ABP Desam


2023 ఈ రాశుల మహిళలకు అదృష్టాన్ని తెస్తోంది


ABP Desam


గ్రహాలు నెలకోసారి రాశి మారుతుంటాయి. ఆ ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. కొందరికి అనుకూల ఫలితాలుంటే మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలుంటాయి.


ABP Desam


2023లో కొన్ని రాశులవారికి అనుకూల ఫలితాలుంటే మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలుంటాయి. అయితే ఈ నాలుగు రాశుల స్త్రీలకు మాత్రం శుభపలితాలున్నాయి అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఆ రాశులేంటో చూద్దాం...


ABP Desam


మేష రాశి
మేషరాశి స్త్రీలకు 2023 సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. గతేడాది కన్నా ఈ ఏడాది మంచి ఫలితాలు పొందుతారు. స్థిరమైన ఉద్యోగం సంపాదించుకుంటారు. విద్యార్థులకు శుభసమయం. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం వద్దు.


ABP Desam


కర్కాటక రాశి
కర్కాటక రాశి స్త్రీలకు కూడా 2023 అదృష్టాన్నిస్తుంది. ఎప్పటి నుంచో అనుకున్న పనులు 2023లో పూర్తవుతాయి. అవివాహితులకు సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఇంటిని కొనుగోలు చేయాలని, పునర్నిర్మించాలి అనుకున్నవారికి శుభసమయం.


ABP Desam


ధనుస్సు రాశి
ధనుస్సు రాశి స్త్రీలకు కూడా 2023 శుభసమయం . తలపెట్టిన పనులు, కొత్త ప్రాజెక్టులు పూర్తిచేస్తారు. మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు చేసే మహిళలు లాభాలు పొందుతారు.


ABP Desam


గురువు బాగుంటే అన్ని బాగున్నట్లే అంటారు. ఎన్ని గ్రహాలు నీఛ స్థితిలో ఉన్నా గురుగ్రహం అనుగ్రహం ఉంటే వాటి ప్రభావం అంతగా ఉండదని చెబుతారు కొత్త ఏడాదిలో ఈ రాశులవారిపై బృహస్పతి అనుగ్రహం కూడా ఉండడం వల్ల అంతా శుభమే జరుగుతుంది.


ABP Desam


నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు


ABP Desam


Images Credit: Freepik