అన్వేషించండి

Guppedantha Manasu ఫిబ్రవరి 21 ఎపిసోడ్: రిషిని ఏవండోయ్ శ్రీవారు అన్న వసుధార, షాక్ అయిన జగతి-గౌతమ్, గుప్పెడంతమనసు సోమవారం ఎపిసోడ్

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రోజు రోజుకీ వసు-రిషి ప్రేమ బలపడుతున్నా గౌతమ్ కి ఇంకా క్లారిటీ రావడం లేదు. ఫిబ్రవరి 21 సోమవారం ఎపిసోడ్ మొత్తం షార్ట్ ఫిలిం హడావుడి నడిచింది

గుప్పెడంత మనసు  ఫిబ్రవరి 21 సోమవారం ఎపిసోడ్
వసుధార దగ్గరకు వెళుతున్న రిషి వెనుకే ఫాలో అవుదామనుకున్న గౌతమ్ ని తప్పించుకుని రిషి వెళ్లిపోతాడు. బయట కారు హారన్ వినిపించగానే రిషి సార్ అనుకుంటూ హడావుడిగా వెళ్లిపోతుంటే  వసూ అని పిలుస్తుంది జగతి మేడం. బాయ్ మేడం అన్న వసు సమాధానానికి ముందు షాక్ అయి ఆ తర్వాత నవ్వుకుంటుంది. ఏంటి విశేషాలు అంటూ మొదలు పెట్టి, మ్యూజిక్ ఆన్ చేయనా అని అడుగితే వద్దులెండి సార్ అంటుంది. మేడంకి కాల్ చేయి అనడంతో...మళ్లీ ఏం కొంప మునుగుతుందో అనుకుంటూ కాల్ చేస్తుంది వసుధార. ఇప్పుడేకదా వెళ్లింది ఇంతలో కాల్ ఏంటి అంటూ లిఫ్ట్ చేస్తుంది. రిషిసార్ మీతో మాట్లాడుతారంట అంటూ స్పీకర్ ఆన్ చేస్తుంది. షార్ట్ ఫిలిం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ అనేసి కాల్ కట్ చేస్తాడు. వసు-జగతి షాక్ లో ఉండిపోతారు.

దేవయాని-ఫణీంద్ర
కాలేజీలో షూటింగ్ చూసేందుకు వెళుతున్నా అంటూ ఫణీంద్రకి చెబుతుంది దేవయాని. అస్సలు నువ్వు రిషికి చెప్పావా అంటే... మన కాలేజీలో జరిగే దానికి పర్మిషన్ తీసుకోవాలా అంటుంది. అలా ఆలోచించుకోవడం అహంకారం అవుతుంది..పద్ధతి ప్రకారం నడుచుకోవాలి కదా అని క్లాస్ పీకుతాడు. ఇప్పుడే కాల్ చేసి కనుక్కుంటా అంటాడు ఫణీంద్ర. నా కాలేజీలో నా కొడుకు దగ్గరకు వెళ్లేందుకు ఎవరి పర్మిషన్ తీసుకోవాలి ఇది నాకు అవమానం అంటుంది. అయినప్పటికీ రిషికి కాల్ చేసిన ఫణీంద్ర...మీ పెద్దమ్మ కాలేజీలో షూటింగ్ చూసేందుకు బయలుదేరింది నేను వద్దన్నాను అని చెబుతాడు. అదేంటి అలా చెప్పారని క్వశ్చన్ చేస్తుంది దేవయాని. నిజమే నువ్వు షూటింగ్ చూసేందుకు వెళుతున్నావని నేను అనుకోవడం లేదు, నువ్వెందుకు వెళుతున్నావో నీకు తెలుసు నాక్కూడా తెలుసు అందుకే వద్దన్నాను అంటాడు. అంటే నేను జగతిని ఏమైనా అంటానని భయపడుతున్నారా అంటే...జరిగేది అదే కదా దేవయాని, ఇంటికి పెద్దకోడలిగా నిన్ను గౌరవిస్తున్నాం నువ్వు నిలబెట్టుకో...నువ్వు చిన్న చిన్న పొరపాట్లు చేసినా, నోరు జారినా నీ స్థానానికి ఉన్న విలువ చూసి విషయాన్ని పెద్దది చేయడం లేదు...ఇది నువ్వు తెలుసుకుంటే నీకు మంచిది అని హెచ్చరిస్తాడు ఫణీంద్ర. ఇంట్లో అందరూ నాకు వ్యతిరేకంగా తయారవుతున్నారంటూ.... ధరణిపై ఫైర్ అయి వెళ్లిపోతుంది. చాలా మంచి మాట చెప్పారు...  రిషికి జగతి అత్తయ్య మంచితనం గురించి ఇలాగే చెప్పొచ్చు కదా అని అడుగుతుంది కోడలు ధరణి. రిషికి నేను దేవయాని-జగతి గురించి చెబితే వార్త అవుతుంది...వాడు తెలుసుకుంటే నిజం అవుతుంది. వార్త కొన్ని రోజులే ఉంటుంది-నిజం నిలిచిపోతుంది క్లారిటీ ఇస్తాడు ఫణీంద్ర.

Also Read: దీప ముందు మోనితని లాగిపెట్టి కొట్టిన కార్తీక్, బాబు కావాలంటూ మోనిత కొత్త డ్రామా, కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
మరోవైపు కాలేజీలో షార్ట్ ఫిలిం షూటింగ్ జరుగుతుంటుంది. వసుధార-గౌతమ్ ని పిలిచి సీన్ వివరిస్తాడు డైరెక్టర్. అప్పుడే కారు దిగిన రిషి లోపలకు వెళ్లిపోతూ చీరకట్టుకున్న వసుధారని అలా చూస్తూ నిల్చుండిపోతాడు. మేడం అంతా ఓకేనా అని అడుగుతాడు. స్క్రిప్టులో చిన్న చిన్న మార్పులు చేశాం అని చెబుతుంది జగతి. డైరెక్టర్ గారూ షూటింగ్ స్టార్ట్ చేద్దాం అంటాడు రిషి. గౌతమ్ సార్ మీ వెనుక నుంచివసుధార మేడం వస్తారు పిలిచాక వెనక్కు తిరిగి చూడండని డైరెక్టర్ చెబుతాడు. ఏవండోయ్ శ్రీవారూ అంటూ వసుధార వస్తే...హాయ్ వసు డియర్ అంటాడు. కట్ చెప్పిన డైరెక్టర్... పంతులమ్మ అనాలని చెబుతాడు. అలా ఎందుకు ఇలా చెబితే బావుంటుందని గౌతమ్ అనడంతో..రిషి క్లాస్ వేస్తాడు. ప్రామ్టర్ ని పిలవండి అనగానే నాకు అవసరం లేదు పేజీ డైలాగ్ కూడా సింగిల్ టేక్ లో చెప్పేస్తాను అంటాడు. వన్ మోర్ అంటూ మళ్లీ యాక్షన్ అంటారు. ఏవండోయ్ శ్రీవారు అంటే గుడ్ మార్నింగ్ పంతులమ్మ అంటాడు గౌతమ్. మళ్లీ కట్ చెప్పిన డైరెక్టర్ డైలాగ్ ఒకటుంటే మీరు మరొకటి చెబుతారేంటి అని క్వశ్చన్ చేస్తాడు. వన్ మోర్ అంటూ మళ్లీ స్టార్ట్ చేస్తారు. వరుస టేక్స్ మీద టేక్స్ తీసుకుంటాడు. రిషి మాత్రం వసుధారని చూస్తూ కూర్చుంటాడు. 

గౌతమ్ యాక్టింగ్ బాలేదని డైరెక్టర్ ఫైర్ అవుతాడు. రాంగ్ డైలాగ్ చెబుతారేంటని అంటే.. యాక్టింగ్ అంటే ఇలాగే ఉండాలని ఏం అనుకువోద్దు, ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు నా నుంచి యాక్టింగ్ రాబట్టుకోండి అంటాడు. పాపం పూర్ డైరెక్టర్ అనుకుంటూ వసు-రిషి ఎక్కడున్నారో అనుకుంటూ వెతుకుతాడు. మహేంద్ర-రిషి మాట్లాడుకుంటుండగా అక్కడకు వెళ్లిన గౌతమ్.. నాయాక్టింగ్ ఎలా ఉందంటున్నారని అడిగితే..యాక్టింగ్ లానే ఉందంటున్నారు అని రిప్లై ఇస్తాడు. ఆ యాక్టింగ్ ఏంట్రా, బాగా చేయరా, చెప్పింది వినరా అని రిషి అంటే.. నేను హీరో అయ్యానని నీకు కుళ్లురా బాబు, నువ్వు నన్ను సంతోష పడనివ్వవు అంటాడు. ఇంతలో జగతి-మహేంద్ర మూగసైగలు గమనించిన రిషి... నేను తర్వాత భోజనం చేస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మహేంద్ర తనవైపు రావడం చూసి..మహేంద్ర ఏంటి ఇటువైపు వస్తున్నాడు-ఏది వద్దంటానో, ఏది రిషికి నచ్చదో అదే చేస్తాడు అనుకుంటుంది జగతి.  ఎపిసోడ్ ముగిసింది.

Also Read: వసుకోసం రిషి-గౌతమ్ ప్రేమ యుద్ధం, హీరో ఎవరు-విలన్ ఎవరు, గుప్పెడంతమనసు శనివారం ఎపిసోడ్
రేపటి ( మంగళవారం) ఎపిసోడ్ లో
టేక్స్ మీద టేక్స్ తీసుకుంటున్న గౌతమ్ ని అక్కడినుంచి పంపించేసి  యాక్టింగ్ చేసేందుకు కూర్చుంటాడు రిషి. రిషి సార్ ని ఏవండోయ్ శ్రీవారు అని పిలవాలా అని తడబడుతుంది. మూడు నాలుగు సార్లు తడబడిన వసుకి రిషి ధైర్యం చెప్పడంతో సీన్ హైలెట్ అవుతుంది.

 

టాప్ హెడ్ లైన్స్

Swathi Wedding: దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 8th:కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కత్తి పట్టి శకుంతలని చంపడానికి వెళ్లిన లక్ష్మీ! విహారి ఆఫీస్ కాంట్రాక్ట్ బరిలో లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కత్తి పట్టి శకుంతలని చంపడానికి వెళ్లిన లక్ష్మీ! విహారి ఆఫీస్ కాంట్రాక్ట్ బరిలో లక్ష్మీ!
Anasuya: చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
Ravi Mohan: అభిమానులకు సారీ చెప్పిన తమిళ హీరో... ఎందుకో తెలుసా?
అభిమానులకు సారీ చెప్పిన తమిళ హీరో... ఎందుకో తెలుసా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget