నీతో కటీఫ్ అనేసి వెళ్ళిపోతాడు. ఖుషి చాలా బాధపడుతుంది.

కోర్టులో ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఝాన్సీ తన వైపు వాదనలు వినిపిస్తుంది. ఇది యాక్సిడెంట్ కాదు హత్యాప్రయత్నం చేసింది ఎవరో కాదు మాళవిక అని లాయర్ ఝాన్సీ చెప్తుంది. ఆమాటకి యష్ తరఫు లాయర్ ఈ కేసుకి మాళవికకి ఎటువంటి సంబంధం లేదని ఇదొక భోగస్ కేసని కొట్టేయాలని జడ్జిని కోరతాడు. ఇద్దరు లాయర్లు కాసేపు వాదించుకుంటారు. నేరం నేనే చేశాను అని ఎవరు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు నేనే ఒప్పుకుంటున్నా అని మాళవిక కోర్టులో గట్టిగా చెప్పేసరికి వేద షాక్ అవుతుంది.

Also Read: మాళవిక జైలుకి వెళ్ళి చిప్పకూడు తినాల్సిందేనన్న అభిమన్యు- కోర్టుకి చేరిన వేద, యష్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Biker Trailer : రేస్ ఈజ్ రెస్పెక్ట్... వార్ ఆన్ వీల్స్ - శర్వానంద్ బైకర్ ట్రైలర్ వచ్చేసింది
రేస్ ఈజ్ రెస్పెక్ట్... వార్ ఆన్ వీల్స్ - శర్వానంద్ బైకర్ ట్రైలర్ వచ్చేసింది
Mrunal Thakur : చరణ్ పెద్దిలో స్పెషల్ సాంగ్ - గ్లోబల్ స్టార్‌తో స్టెప్పులేసే బ్యూటీ ఎవరో తెలుసా?
చరణ్ పెద్దిలో స్పెషల్ సాంగ్ - గ్లోబల్ స్టార్‌తో స్టెప్పులేసే బ్యూటీ ఎవరో తెలుసా?
Niharika Konidela : హీరోగా అకీరా ఎంట్రీ - మెగా డాటర్ నిహారిక కొణిదెల రియాక్షన్
హీరోగా అకీరా ఎంట్రీ - మెగా డాటర్ నిహారిక కొణిదెల రియాక్షన్
Anchor Suma : సుమ బర్త్ డే స్పెషల్ - రాజీవ్ కనకాల ట్వీట్ వైరల్... ఫేమస్ యాంకర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
సుమ బర్త్ డే స్పెషల్ - రాజీవ్ కనకాల ట్వీట్ వైరల్... ఫేమస్ యాంకర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget