ABP Desam


ధనస్సు రాశివారికి 2023 ఆరంభం కన్నా ఎండింగ్ అదుర్స్


ABP Desam


ధనస్సు రాశివారు ఈ ఏడాది శుభవార్తలు వింటారు, సాధించాలి అనుకున్న పనులు ఇబ్బందులున్నా పూర్తిచేస్తారు. వివాహ జీవితం బావుంటుంది,ప్రేమ విషయంలోనూ సానుకూల ఫలితాలుంటాయి.


ABP Desam


2023లో ఈ రాశివారి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయాన్ని పెంచుకునేందుకు అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్, ఆగస్, సెప్టెంబరు నెలలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి..ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవాలి


ABP Desam


ఏడో స్థానంలో సూర్యుడి సంచారం వల్ల వివాహితుల జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామిపట్ల ప్రేమ రెట్టింపు అవుతుంది. మీ ప్రతి పనిలోనూ మీకు మీ జీవితభాగస్వామి తోడు ఉంటుంది. కుటుంబం పట్ల బాధ్యత పెరుగుతుంది.


ABP Desam


2023లో ఆరోగ్యపరంగా చూస్తే..ఆజాగ్రత్త అనారోగ్యాన్ని పెంచుతుంది...దానికి మూల్యం చెల్లించుకునేకన్నా ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. పొట్టకు సంబంధించిన ఇబ్బందులు రావొచ్చు...


ABP Desam


ప్రేమికులు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సిన సమయం ఇది. సంవత్సరం ప్రారంభంలో రాహువు 5వ ఇంట్లో ఉన్నాడు. ఏడాదిలో మొదటి అర్థభాగం వివాదాలతో మీ బంధం నడిచినా ఆ తర్వాత బావుంటుంది


ABP Desam


ఈ ఏడాది ధనస్సు రాశివారు వృత్తి, ఉద్యోగాల్లో కొంత జాగ్రత్త అవసరం. సంవత్సరం ప్రారంభం మీకు అనుకూలంగా ఉంటుంది కానీ ఆ తర్వాత సమస్యలు తప్పవు.


ABP Desam


ఉద్యోగంలో మార్పు మీకు అనుకూలంగా ఉంటుంది కానీ దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.


ABP Desam


ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఉద్యోగం మారే అవకాశం ఉంది...అయితే వీలైనంత వరకూ మారకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే మళ్లీ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సానుకూల ఫలితాలు పొందుతారు.


ABP Desam


నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు