Karthika Deepam ఫిబ్రవరి 23 ఎపిసోడ్: ఆపరేషన్ బ్లడ్ రిలేషన్, మోనిత కొడుకు చుట్టూ తిరుగుతున్న కథ, కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ ఫిబ్రవరి 23 బుధవారం 1283 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

FOLLOW US: 

కార్తీకదీపం ఫిబ్రవరి 23 బుధవారం ఎపిసోడ్

హోటల్ పని చేస్తూనే అవకాశాలు వెతుక్కో అప్పారావ్ అని చెబుతుంది సౌందర్య. మీ ఇంట్లో అందరూ మంచోళ్లే అని ఆకాశానికెత్తేస్తాడు అప్పారావు. దీపక్క ఫొటోలు, రేషన్ కార్డులు, టీసీలు తీసుకురమ్మందని చెప్పి సంచిలో ఉన్న ఫొటోలన్నీ తీసి సౌందర్య చేతిలో పెడతాడు. శ్రీవల్లి-కోటేష్ ఫొటో చూసి సౌందర్య షాక్ అవుతుంది ( మోనిత బాబుని ఎత్తుకెళ్లిన కోటేష్ వీడియో గుర్తుచేసుకుంటుంది). ఫోన్లో వీడియోని, ఫొటోని మార్చి మార్చి చూసి అవాక్కవుతుంది. వీళ్లకి ఎంతమంది పిల్లలు అని అడిగితే..వీళ్లకి పిల్లలు లేరు, ఎక్కడి నుంచో బాబుని తీసుకొచ్చారంట, అక్కా బావ తెచ్చింది వీళ్ల బాబునే కదా అని క్లారిటీ ఇస్తాడు అప్పారావు.  ఆనంద్ అంటూ పిల్లలు మురిసిపోవడం, తమ్ముడిని బాగా చూడు నాన్నలాగే ఉంటాడు కదా అన్న శౌర్య మాటలు, నాన్న ఎత్తుకోగానే సైలెంట్ అయిపోతాడన్న హిమ మాటలు గుర్తుచేసుకుంటుంది. ఏం చేయాలనుకుంటున్నావ్ దేవుడా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. 

తన బాబు కార్తీక్ దగ్గరనున్నాడన్న నిజం తెలుసుకున్న మోనిత ఉయ్యాల్లో బాబు బొమ్మని చూసి మురిసిపోతుంది. ఆనందరావుగారు మీ నాన్నగారు నన్ను కొట్టారు పర్వాలేదు కొట్టే హక్కు తనకి ఉంది, పడేంత ప్రేమ ఉంది...మీరు అమ్మను వదిలేసి ఎక్కడికో వెళ్లారని బాధపడ్డాను కానీ మీరు నాన్న దగ్గర ఉన్నారా మీరు సూపర్, మీ నాన్నగారు నన్ను కొట్టారు, నేను కట్టుకున్న తాళిని తెంపేశారు, మీరు మాత్రం నాకు హెల్ప్ చేయడానికి నాన్న దగ్గరకి వెళ్లి ఆనందంగా ఉన్నావన్నమాట. కొన్నాళ్లు అక్కడే ఉండు మిమ్మల్ని వెతకమని మీ నాన్నకి చెప్పాను, కొన్నాళ్లకు నీపై ప్రేమ పెరుగుతుంది, నిన్ను వదులుకోలేరు, అప్పుడు నేను వస్తాను, అప్పుడు నేను అసలు డ్రామా మొదలుపెడతా అని మరోసారి తనలో క్రూరత్వాన్ని బయటపెడుతుంది. ఇన్నాళ్లూ మీకోసం ఏడ్చా, బాధపడ్డా కానీ రావాల్సినంత ఏడుపు రాలేదేంటి అనుకున్నా  కానీ కారణం ఇదన్నమాట. నువ్వు అందర్నీ కలుపుతావ్, దేవుడా నువ్వున్నావ్ థ్యాంక్యూ అని క్రూరంగా నవ్వుతుంది.

Also Read: శ్రీవారు అన్న వసు పిలుపుతో మైమరిచిన రిషి, స్పెషల్ థ్యాంక్స్ చెప్పేందుకు ప్లాన్స్, గుప్పెడంతమనసు మంగళవారం ఎపిసోడ్
ఇంట్లో కూర్చున్న సౌందర్య బాబు గురించి ఆలోచిస్తుంటే హిమ, శౌర్య  నానమ్మ అంటూ బాబుని తీసుకొస్తారు. వీడు బలే ముద్దుగా ఉంటాడు కదా అంటారు. నువ్వొచ్చాక వీళ్లకి కష్టాలు తీరిపోయాయి అని గతంలో అన్న మాట గుర్తుచేసుకుంటుంది. వీడొచ్చినప్పటి నుంచీ కష్టాలు వచ్చి తీరిపోతున్నాయని అనుకుంటున్నారు కానీ వీడే పెద్ద కష్టం తెచ్చిపెట్టాడని మీకు ఎలా చెప్పాలనుకుంటుంది. ఈ విషయం మీకు చెప్పలేను-మానలేను ఇప్పుడేం చేయాలనే ఆలోచనలో పడుతుంది. ఇంతలో బాబుని సౌందర్యకి ఇచ్చి పాలు తేవడానికి వెళతారు పిల్లలు. ఏదో ఆలోచించిన సౌందర్య కానిస్టేబుల్ రత్నసీతకు కాల్ చేసి ఏదో మాట్లాడుతుంది. ఈశ్వరా మళ్లీ మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నావ్, ఎందుకు మాకీ పరీక్ష అనుకుంటుంది. 

మళ్లీ మోనితని నమ్ముతున్నారా అని క్వశ్చన్ చేస్తుంది దీప. మనం  సంద్రంలో ఉన్నాం మనం ఎంచుకోవడానికి వేరే దారులు లేవు, దీన్ని ఉపయోగించుకుందాం అంటాడు. మోనిత నిలువెల్లా విషం నింపుకున్న మనిషి, ఇంకా దాన్ని ఎలా నమ్ముతున్నారని దీప అన్నా....నువ్వు భయపడడంలో అర్థం ఉంది కానీ మరో ఆప్షన్ లేదంటాడు. మోనితని చంపేసి జైలుకి వెళ్లాలన్న కసి, కోపం ఉంది.... కుటుంబంపై బాధ్యత, ప్రేమ ఉన్నాయి కాబట్టి పిచ్చెక్కిపోతున్నా ఓపిక పడుతున్నా అంటాడు. మోనిత బిడ్డని వెతికి పట్టుకుని మోనితకి అప్పగిస్తాను అన్న కార్తీక్ తో దీప ఏదో చెప్పబోయినా కార్తీక్ వినిపించుకోడు.

ఇంట్లో బాబుతో ఆడుకుంటూ ఉంటారు హిమ,శౌర్య. ఇంతలో అక్కడకు వచ్చిన దీప....తమ్ముడిపై ప్రేమతో ఎక్కువసార్లు పాలు తాగించకూడదంటుంది. నాన్న మనం ఎక్కడికైనా బయటకు వెళదామా అని శౌర్య అడిగితే నేను అలసిపోయా అంటాడు. ఏమైందని తండ్రి అడిగితే...ఏం లేదు అన్న కార్తీక్...తమ్ముడిని నాకివ్వరా కొంతసేపు ఆడుకుంటా, వాడిని ఎత్తుకుంటే నాకు రిలీఫ్ గా ఉంటుందంటాడు. నీ దగ్గర ఏ మహిమ ఉందిరా నిన్ను ఎత్తుకోగానే అలసటంతా పోతుంది, మాకు అందరికీ సంతోషాన్నివ్వడానికే మా ఇంటికి వచ్చావా అంటాడు కార్తీక్. ఎందుకలా ఉన్నాడని సౌందర్య దీపని అడిగితే..హాస్పిటల్లో పెద్ద గొడవ జరిగిందని చెప్పి...మోనిత బాబుని వెతికిస్తానని కార్తీక్ మాటిచ్చిన విషయం చెబుతుంది.  ఇంట్లోనే బాబుని పెట్టుకుని ఎక్కడ వెతుకుతావురా పెద్దోడా అనుకుంటుంది. ఇంట్లో అందరకీ సంతోషాన్నిస్తోన్న ఈ బాబు మోనిత బాబు అని తెలిస్తే వీళ్ల పరిస్థితేంటి, ఇంట్లో ఏదో కీడు జరగబోతోందని అనిపిస్తోంది...మాకు ఏంటీ పరీక్ష అనుకుంటుంది.

Also Read:  థను మలుపు తిప్పిన అప్పారావ్, సౌందర్య ఇప్పుడేం చేయబోతోంది, కార్తీకదీపం మంగళవారం ఎపిసోడ్
నా ట్యాబ్లెట్స్ కనిపించలేదన్న ఆనందరావుకి మందులు అందిస్తుంది సౌందర్య. ఏంటి పిల్లలు పడుకున్నారా అని అడిగితే...బాబుతో ఆడుతున్నారని చెబుతుంది. వాళ్లు బాబుతో ఎక్కడ లేని అనుబంధం పెంచుకుంటున్నారు, ఇన్నాళ్లూ దీపుతో ఆడుకున్నారు, ఇప్పుడు ఇంకో తమ్ముడు దొరికాడు తప్పేముంది అంటాడు. ఏంటి అలా ఉన్నావ్ అని అడిగినా ఏం లేదు అనేస్తుంది సౌందర్య. మళ్లీ రెట్టించి అడిగితే... బాబుని విడిచి పిల్లలు ఒక్క క్షణం కూడా ఉండడం లేదన్న సౌందర్య, మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు, ఈ విషయాన్ని మనసులో దాచుకోలేకపోతున్నాను, ఎవరితోనూ పంచుకోలేకుండా ఉన్నాను, మీరు టెన్షన్ పడనంటే చెబుతానంటుంది. నేను హార్ట్ పేషెంట్ ని అని భయపడుతున్నావా, కార్తీక్ ఇల్లు వదిలి వెళ్లినప్పుడే తట్టుకోగలుగుతున్నాను అంతకంటే కష్టం ఏముంటుంది చెప్పు అంటాడు ఆనందరావు. ఇంట్లో ఉన్న ఆనంద్ మోనిత కొడుకు అని చెప్పేస్తుంది. మోనిత బిడ్డని మనింట్లో పెట్టుకున్నామా, ఎప్పుడైతే ఆమె బిడ్డను కన్నదో అప్పటి నుంచి మన కష్టాలు పదింతలు ఎక్కువయ్యాయి, బిడ్డ తప్పిపోయాడని తను అరుస్తోంది, తప్పిపోయిన బిడ్డ మనింట్లో చేరడం ఏంటని నిలదీస్తాడు. ఈ విషయం నీకెలా తెలిసిందని అడుగుతాడు ఆనందరావు. 

రేపటి ( గురువారం) ఎపిసోడ్ లో
శౌర్య, హిమ బాబుతో ఆడుకుంటుండగా మోనిత తీసుకోబోతంది. బాబుని మోనిత చేతుల్లోంచి లాక్కున్న దీప వీడు మా బంగారుకొండ ముట్టుకోకు అంటుంది. ఎక్కడి నుంచో తెచ్చుకున్న బిడ్డని అని మోనిత అనేలోగా..వీడు మా బిడ్డ అని చెబుతుంది దీప. 

Published at : 23 Feb 2022 08:52 AM (IST) Tags: Karthika Deepam Nirupam Paritala premi viswanath karthika deepam latest episode Sobha Shetty కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ karthika Deepam Serial Today Episode Vantalakka కార్తీకదీపం Karthika Deepam 23rd February Episode 1283

సంబంధిత కథనాలు

Adivi Sesh: ఆ సీన్లు పెడితే నమ్మేవారు కాదు - 'మేజర్' సినిమాపై అడివి శేష్ వ్యాఖ్యలు

Adivi Sesh: ఆ సీన్లు పెడితే నమ్మేవారు కాదు - 'మేజర్' సినిమాపై అడివి శేష్ వ్యాఖ్యలు

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ 'కే3 కోటికొక్కడు' రిలీజ్ ఎప్పుడంటే?

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ 'కే3 కోటికొక్కడు' రిలీజ్ ఎప్పుడంటే?

Allu Sirish: ముంబైలో అల్లు శిరీష్ - ఏం చేస్తున్నాడంటే?

Allu Sirish: ముంబైలో అల్లు శిరీష్ - ఏం చేస్తున్నాడంటే?

F3 Movie OTT Release: 'ఎఫ్3' ఓటీటీ రిలీజ్ అప్డేట్ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

F3 Movie OTT Release: 'ఎఫ్3' ఓటీటీ రిలీజ్ అప్డేట్ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

Prabhas: యాక్షన్ డోస్ పెంచమంటున్న ప్రభాస్ - ఫ్యాన్స్ కోసం నొప్పి కూడా లెక్క చేయకుండా!

Prabhas: యాక్షన్ డోస్ పెంచమంటున్న ప్రభాస్ - ఫ్యాన్స్ కోసం నొప్పి కూడా లెక్క చేయకుండా!

టాప్ స్టోరీస్

IPL 2022 Final Prize Money: ఐపీఎల్ ప్రైజ్‌మనీ వివరాలు ఇవే - ఆటగాళ్లపై కనకవర్షం - ఎవరికి ఎంత లభించనుందంటే?

IPL 2022 Final Prize Money: ఐపీఎల్ ప్రైజ్‌మనీ వివరాలు ఇవే - ఆటగాళ్లపై కనకవర్షం - ఎవరికి ఎంత లభించనుందంటే?

UIDAI Update: మాస్క్‌ ఆధార్‌ వినియోగంపై కేంద్రం వెనక్కి! తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ

UIDAI Update: మాస్క్‌ ఆధార్‌ వినియోగంపై కేంద్రం వెనక్కి! తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ

Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు

Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు

Infinix Note 12 Flipkart Sale: ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 సేల్ ప్రారంభం - అదిరిపోయే ఫీచర్లు - ఎలా ఉందో చూశారా?

Infinix Note 12 Flipkart Sale: ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 సేల్ ప్రారంభం - అదిరిపోయే ఫీచర్లు - ఎలా ఉందో చూశారా?