అన్వేషించండి

Guppedanta Manasu December 20th Update: కన్నీళ్లతో పుట్టింటికి బయలుదేరిన వసు, నీ వెనుక రిషి ఉన్నాడని గుర్తుపెట్టుకో అంటూ భరోసా!

Guppedantha Manasu December 20th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గుప్పెడంత మనసు డిసెంబరు 20 ఎపిసోడ్  ( Guppedantha Manasu  December 20th Update Today Episode 638)

దేవయాని ఫోన్ మాట్లాడుతూ ఉండగా మహేంద్ర అక్కడికి వెళతాడు.. మహేంద్రని చూసి షాక్ అయిన దేవయాని ఏంటి చాటుగా మాటలు వింటున్నావా అని అడుగుతుంది. అదేం లేదు అలా వెళుతుండగా ఈ టైమ్ లో మిమ్మల్ని ఇక్కడ చూసి వచ్చానంటాడు. ఎవరో డబ్బు సాయం అడుగుతున్నారులే అని కవర్ చేసి మహేంద్రని పంపించేస్తుంది దేవయాని.  

మరుసటి రోజు ఉదయం అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో దేవయాని అక్కడికి వచ్చి ఏంటి మహేంద్ర మీరు  ఇంకా ఇలాగే ఉన్నారు. రెడీ అవ్వలేదా వసుధార వాళ్ళ ఇంటికి వెళ్లాలి కదా అనగా వెంటనే ఫణీంద్ర ఉన్నఫలంగా వెళ్ళాలి అంటే కష్టం కదా దేవయాని అని అంటాడు. అప్పుడు ఉన్నపలంగా ఏంటండీ పంతులుగారికి ఫోన్ చేసి ముహూర్తం చూడమని చెప్పాను అని అంటుంది. వీళ్ళిద్దరి కంటే ఎలాగో పట్టదు కనీసం నేనైనా ముందుండి ఇలాంటివన్నీ చేయించాలి కదా ...ఇలాంటి విషయాల్లో తొందర పడాలి లేకపోతే పనులు జరగవని అని బిల్డప్ ఇస్తుంది.  ఇంతకీ రిషి ఏం చేస్తున్నాడు రెడీ అవుతున్నాడా అంటుంది దేవయాని...

వంటిట్లో పనులు చేస్తున్న వసుని చూసి..ధరణి నువ్వెళ్లి రిషితో కబుర్లు చెప్పుకో వసుధార అని పింపిస్తుంది.  పర్వాలేదు మేడం అంటుంద వసు. ఇంతలో రిషి ఏ షర్టు వేసుకోవాలా అని ఆలోచిస్తూ వసుధారకి కొన్ని ఫొటోస్ పంపిస్తాడు. ఈ డ్రెస్ ఓకేనా అన్న మెసేజ్ చూసి...మీకు ఏదేనా బావుంటుంది కదా మీరు ప్రిన్స్ కదా అని రిప్లై ఇస్తుంది. ఎవరికి వారు రిలాక్స్ గా కూర్చోవడం చూసి దేవయాని ఏంటి అంతా మౌనంగా ఉన్నారని ఫైర్ అవుతుంది.  అప్పుడు ఫణింద్ర దేవయాని పై సీరియస్ అవుతూ ఎప్పుడూ వారిని ఏదో ఒకటి అనకపోతే మౌనంగా ఉండలేవా నువ్వు ఏదో ఏర్పాట్లు చేస్తున్నావ్ కదా నీ పని నువ్వు చేసుకో అని అంటాడు. ఇంతలోనే వసుధార అక్కడికి కాఫీ తీసుకొని వస్తుంది. అప్పుడు ఫణీంద్ర ...ఏం వసుధారా మనం వస్తున్నామని మీ ఇంట్లోవాళ్లకి కాల్ చేసి చెప్పావా అంటాడు. వసుని ఏదో ఒకటి అంటుండగా రిషి ఎంట్రీ ఇస్తాడు..

Also Read: సౌందర్యతో రానని తేల్చిచెప్పేసిన శౌర్య, దీపకు దొరికిపోయిన కార్తీక్, నిస్సహాయంగా చూస్తూ నిల్చున్న చారుశీల

దేవయాని: వచ్చావా మనం వసుధర వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా పెళ్లి గురించి మాట్లాడడానికి అని అంటుంది. అప్పుడు దేవయాని తెగ హడావిడి చేస్తూ ఉంటుంది. 
వసుధార: క్షమించండి... మీరు ఎవరు నాతో రావద్దు అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. 
దేవయాని: ఏంటి వసుధార మీరెవరు రావద్దు అంటున్నావ్ ఏంటి అనడంతో అవును మేడం మీరు ఈరోజు రావద్దు అని అనగా దేవయాని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటుంది
రిషి: వసుధారా అందరం వెళ్దాం అనుకున్నాం కదా ఇప్పుడు వద్దంటావ్ ఏంటి అని అడుగుతాడు.
వసు: సర్ మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నాయో తెలియదు అలాంటిది సడన్ గా వెళ్లి పెళ్లి ప్రస్తావని తీసుకొస్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు అందుకే నేను ముందుగా వెళ్లి వాళ్లకు చెప్పి ఆ తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని అంటుంది
మహేంద్ర: ఏం చెప్పాలి అనుకుంటున్నావో చెప్పు వసుధార 
వసుధార: మాది మధ్యతరగతి కుటుంబం నేను జీవితం మీద లక్ష్యంతో చదువుకోడానికి ఇలా బయటకు వచ్చాను. పెళ్లి పీటల మీద నుంచి లేచి వచ్చేసాను ఎన్నో సమస్యలను,కష్టాలను ఎదుర్కొన్నాను అని కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడుతుంది. అందుకే ప్రస్తుతానికి నేను ఒక్కదాన్నే వెళ్తాను అని అంటుంది. నాకు కొంచెం టైం కావాలి అని అక్కడికి వెళ్లి ఇక్కడ పరిస్థితులు అని చెప్పి వాళ్ళంతట వాళ్లే మిమ్మల్ని పిలిపించేలా చేస్తాను అని అంటుంది. ఇన్ని రోజుల తర్వాత ఇంటికి వెళ్తున్నాను అక్కడ మా నాన్న కోపంతో నన్ను ఒక్క మాట అన్నా పర్వాలేదు మిమ్మల్ని ఒక్క మాట అంటే అది మర్యాద కాదు అందుకే నేను ఒక్కదాన్నే వెళ్తాను అని అంటుంది. 
దేవయాని: ఏదేదో మాట్లాడుతుంది
జగతి: వసుధార వాళ్ళ నాన్న గురించి మీకు తెలియదు... వసుధార అన్న మాటలు గురించి ఒక్కసారి ఆలోచించండి అని చెబుతుంది. 
రిషి:వసుధార చెప్పిన దాంట్లో నిజం ఉంది. తన ఇంట్లోని పరిస్థితులు మనకు ఎలా తెలుస్తాయి చెప్పండి,తన అభిప్రాయాన్ని గౌరవించి తనని ఫస్ట్ పంపిద్దాము అనడంతో దేవయాని షాక్ అవుతూ అందరు ఒక్కటయ్యారు అనుకుంటూ ఉంటుంది. 

Also Read: పెళ్లి జరగనివ్వనని జగతికి వార్నింగ్ ఇచ్చిన దేవయాని- రిషిధారని విడగొట్టేందుకు స్కెచ్, రంగంలోకి రాజీవ్

వసుధార వెళుతూ వెళుతూ రిషిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎందుకు ఏడుస్తున్నావని రిషి అడిగితే..మీరు చూపిస్తున్న ప్రేమకు అని అంటుంది..ఏం జరిగినా నీ వెనుక రిషి ఉన్నాడన్న విషయం గుర్తుపెట్టుకో అని అంటాడు.. కార్లో ఎందుకు బస్సులో వెళ్లేదాన్ని కదా అంటే.. ఇది నీ హక్కుగా బావించాలంటాడు. ఆ తర్వాత వసుధార వెళుతుండగా మెసేజ్ చేస్తాడు...నేను ఒక్కదాన్నే వెళ్లాలనుకున్న నిర్ణయం నాదికాదు సార్..జగతిమేడం-మేహంద్ర సార్ ది అని జరిగిన విషయం తలుచుకుంటుంది. నువ్వు-రిషి బావుండాలి వసుధారా దీనికోసం మేం ఇద్దరం ఏం చేయమన్నా చేస్తాం అని మహేంద్ర జగతి చెబుతారు. మీ ఊరికి మేం ఎవ్వరం రావడం లేదంటుంది జగతి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Embed widget