Karthika Deepam ఫిబ్రవరి 14 ఎపిసోడ్: తమ దగ్గరున్న ఆనంద్ మోనిత కొడుకే అని దీప-కార్తీక్ తెలుసుకుంటారా, కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ ఫిబ్రవరి 14 సోమవారం 1275 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…
కార్తీకదీపం ఫిబ్రవరి 14 సోమవారం ఎపిసోడ్
పెళ్లికూతురు, పెళ్లికొడుకుగా ముస్తాబైన దీప, కార్తీక్ ని చూసి ఫ్యామిలీ అంతా రెప్పవేయకుండా చూస్తారు. అంతా పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతారు. ఇద్దరూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పెళ్లిబొట్టు పెట్టి మళ్లీ పెళ్లి తంతు మొత్తం పూర్తిచేస్తారు. మరోవైపు వాళ్ల అక్క అరుణ పనిచేస్తున్న మోనిత ఇంటికెళ్లిన బిచ్చగాడు ఈ సార్ ఇక్కడున్నారేంటని కార్తీక్ ఫొటో చూసి అంటాడు. ఆ సార్ నీకు తెలుసా అని రెట్టిస్తుంది మోనిత. గతంలో నీతో ఫోన్లో మాట్లాడింది, డబ్బులు ఇచ్చింది నేనే అంటుంది. ఇంతకీ కార్తీక్ సార్ ని చూశావా లేదా అని అడిగితే వాళ్లు ఇంటికి వచ్చేశారని పెద్దమేడం నాకు కాల్ చేసి చెప్పారంటాడు. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన మోనిత రెడీ అయి ఇప్పుడే వెళ్లాలంటుంది. కట్ చేస్తే రవి తన భార్య డాక్టర్ భారతితో మొన్న వెళ్లిన టూర్ ఏమైందని అడుగుతాడు. దానిగురించి చెప్పలేనులే..మోనిత కార్తీక్ కార్తీక్ అంటూ జపం చేస్తుంటుంది ..ఏమీ అర్థంకాదంటుంది.
Also Read: సౌందర్యకి మాటిచ్చిన దీప , కొంప ముంచిన బిచ్చగాడు, కార్తీకదీపం శనివారం ఎపిసోడ్
సౌందర్య ఇంట్లో కార్తీక్, దీపకు మళ్లీ పెళ్లిచేయిస్తుంటుంది సౌందర్య. ఆనంద్ ఎక్కడున్నాడు అని ఆదిత్య అడిగితే పడుకున్నాడని చెప్పిన సౌందర్య..ఆనంద్ గురించి ఆలోచిస్తున్నావంటే ఆనందంగా ఉందంటుంది. ఇంతలో డాక్టర్ రవి, భారతి పెళ్లివేడుకకు హాజరవుతారు. మొత్తానికీ తాళి కట్టే సమయానికి మోనిత ఎంట్రీ ఇస్తుంది .అంతా చప్పట్లు కొట్టడం చూసి రగిలిపోతుంది. అంతా చప్పట్లు ఆపేశాక తను కొడుతుంది. ఒకరి తర్వాత ఒకరు మోనిత చూసి షాక్ అవుతారు. అయినా పట్టనట్లుగా ఉంటారు అంతా. పెళ్లి తంతు కానాగానే.. ‘అందరికీ వచ్చినందుకు థాంక్స్.. వెళ్లి భోజనాలు చేసి రండి’ అంటూ పంతులుతో సహా అందరినీ పంపేస్తుంది. పిల్లలతో సహా అంతా వెళ్లిపోతారు. సౌందర్య, కార్తీక్, దీప, ఆదిత్య, శ్రావ్య, మోనిత, రవి, భారతి మాత్రమే మిగులుతారు. దీప, కార్తీక్ ఇంకా పీటల మీదే కూర్చుని ఉంటారు.
అప్పుడే రవి.. కార్తీక్ దగ్గరకు వెళ్లి.. ‘నీకు పెళ్లి రోజు సందర్భంగా ఓ గుడ్ న్యూస్ కార్తీక్’ అంటూ ఓ పేపర్ చేతిలో పెట్టి.. ‘నువ్వు తిరిగి మళ్లీ డాక్టర్ కార్తీక్ అయిపోయావ్ కార్తీక్’ అంటాడు. దాంతో చాలా సంతోషంగా పైకి లేస్తాడు. ‘నీ తప్పు లేదని తనే అసోషియేషన్ ముందు గట్టిగా వాదించింది. ఇది జరగడానికి మోనితే కారణం అని చెప్పొచ్చు.. ఎనీ హౌవ్ వెల్ కమ్ బ్యాక్ డాక్టర్ కార్తీక్..’ అంటూ మోనితని చూపిస్తూ అంతా చెప్పి పేపర్స్ చేతిలో పెడతాడు. ఒక్కసారి మోనిత సాయం చేసిందని తెలిసి అంతా షాక్ అవుతారు. అయిష్టంగా చూస్తుంటారు. కాకుంటే తిరిగి కార్తీక్ డాక్టర్ అయినందుకు సౌందర్య వాళ్లు చాలా సంతోషిస్తారు. అప్పుడే మోనిత కార్తీక్ దగ్గరకు వెళ్లి.. కావాలని నవ్వుతూ.. ‘కంగ్రాట్స్ కార్తీక్.. డాక్టర్ అసోషియేషన్ నీకు తిరిగి స్వాగతం చెబుతోంది. ఈ డాక్టర్ మోనిత కార్తీక్ హార్టీ వెల్కమ్ చెబుతోంది, పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతాను అనుకున్నంటున్నావా .. ఒకటికి రెండు సార్లు నువ్వు దీప మేడలో తాళి కట్టావని నేనేం ఫీల్ అవను. నువ్వు రెండు సార్లు కాదు 200 సార్లు దీప మెడలో తాళి కట్టినా నా ప్రేమ తగ్గదు.. పైగా మరింత పెరుగుతుంది. ’అని పైశాచికంగా నవ్వుతుంది. కార్తీక్ లైసెన్స్ రావడానికి, నిషేదాన్ని ఎత్తేయడానికి నేను ఎంత కష్టపడ్డానో చెప్పవా అంటుంది. అవును తను చాలా కష్టం పడింది..ఈ విషయం అయ్యేవరకూ ఎవరికీ చెప్పొందంది అంటాడు రవి.
Also Read: లైబ్రరీలో ఏం జరిగిందని నిలదీసిన జగతి, రిషి ఏం సమాధానం చెబుతాడు, గుప్పెడంతమనసు శనివారం ఎపిసోడ్
‘అన్ని దారులు మూసుకుని పోయాక.. ఇదో కొత్త నాటకం మొదలైందా రవి గారు?’ అంటుంది దీప నవ్వుతూ.. ‘నేను నిజంగానే నిజాయితీగా కార్తీక్ కోసం కష్టపడ్డాను..’ అంటుంది మోనిత. ‘ఆహా.. అవునా.. ఒక కృూరమృగం అహింస గురించి చెబుతున్నట్లు ఉంది.. నువ్వు నిజాయితీ మంచి అంటుంటే’ అంటుంది దీప. ‘పిలవని పేరంటంలా వచ్చావ్ భోజనం చేసి మర్యాదగా వెళ్లిపో మోనితా’ అంటుంది సౌందర్య. ‘నాటకాలు ఆడటం నీకు కొత్త కాదుగా మోనితా.. నిన్ను ఎవ్వరూ నమ్మరులే కానీ మా అత్తయ్యగారు చెప్పినట్లు భోజనం చేసి వెళ్లు మోనితా’ అంటుంది దీప. ఎపిసోడ్ ముగిసింది.
రేపటి ( మంగళవారం) ఎపిసోడ్ లో
నేనొకసారి బస్తీకి వెళ్లొస్తాను, వాళ్లంతా నాకోసం ఎదురుచూస్తారంటుంది దీప. బస్తీలో మీరున్న ఇంటిని కొనుక్కుని అక్కడ హాస్పిటల్ పెట్టింది. మోనిత బాబుని ఆదిత్య ఎత్తుకుపోయాడని ఇంటికొచ్చి గొడవ చేసిందని మొత్తం జరిగిందంతా చెబుతారు. మోనిత నాటకాలు ఆడుతోందా, నిజంగా బాబుని ఎత్తుకుపోయారా అనుకుంటాడు కార్తీక్....