అన్వేషించండి

Karthika Deepam December 21st Update: దీప-కార్తీక్ ను శాశ్వతంగా విడగొట్టేందుకే రిపోర్ట్ మార్చాను, ద్యావుడా! చారుశీల మోనిత మనిషి!

కార్తీకదీపం డిసెంబరు 21 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Karthika Deepam  December 21st  Episode 1541 (కార్తీకదీపం డిసెంబరు 21ఎపిసోడ్)

శౌర్యని కలిసిన సౌందర్య..ఇంద్రుడు-చంద్రమ్మకి క్లాస్ వేస్తుంది. ఇకనైనా నాతోరా అని గట్టిగా అడుగుతుంది. అమ్మ నాన్న కనిపించకుండాపోవడానికి కారణమైన హిమ ఉన్న చోటుకి నేను రానంటుంది. మన కర్మకి అలా జరిగితే దానిని ఎందుకు అంటావే అయినా అమ్మానాన్నలు బతికే ఉన్నారని అంటున్నావు కదా మరి ఇంకా ఎందుకు దాని మీద కోపం అంటుంది సౌందర్య. అమ్మ నాన్నలు చనిపోవడానికి ఆ హిమనే కారణం ఇప్పటికీ ఇంకా అమ్మా నాన్నలను వెతకడానికి కారణం ఆ హిమ...అమ్మ నాన్న దొరికినా కూడా నేను ఆహిమను క్షమించను అంటుంది. 
సౌందర్య: అయినా మీ అమ్మా నాన్న చనిపోయారు..యాక్సిడెంట్ లోనేపోయారు
ఇంద్రుడు: అలా అనొద్దమ్మా వాళ్లు బతికే ఉన్నారు...కాసేపు ఆగి ఆ నమ్మకంతోనే శౌర్యమ్మ ఉంది
చారుశీల: మీరు కూడా అదే నమ్మకంతో ఉన్నారుగా
సౌందర్య: అవునమ్మా ఆ నమ్మకాలు ఆశలు మనుషుల్ని దగ్గర చేయాలి కానీ ఇలా దూరం చేయకూడదు కదా 
శౌర్య ని బలవంతంగా తీసుకెళ్తుండగా ఇంద్రుడు సౌందర్య కాళ్ల మీద పడి శౌర్యను తీసుకెళ్లొద్దని బతిమలాడుతారు. మీరు కూడా ఎన్నాళ్లంటే అన్నాళ్లు ఇక్కడే ఉండండి అని అడుగుతారు. మీకు తెలియకుండా ఇంకెక్కడికీ తీసుకెళ్లనని మాటిస్తాడు ఇంద్రుడు. శౌర్యని వాళ్ల దగ్గర వదిలేసి వెళ్లిపోతుంది సౌందర్య..

Also Read: కన్నీళ్లతో పుట్టింటికి బయలుదేరిన వసు, నీ వెనుక రిషి ఉన్నాడని గుర్తుపెట్టుకో అంటూ భరోసా!

దీప రిపోర్ట్స్ తీసుకుని వాళ్ల డాక్టర్ అన్నయ్య దగ్గరకు వెళుతుంది. దీప ఆ రిపోర్ట్స్ చూపించడంతో నీకు గుండె ఆపరేషన్ అయింది కదా అందుకు సంబంధించిన మెడిసిన్స్ ఇవి అని చెప్పగా నిజం చెప్పండి అన్నయ్య నా దగ్గర దాచొద్దు నా ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు కదా అని అనగా వెంటనే అతను ఇంతమంది డాక్టర్స్ ఉండగా నీ ప్రాణాలకు ప్రమాదం తెప్పిస్తామా అంటాడు. ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావు దీప అని అనగా ఆయన ప్రవర్తన నన్ను ఆలోచించేలా చేస్తుంది అన్నయ్య. నన్ను ఏ పనీ చేయనియ్యడం లేదనడంతో..బావగారికి నీ మీద ఉన్న ప్రేమ దాన్నే నువ్వు అనుమానిస్తున్నావు అంటాడు. దీపకి నచ్చచెబుతాడు..

మరొకవైపు కార్తీక్ దీప కోసం వెతుకుతుండగా ఇంతలో పండరీ వచ్చి దీపమ్మ గుడికి వెళ్ళింది అని చెప్పడంతో కార్తీక్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు సరే పండరి నాకు కొంచెం పని ఉంది నేను వెళ్తున్నాను నువ్వు వెళ్లి దీపని ఇంటికి తీసుకొని రా అంటుంది.  
పండరి: దీపమ్మ పాపని వెతకడం మీకు ఇష్టం లేదా 
కార్తీక్:  ఏం మాట్లాడుతున్నావు 
పండరి: అదే సారూ దీపమ్మకి పాపని చూపించడం మీకు ఇష్టం లేదని అనుకుంటున్నాను 
కార్తీక్: దీపకి హెల్త్ బాగోలేదు కాబట్టి నేను అలా మాట్లాడుతున్నాను పండరి 
పండరి: ఆ వ్యాధి కంటే ఈ మనో వ్యాధి చాలా ప్రమాదం సారు ఆ విషయం నాకంటే మీకే బాగా తెలుసు . ఆరోజు ఇంద్రుడు వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవడానికి కారణం కూడా మీరే అని నాకు అనుమానం వచ్చింది అని అంటుంది పండరి.
అప్పుడు కార్తీక్ వంట గురించి మాట్లాడడంతో నేనే ఏం మాట్లాడుతున్నాను మీరే మాట్లాడుతున్నారు సారు అని అడగగా ఆమె వ్యక్తిగత విషయాలు అడగడంతో పండరి మౌనంగా ఉంటుంది.

Also Read: సౌందర్యతో రానని తేల్చిచెప్పేసిన శౌర్య, దీపకు దొరికిపోయిన కార్తీక్, నిస్సహాయంగా చూస్తూ నిల్చున్న చారుశీల

చారుశీల ఇంటికొచ్చిన మరో డాక్టర్ అక్కడున్న దీప రిపోర్ట్స్ చూస్తుంది. ఇవేంటి ఇక్కడున్నాయి...ఈ రిపోర్ట్స్ ప్రకారం కార్తీక్ భార్య దీపకు ఎలాంటి అనారోగ్యం లేదుకదా అంటుంది. అప్పుడు చారుశీల తన నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. నేను ఆ మోనిత మనిషిని..నన్ను డాక్టర్ చదివించింది..తన హాస్పిటల్ నాకిచ్చేసి కార్తీక్ కోసం వెళ్లిపోయింది. ఇప్పుడు జైల్లో ఉన్న మోనిత నన్నో కోరిక కోరింది...కార్తీక్ నాకు దూరంగా ఉన్నా పర్వాలేదు కానీ దీపకు దగ్గరవకూడదని. అందుకే లేనిరోగం ఉందని చెప్పాను. రోగం ఉందనే భయంతోనే చచ్చిపోతుంది...కార్తీక్ ఒంటరిగా ఉండిపోతాడు..ఈలోగా నేను చేయాల్సింది నేను చేస్తానంటుంది..

మరొకవైపు కార్తీక్ ఇంద్రుడు కోసం హోటల్లో ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలోనే దీప కార్తీక్ ఉన్న హోటల్ దగ్గరికి వస్తుంది. అప్పుడు కార్తీక్ దీప దగ్గరికి వెళ్లి ఎక్కడికి వెళ్లావు దీప ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు. నేను హేమచంద్ర అన్న దగ్గరికి వెళ్లాను చిల్లర కోసం ఇక్కడికి వచ్చాను అని అంటుంది దీప. రిపోర్ట్స్ అన్నయ్యకు చూపించాను నాకు అంత ప్రమాదం లేదని తెలిసింది అని అంటుంది దీప. అప్పుడు కార్తీక్ ఇంద్రుడు ఇక్కడికి వచ్చేస్తాడు ఇంతలోనే దీపని పంపించాలి అని దీపని అక్కడినుంచి వెళ్ళమని చెబుతుండగా ఇంతలో ఇంద్రుడు అక్కడికి రావడంతో పక్కకు వెళ్లిపోమని సైగా చేస్తాడు. అప్పుడు దీప ఇంద్రుడిని చూసి డాక్టర్ బాబు ఆ ఇంద్రుడు వచ్చాడు అనడంతో లేదు దీప అనగా లేదు డాక్టర్ బాబు వెళ్తున్నాడు అని దీప, కార్తీక్ ఇద్దరు ఆ ఇంద్రుడిని ఫాలో అవుతూ వెళ్తారు. అప్పుడు ఇంద్రుడిని ఫాలో అవుతూ ఎలా అయినా పట్టుకోవాలి అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఇంద్రుడు తప్పించుకొని పోవడంతో దీప బాధపడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ మాత్రం హమ్మయ్య అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత దీపని ఇంటికి వెళ్ళమని నచ్చచెబుతాడు.

రేపటి( గురువారం) ఎపిసోడ్ లో
నిన్న హోటల్ దగ్గర ఇంద్రుడు కనిపించాడు..దొరికినట్టే దొరికి పారిపోయాడని కార్తీక్ చెబుతాడు.. నేను హోటల్లో అడుగుపెట్టేసరికి ఇంద్రుడకి డబ్బులిస్తూ కనిపించాడు నా డాక్టర్ బాబు...నా డాక్టర్ బాబే నన్ను మోసం చేస్తున్నారని అర్థమైంది అంటూ నిలదీస్తుంది దీప...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
New Zealand Parliament News : న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
New Zealand Parliament News : న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Embed widget