News
News
X

Karthika Deepam December 30th Update: చారుశీల ఉచ్చులో పూర్తిగా చిక్కుకుపోయిన దీప-కార్తీక్, బాధలో సౌందర్య అండ్ కో!

కార్తీకదీపం డిసెంబరు 30 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

FOLLOW US: 
Share:

Karthika Deepam  December 30th  Episode 1549(కార్తీకదీపం డిసెంబరు 30ఎపిసోడ్)

హాస్పిటల్లో దీపకు టెస్టులు చేయిస్తాడు కార్తీక్. రేపో మాపో చనిపోయేదానిలా ఎందుకు ఇవన్నీ అని అడుగుతుంది దీప. కార్తీక్ ఏదో సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తాడు.చారుశీల మాత్రం కార్తీక్ ముందు యాక్ట్ చేస్తూ మనసులో ఆనందపడుతుంది. నేను  అనుకున్న పని ఇంత తొందరగా వర్క్ అవుట్ అవుతుందని అనుకోలేదు ఈ భార్యాభర్తలు ఇద్దరు నన్ను పిచ్చిపిచ్చిగా నమ్మేస్తున్నారు నాకు కూడా అదే కావాలి అని మనసులో అనుకుంటుంది. ఆతర్వాత స్కానింగ్ ఉందని చెప్పి దీపను తీసుకెళుతుంది. 

హిమ కోసం వెతుకుతున్న సౌందర్య...ఎదురుపడిన శౌర్యని అడుగుతుంది. దాని గురించి నన్ను ఎందుకు అడుగుతావు నానమ్మ అని అంటుంది.ఇంకెవర్ని అడగాలని సౌందర్య అంటే.. నీ మీద ఉన్న గౌరవంతో ఇక్కడికి వచ్చాను ఇక్కడ మళ్ళీ అదే మొదలు పెడుతున్నావు ఈసారి ఇలాగే మాట్లాడితే ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని అంటుంది శౌర్య. ఇంతలోనే హిమ అక్కడికి రావడంతో ఎక్కడికి వెళ్లావు హిమ అనగా అమ్మానాన్నల కోసం వెతకడానికి వెళ్లానని చెబుతుంద. శౌర్య వెటకారంగా మాట్లాడి వెళ్లిపోతుంది. హిమకు నచ్చచెబుతుంది సౌందర్య...

Also Read: రిషిసార్ నాకు కాబోయే భర్త - తండ్రికి తేల్చి చెప్పిన వసు, పెళ్లి చెడగొట్టేందుకు రాజీవ్-దేవయాని నయా ప్లాన్!

మరోవైపు చారుశీల దీపకు టెస్టులు చేయించి తీసుకొచ్చి అంతా బాగానే ఉందని చెబుతుంది. మందులు చెక్ చేయమని చారుశీల డ్రామా స్టార్ట్ చేస్తుంది...అవసరం లేదంటాడు కార్తీక్. నువ్వు చూడవు కార్తీక్ ఒకవేళ చూసినా అందులో అన్ని కరెక్ట్ మందులే ఉంటాయి...తేడా మందులన్నీ పండరితో ఇప్పిస్తున్నాను అని మనసులో అనుకుంటుంది. అప్పుడు దీప- కార్తీక్- చారుశీల మందుల గురించి మాట్లాడుకుంటారు. దీపకు నిజం తెలిసినా కూడా కార్తీక్ కే ప్లాబ్లెమ్ అన్నట్టుమాట్లాడుతోందేంటి .. నాకు క్లారిటీ రావాలి అనుకుంటుంది చారుశీల. మీరు హాస్పిటల్ చుట్టూ తిరగకుండా నా దగ్గరే ఉండాలని కోరుతుంది దీప. 

హేమచంద్ర-సౌందర్య
హేమచంద్ర ఇంటికి సౌందర్య వస్తుంది. చెప్పండి అనడంతో మీరు డాక్టర్ అంట కదా బాబు అనగా అవును అని అంటాడు . కార్తీక దీపల గురించి చెబుతుండడంతో హేమచంద్రకు అనుమానం వస్తుంది. అప్పుడు సౌందర్య తన ఫోన్లో కార్తీక్, దీప ఫోటో చూపించడంతో హేమచంద్ర షాక్ అవుతాడు. నా అనుమానమే నిజమైంది కార్తీక్ వాళ్ళ అమ్మానాన్నలు వీళ్ళే అని అనుకుంటూ ఉండగా ఎక్కడైనా చూసావా బాబు అనడంతో లేదు అని హేమచంద్ర అబద్ధం చెబుతాడు. అప్పుడు సౌందర్య బాధతో మాట్లాడడంతో హేమచంద్ర ఆలోచనలో పడతాడు. అప్పుడు సౌందర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా కూర్చోండి కాఫీ ఇస్తాను అంటాడు. ఇంతలో కాల్ చేసిన దీప..పది నిముషాల్లో మీ ఇంటికి వస్తున్నాం అని చెప్పి కాల్ చేస్తుంది. రానీలే అనుకుంటాడు హేమచంద్ర...  కాఫీ నేనుపెడతానని సౌందర్య లోపలకు వెళుతుంది.

Also Read: మోనితను సైడ్ చేసేసిన డాక్టర్ చారుశీల, దీపను చంపేసి కార్తీక్ ను పెళ్లిచేసుకునేందుకు స్కెచ్!

కార్తీక్ దీప అక్కడికి రావడంతో..ఇంద్రుడు చూసి..సౌందర్య అండ్ కో మొత్తం ఇక్కడే ఉన్నారని  బయటకు వస్తారేమో వెళ్లిపోండని చెబుతాడు. మేం మా అన్నయ్య ఇంట్లోకి వెళ్లిపోతాం అంటుంది దీప. ఇంతలో హేమచంద్ర అక్కడకి వస్తాడు
హేమచంద్ర: వచ్చారా దేవుడు ఎక్కడ ఎప్పుడు ఎవరిని కలపాలో అలా కలుపుతాడు అంటాడు
దీప: ఏం మాట్లాడుతున్నావ్ అన్నయ్య 
హేమచంద్ర: మీ అత్తయ్య కార్తీక్ వాళ్ళ అమ్మ అని అంటుండగా ఎదురింట్లో ఉన్నారని మాకు తెలుసు నువ్వు అలాంటి పిచ్చి వేషాలు ఏమి వేయకు అని కార్తీక్ అనడంతో ఎదురింట్లో కాదు కార్తీక్ మా ఇంట్లోనే ఉంది మీ అమ్మ అని అనగా కార్తీక్, దీప షాక్ అవుతారు. 
హేమచంద్ర వారికి నచ్చజెప్పి ఇప్పటికైనా కలిసిపోండి కార్తీక్ అనడంతో కార్తీక్ హేమచంద్ర పై సీరియస్ అవుతాడు. వాళ్ళని దూరం పెడుతూ మీరు మిమ్మల్ని దూరం చేసుకుని వాళ్ళు చాలా బాధపడుతున్నారు అని అంటాడు హేమచంద్ర. 
దీప: అప్పుడు ఏం మాట్లాడుతున్నావ్ అన్నయ్య నీకు మొత్తం చెప్పాను కదా మళ్లీ ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటి పద డాక్టర్ బాబు అని వెళుతుండగా ఇంతలో ఇంద్రుడు అక్కడికి వచ్చి పిల్లలు బయటే ఉన్నారు ఇప్పుడు అక్కడికి రావద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 
కార్తీక్, దీప ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు సౌందర్య కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. కార్తీక్-దీప ఇద్దరు దాక్కుంటారు. అప్పుడు దీప ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇప్పుడు హేమచంద్ర సౌందర్య ఇద్దరు కాఫీ తాగుతూ ఉంటారు. మేలుకున్న దీప ఏమోషన్ అవుతుంది. బయట కూతుర్లు ఒకవైపు అత్తయ్య గారు పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు అనడంతో ఏం చేస్తాం దీప ఇది మన తలరాత అనడంతో లేదు డాక్టర్ బాబు ఇది మనం తీసుకుంటున్న గీత అని అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ బాధగా మాట్లాడుకుంటూ ఉంటారు . నేను ప్రమాదంలో చనిపోయాను మీరు ఒక్కరే బ్రతికేది అని చెప్పి అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్లిపోండి అని అంటుంది. అదేంటి దీపం నా ప్రాణాలు కదా పోయేది అనడంతో చాలా డాక్టర్ బాబు నాకు నిజం మొత్తం తెలుసు పోయేది నీ ప్రాణాలు కాదు నా ప్రాణాలు అని అంటుంది దీప.

Published at : 30 Dec 2022 09:24 AM (IST) Tags: Karthika Deepam Serial karthika Deepam Serial Today Episode Karthika Deepam Serial Written Update Karthika Deepam Episode Karthika Deepam Serial December 30h update

సంబంధిత కథనాలు

Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్‌లో నాని ఏమన్నాడంటే?

Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్‌లో నాని ఏమన్నాడంటే?

Upcoming Movies This Week: ఈ వారం థియేటర్‌, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే!

Upcoming Movies This Week: ఈ వారం థియేటర్‌, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే!

Thalapathy67: అందరికీ తెలిసిందే - అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్!

Thalapathy67: అందరికీ తెలిసిందే - అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్!

Nikhil On SPY Movie: నిఖిల్ స్పై థ్రిల్లర్ మూవీ నుంచి బిగ్ అప్డేట్, రిలీజ్ ఎప్పుడంటే?

Nikhil On SPY Movie: నిఖిల్ స్పై థ్రిల్లర్ మూవీ నుంచి బిగ్ అప్డేట్, రిలీజ్ ఎప్పుడంటే?

Sundeep Kishan: ‘విక్రమ్’ నుంచి అందుకే తప్పుకున్నా, లోకేష్ కనగరాజ్ ప్రపంచం మొదలైందే నాతో: సందీప్ కిషన్

Sundeep Kishan: ‘విక్రమ్’ నుంచి అందుకే తప్పుకున్నా, లోకేష్ కనగరాజ్ ప్రపంచం మొదలైందే నాతో: సందీప్ కిషన్

టాప్ స్టోరీస్

MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం

MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం

Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !

Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !

TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

BJP Govt: మోడీ సర్కార్‌కు షాక్ ఇచ్చిన సర్వే, ఆరేళ్లలో పెరిగిన అసంతృప్తి!

BJP Govt: మోడీ సర్కార్‌కు షాక్ ఇచ్చిన సర్వే, ఆరేళ్లలో పెరిగిన అసంతృప్తి!