Karthika Deepam December 20th Update: సౌందర్యతో రానని తేల్చిచెప్పేసిన శౌర్య, దీపకు దొరికిపోయిన కార్తీక్, నిస్సహాయంగా చూస్తూ నిల్చున్న చారుశీల
కార్తీకదీపం డిసెంబరు 20 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Karthika Deepam December 20th Episode 1540 (కార్తీకదీపం డిసెంబరు 20ఎపిసోడ్)
డాక్టర్ చారుశీలను కలసి శౌర్య ఆచూకీ గురించి తెలుసుకోవాలి అనుకుంటుంది సౌందర్య..
సౌందర్య: కనిపించని నా కొడుకు కోడలి కోసం నేనెలా వెతుకుతున్నానో నా మనవరాలు కూడా అంతే తాపత్రయ పడుతోంది. కనీసం దాన్నైనా మాతో తీసుకెళ్లిపోతాం..ఆచూకీ ఏదైనా ఉంటే చెప్పండి
చారుశీల: లేదండీ..పాప వచ్చి పోస్టర్ అతికించి వెళ్లిపోయింది
సౌందర్య: వాళ్లకి మా మనవరాలిని ఇవ్వడం ఇష్టంలేదు..అందుకే ప్రతీసారీ ఇల్లు మారుతూ వెళ్లిపోతున్నారు
చారుశీల: మా డ్రైవర్ ని తోడుగా ఇచ్చి వాళ్లని ఇంటిదగ్గర దింపించాను..
సౌందర్య: అడ్రస్ ఇవ్వమ్మా...
చారుశీల: వద్దండీ..మీరు వెళ్లేలోగా ఏమైనా జరగొచ్చు.. అందుకే రేపు ఉదయం హాస్పిటల్ కి రండి వాళ్లని పిలిపిస్తాను
సరే అని సౌందర్య వెళ్లిపోతుండగా..కాసేపు ఉంచితే కార్తీక్ వాళ్ల అమ్మని చూసుకుంటారని ఆలోచిస్తుంది చారుశీల.. అప్పుడు సౌందర్యని మళ్లీ వెనక్కు పిలిచి..దీప-కార్తీక్ బతికి ఉన్నారని మీకు ఎందుకు అనిపిస్తోందని అడుగుతుంది. మీ మనవరాలికి ఎందకు అలా అనిపించిందని అడుగుతుంది..
సౌందర్య: అది కనిపిస్తే మొదటగా తెలుసుకోవాల్సింది ఆ విషయమే
ఇప్పుడు వెళ్లండి..రేపు హాస్పిటల్ కి తొందరగా రండి అంటుంది...
Also Read: పెళ్లి జరగనివ్వనని జగతికి వార్నింగ్ ఇచ్చిన దేవయాని- రిషిధారని విడగొట్టేందుకు స్కెచ్, రంగంలోకి రాజీవ్
ఇంద్రుడు-చంద్రమ్మ...ఇద్దరూ కూర్చుని శౌర్య గురించి ఆలోచిస్తుంటారు... త్వరలో మన జ్వాలమ్మ మనకి దూరంగా వెళ్లిపోతుందని భయమేస్తోందంటాడు ఇంద్రుడు. జ్వాలమ్మ మనతోపాటే ఉండాలని రాసిపెట్టి ఉంది..అందుకే వాళ్ల నాన్న కూడా మనదగ్గరే ఉంచమన్నారని సర్దిచెబుతుంది చంద్రమ్మ. ఇంతలో శౌర్య వచ్చి..చారుశీల మేడం కాల్ చేశారని చెబుతుంది. నేన్ను ఒక్కదాన్నే రమ్మన్నానరి శౌర్య చెప్పినప్పటికీ ఇంద్రుడు-చంద్రమ్మ కూడా బయలుదేరుతారు...
మరోవైపు దీపకు ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఇస్తాడు కార్తీక్. ఎప్పటిలా శౌర్య గురించి తలుచుకుంటూ ఇంద్రుడు-చంద్రమ్మ మనుషులేనా అని బాధపడతుంది. కార్తీక్ మాత్రం మనసులో అంతటికీ కారణం నేనే అని బాధపడతాడు. వీళ్లగురించి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని దీప అంటే..నువ్వు శౌర్య గురించి ఆలోచించవద్దు..నేనున్నాకదా అంటాడు కార్తీక్.ఈ మందులు ఇంకా ఎన్నాళ్లు వేసుకోవాలని దీప అడిగితే..నువ్వు ఉన్నన్నాళ్లూ అని మనసులో అనుకున్న కార్తీక్..ఇది ఆరు నెలల కోర్స్ అని చెబుతాడు. ఆతర్వాత అవసరం ఉండదా అని దీప అడిగితే..ఉండదు అనేసి అక్కడినుంచి వెళ్లిపోయి బాధపడతాడు....
Also Read: ఏడిపించేసిన డాక్టర్ బాబు- తల్లిని చూసి ఎమోషనల్ అయిన కార్తీక్, శౌర్యని చేరుకున్న సౌందర్య
హాస్పిటల్లో కూర్చుని ఉంటుంది సౌందర్య. అప్పుడే అక్కడకు వచ్చిన శౌర్య..సౌందర్యని చూసి వెనక్కు వెళ్లి ఇంద్రుడు-చంద్రమ్మకి చెప్పి వెళ్లిపోదాం పదండి అంటుంది. వెళ్లిపోయేలోగా సౌందర్య అక్కడకు వస్తుంది. ఇంద్రుడు-చంద్రమ్మని నిలదీస్తుంది. వాళ్లని పోలీసులకు అప్పగిస్తానని సౌందర్య అనడంతో..అంతా నా ఇష్టప్రకారమే చేస్తున్నారని చెబుతుంది శౌర్య. సౌందర్య: వీళ్లు నీ మనసు మార్చేశారు
శౌర్య: లేదు నానమ్మా నువ్వు మనసు మార్చుకున్నావ్.. ఆరోజు వస్తానని చెప్పి రాకుండా వెళ్లిపోయావు
సౌందర్య: ( మోనిత తలపగులగొట్టిన విషయం గుర్తుచేసుకుంటుంది)...ఆరోజు రాలేని పరిస్థితి
శౌర్య: అప్పుడు కూడా అమెరికా వెళ్లిపోయారు..నేను ఎవ్వరికీ అవసరం లేదు..
సౌందర్య: ఇప్పుడు రమ్మంటున్నాను కదా..నాతో రా..
శౌర్య: నేను రానని చెబుతున్నాను కదా..అమ్మా నాన్నలు దూరం కావడానికి కారణమైన హిమ ఉండేచోటుకి నేను ఉండలేను
సౌందర్య: మన కర్మకి జరిగినదానికి ఒకరు కారణం అని ఎలా అంటాం..
రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
నిన్న హోటల్ దగ్గర ఇంద్రుడు కనిపించాడు..దొరికినట్టే దొరికి పారిపోయాడని కార్తీక్ చెబుతాడు.. నేను హోటల్లో అడుగుపెట్టేసరికి ఇంద్రుడకి డబ్బులిస్తూ కనిపించాడు నా డాక్టర్ బాబు...నా డాక్టర్ బాబే నన్ను మోసం చేస్తున్నారని అర్థమైంది అంటూ నిలదీస్తుంది దీప...