Guppedantha Manasu ఫిబ్రవరి 22 ఎపిసోడ్: శ్రీవారు అన్న వసు పిలుపుతో మైమరిచిన రిషి, స్పెషల్ థ్యాంక్స్ చెప్పేందుకు ప్లాన్స్, గుప్పెడంతమనసు మంగళవారం ఎపిసోడ్
గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రోజు రోజుకీ వసు-రిషి ప్రేమ బలపడుతున్నా గౌతమ్ కి ఇప్పుడిప్పుడే డౌట్స్ వస్తున్నాయి. ఫిబ్రవరి 22 మంగళవారం ఎపిసోడ్ లోనూ షార్ట్ ఫిలిం హడావుడే నడిచింది
గుప్పెడంత మనసు (Guppedantha Manasu) ఫిబ్రవరి 22 మంగళవారం ఎపిసోడ్
వసుధార వడ్డించు అంటూ సంతోషంగా కూర్చుంటాడు గౌతమ్. జగతి మాత్రం దూరంగా నిల్చున్న కొడుకు రిషిని చూస్తుంటుంది. వసు నేను వెళతాను నువ్వు వడ్డించు అనడంతో వద్దులెండి మేడం మీరు ఇక్కడే ఉండండి నేనే రిషి సార్ దగ్గరకి వెళతాను అని బాక్స్ తీసుకెళుతుంది. రండి తిందాం అని పిలుస్తే కాసేపు ఆగి తింటానంటాడు. ఇప్పటికే లేట్ అయిందని పిలవడంతో వెళతాడు. ఆకులు ప్లేట్స్ లో పడతాయి కదా అని రిషి అనడంతో చెట్టుకి చున్నీ కడదాం అంటుంది ( చున్నీ కడుతూ ఒకర్నొకరు చూసుకుంటూ ఓ లవ్ సాంగ్). ఆ చున్నీ కింద కూర్చుని ఇద్దరూ కలసి భోజనం చేస్తారు. ఇంత అవసరమా రూమ్ లోకి వెళ్లి తింటే సరిపోతుంది కదా అని రిషి అంటే...ఇవన్నీ జీవితంలో అందమైన క్షణాలు అని ఎప్పటిలా లెక్చర్ ఇస్తుంది. ఇదంతా చూస్తూ గౌతమ్ ఫీలైపోతుంటాడు. నా తొందరపాటు వల్లే ఇక్కడ ఇరుక్కుపోయాను లేదంటే నేను కూడా వసుధారతో పాటూ వెళ్లేవాడని అనుకుంటాడు.
చీరలో ఉన్న వసుధారని అలా చూస్తూ ఉండిపోతాడు రిషి. ఏంటి అలా చూస్తున్నారని అడిగితే...ఈ చీరలో నువ్వు చాలా బావున్నావ్ అని కాంప్లిమెంట్ ఇస్తాడు. అచ్చం పంతులమ్మలా ఉన్నావ్ అంటే..టీచర్ అవ్వాలన్నది నా కోరిక అందుకే ఈ పాత్రలో ఏదో తెలియని ఆనందం ఉందిసార్ అంటుంది. మీకు చిన్నప్పుడు ఏమవ్వాలని ఉండేది అంటే పెద్దవ్వాలని ఉండేది అని సరదాగా చెబుతాడు. నా యాక్టింగ్ అని వసు నసుగుతుంటే చాలా బావుందంటాడు. ఆ పాత్రలో నువ్వు నిజంగానే ఒదిగిపోయావ్ అని రిషి చెబుతుంటే మురిసిపోతుంటుంది వసుధార. నీ నవ్వు కూడా బావుంటుందని రిషి చెబితే..మీరుకూడా నవ్వితే చాలా బావుంటారు సార్ అంటుంది వసుధార.
Also Read: కథను మలుపు తిప్పిన అప్పారావ్, సౌందర్య ఇప్పుడేం చేయబోతోంది, కార్తీకదీపం మంగళవారం ఎపిసోడ్
మరోవైపు డైరెక్టర్ వచ్చి రిషితో మాట్లాడుతూ గౌతమ్ ని సరిగా చేయమని చెప్పండి అంటాడు. పిల్లలకి సంబంధించిన షూటింగ్ త్వరచగా పూర్తిచేయండి అదంతా మీరు చూసుకోండి అని జగతికి చెబుతాడు. మహేంద్ర, గౌతమ్, వసుధార నవ్వుకుంటుంటే అక్కడకు వెళతాడు రిషి. జోక్ చెప్పాను నవ్వుతున్నారు చెప్పనా అని అంటే..ఇందాక నీ యాక్టింగ్ చూశాను అంతకన్నా పెద్ద జోక్ ఏముందని ఆటపట్టిస్తాడు. రిషి ఆటపట్టించకు గౌతమ్ కి యాక్టింగ్ నేర్పించు అని మహేంద్ర అంటే...వీడు యాక్టింగ్ నేర్పించడం ఏంటి ఇదే పెద్ద జోక్ అంటాడు గౌతమ్. కొన్ని చెబుతాను ఫాలో అవ్వండి అని చెబుతాడు. ఆ తర్వాత షాట్ రెడీ అవుతుంది. మళ్లీ యధావిధిగా గౌతమ్ టేక్స్ మీద టేక్స్ తీసుకుంటాడు. రిషికి విసుకొచ్చి గౌతమ్ నువ్వు లే అని చెప్పి ఆప్లేస్ లో కూర్చుంటాడు. చుట్టూ ఉన్నవాళ్లంతా షాక్ అవుతారు.
రిషి ఆ ప్లేస్ లో కూర్చోవడం చూసి...ఇప్పుడు నేను రిషి సార్ ని ఏవండోయ్ శ్రీవారు అనాలా అని ఇబ్బంది పడుతుంది. అలా పిలిచేందుకు తడబడుతుంది. గమనించిన రిషి ధైర్యం చెబుతాడు. జగతి-మేహంద్ర ఇదంతా చూసి నవ్వుకుంటారు. ఆ తర్వాత ధైర్యం తెచ్చుకున్న వసుధార ఏవండోయ్ శ్రీవారు అంటూ డైలాగ్ చెబుతుంది. ఏవండోయ్ శ్రీవారు అని పిలవగానే రిషి నిజంగానే ఇన్వాల్వ్ అయిపోతాడు. ఆదివారం ఆఫీస్ వర్క్ చేయకూడదు...కుటుంబానికి టైమ్ ఇవ్వాలి అనేసరికి సరే అని చేయి పట్టి పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఆ సీన్ విజిల్స్ వేయించేలా పండిస్తారు ఇద్దరూ. చుట్టూ ఉన్నవారంతా రిషిని పొగిడేస్తారు. అంటే నేను వేస్ట్ అన్నట్టా అని గౌతమ్ ఫీలవుతాడు. ఈ క్యారెక్టర్ సార్ తో చేయిద్దాం అంటాడు డైరెక్టర్. ఎట్టకేలకు షూటింగ్ పూర్తవుతుంది. ్ంతా కలసి పార్టీ చేసుకుంటారు. ఏంట్రా హ్యాపీనా అని గౌతమ్ ని రిషి అడిగితే...నువ్వు బాగా చేయాలనే కదా ప్రతిసీన్ ముందు నేను యాక్ట్ చేసి చూపించానంటాడు రిషి. మరి వాళ్లు నీకు చప్పట్లు కొట్టారు కానీ నాకు కొట్టలేదని గౌతమ్ అంటే ఇప్పుడు నేను కొడతాను అంటాడు రిషి. స్పెషల్ గా వసుధారని పొగుడుతాడు రిషి.
Also Read: రిషిని ఏవండోయ్ శ్రీవారు అన్న వసుధార, షాక్ అయిన జగతి-గౌతమ్, గుప్పెడంతమనసు సోమవారం ఎపిసోడ్
రిషి సార్ మెచ్చుకున్నందుకు నాకు ఈ రోజు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని సంబరపడుతుంది వసుధార. ఎప్పుడూ సీరియస్ గా ఉండే రిషి సార్ మెచ్చుకుంటే ఏదో తెలియని ఆనందం అంటుంది వసుధార. మరోవైపు రిషి కూడా ఫుల్ హ్యాపీగా ఉంటాడు. షార్ట్ ఫిలిం మొత్తం దగ్గరుండి చూసుకున్నా చాలా బాగావచ్చిందని సంబరపడతాడు.
రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
ఏవండోయ్ శ్రీవార్ అన్న వసుధార మాటలు గుర్తుచేసుకుని ఊహల్లో మునిగిపోతాడు రిషి. మరోవైపు వసుధార కూడా అదే ఆలోచిస్తూ షార్ట్ ఫిలిం విషయంలో హ్యాపీనా అని మెసేజ్ చేస్తుంది. చాలా హ్యాపీ అంటూ నీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అని రిప్లై ఇస్తాడు. గతంలో హగ్ చేసుకుని థ్యాంక్స్ చెప్పిన సందర్భం గుర్తుచేసుకుంటుంది వసు. కట్ చేస్తే కాలేజీలో ఇద్దరూ తను పిలవాలంటే తను పిలవాలి అనుకుంటూ ఇద్దరూ ఒకేసారి చూసుకుంటారు. మాట్లాడుకునే లోగా గౌతమ్ రావడంతో వసు నువ్వు క్లాస్ కి వెళ్లు అని పంపించేస్తాడు.