అన్వేషించండి

Karthika Deepam ఫిబ్రవరి 12 ఎపిసోడ్: సౌందర్యకి మాటిచ్చిన దీప , కొంప ముంచిన బిచ్చగాడు, కార్తీకదీపం శనివారం ఎపిసోడ్

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ ఫిబ్రవరి 12 శనివారం 1274 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

కార్తీకదీపం ఫిబ్రవరి 12 శనివారంఎపిసోడ్

తాడికొండ నుంచి ఇంటికి చేరుకున్న దీప, కార్తీక్, పిల్లల్ని చూసి సౌందర్య, ఆదిత్య, శ్రావ్య మురిసిపోతారు. అందరం కలసి ఎక్కడికైనా వెళదాం అని హిమ అడుగితే..ఎక్కడికీ వెళ్లొద్దు మనింట్లోనే పార్టీ చేసుకుందాం అంటుంది సౌందర్య.  పార్టీ ఎందుకు అంటే.. మీ మావయ్య గారు అందరకీ గ్రాండ్ పార్టీ ఇవ్వమని కాల్ చేసి చెప్పారన్న సౌందర్య..ఎందుకో తెలియదా అని అడుగుతుంది. కట్ చేస్తే కార్లో ఉన్న భారతి రూట్ మార్చావేంటని అడుగుతుంది. ఓ సారి మా అత్తగారి ఇంటికివెళ్లి నమస్కారం చేసుకుని వెళదాం అంటుంది మోనిత. బాధతో విలవిల్లాడుతూ చీకట్లో మగ్గిపోతారు అనుకుంటే వీళ్లేంటి ఇల్లంతా డెకరేట్ చేశారు అంటుంది మోనిత. కార్తీక్ వచ్చాడేమో అని భారతి అంటే నువ్వన్నంత ఈజీ కాదు కార్తీక్ రావడం.. వస్తే నా మనసుకి తెలుస్తుందిలే దాన్నే ప్రేమంటారు అని క్లాస్ వేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత. 

హిమ,శౌర్య  కలసి దీప-కార్తీక్ ల పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్డ్స్ తయారు చేస్తారు. మనింట్లోకి వచ్చాకే అందరం హ్యాపీగా ఉంటాం అని మాట్లాడుకుంటారు. అక్కడకు వచ్చిన సౌందర్య గ్రీటింగ్ కార్డ్స్ చూసి చాలా బావున్నాయి అంటుంది. ఇన్నాళ్లూ మీరంతా లేక ఇల్లంతా చిన్నబోయింది..ఇంకెప్పుడూ ఈ నానమ్మని వదిలి వెళ్లొద్దని అడుగుతుంది. అమ్మా-నాన్న పెళ్లి గ్రాండ్ గా చేశారా అని పిల్లలు అడుగుతారు. మీ నాన్న పెళ్లిచేసే అదృష్టం, చూసే అదృష్టం నాకివ్వలేదు వాళ్లిద్దరూ గుళ్లో పెళ్లిచేసుకుని వచ్చారని పిల్లలకు చెబుతుంది సౌందర్య. మరి నీకు కోపం రాలేదా అన్న పిల్లల ప్రశ్నకు..అప్పట్లో దీపపై ఫైర్ అయిన సందర్భాలు గుర్తుచేసుకుని బాధపడుతుంది ( పెద్దోడికి ఎదురైన సమస్యలు  ఆసమయంలో దీప ఇచ్చిన సహకారం మరిచిపోలేనిది, ఆ ప్లేస్ లో ఇంకెవరున్నా వెళ్లిపోయేది అనుకుంటుంది). మీ అమ్మా నాన్న పెళ్లిరోజని వాళ్లకి గుర్తులేదు కదా..మీరు చెప్పొద్దు..వాళ్లని సర్ ప్రైజ్ చేద్దాం అంటుంది సౌందర్య.

Also Read: సౌందర్య ఇంట్లో దీప-కార్తీక్ పెళ్లివేడుక, వదలబొమ్మాళి అంటూ ఎంట్రీ ఇచ్చిన మోనిత, కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్
ఇల్లంతా డెకరేట్ చేస్తారు. ఈ రోజు ఇంట్లో పండుగలా అనిపిస్తోందని శ్రావ్య, ఆదిత్య అనుకుంటారు. మీ పెళ్లిరోజు కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తానంటుంది సౌందర్య. ఈ సంతోషాన్ని వీడియో తీసి డాడీకి పంపిద్దాం అంటాడు ఆదిత్య. ఈ రోజు వాళ్ల పెళ్లిరోజు అన్న సంగతి కూడా గుర్తులేనంతగా తాడికొండలో కష్టపడ్డారంటుంది సౌందర్య. ఇంతలో పిల్లలు కార్తీక్ ని రెడీ చేసి కిందకు తీసుకొస్తారు.  పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పడంతో ..అవునుకదా మరిచిపోయాను అంటాడు కార్తీక్. ఇవన్నీ అవసరమా అంటే ఇదంతా మా ఆనందం కోసం..మీ పెళ్లి మేం చూడలేకపోయాం..అప్పటి ఆ లోటు ఇప్పుడు తీర్చుకుంటున్నా అని క్లారిటీ ఇస్తుంది సౌందర్య.

 రూమ్ లో దీప అందంగా రెడీ అయి ఆనంద్ ని నిద్రపుచ్చుతుంటుంది. అక్కడకు వచ్చిన సౌందర్య అలంకారంలో ఉన్న దీపని చూసి (బంగారం అమ్మేసి రుద్రాణి కాళ్లపై పడిన సందర్భం గుర్తుచేసుకుంటుంది) ఇప్పుడు నా ఇంటి పెద్ద కోడలు మహాలక్ష్మిలా కనిపిస్తోంది, నాకెప్పుడూ ఇలాగే కనిపించాలంటుంది. ఎందుకు ఇలా రెడీ అవమన్నారని దీప అడిగితే..పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతుంది సౌందర్య. పెళ్లి అనేది అందరికీ కలలా ఉండిపోతుంది..నీకు పెళ్లికిముందు కష్టాలు, ఆ తర్వాత కష్టాలు వచ్చాయి.. నీ కష్టాలన్నీ ఇంతటితో పోవాలని ఆ ఈశ్వరుడిని కోరుకుంటున్నా అని దీవిస్తుంది సౌందర్య. ఇంకెప్పుడూ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లమని ఒట్టేసి చెప్పు అని ఒట్టు తీసుకుంటుంది. మీరంతా ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోతే మేం ఏం కావాలి..పిల్లలు లేక, మీరు లేక, సంతోషాల్లేక ఇలా అయితే ఎలా, ప్రతి క్షణం నరకం అనుభవించాం, పెద్దోడు అన్నాడు సరే నువ్వు కూడా వెళ్లిపోతే ఎలా అని బాధపడి అంతలోనే దీపని పొగిడేస్తుంది. చిన్న చిన్న కారణాలకే పుట్టింటికి వెళ్లిపోయి, విడాకుల కోసం కోర్టుకెక్కుతారు కానీ నువ్వు పడిన కష్టం ఎవ్వరూ పడలేదని ఆకాశానికెత్తేస్తుంది. నిద్రపోతున్న ఆనంద్ వైపు చూసి..నువ్వొచ్చాక వీళ్ల కష్టాలు తీరిపోయాయంట కదా అందరం హ్యాపీగా ఉందాం అంటుంది సౌందర్య. పిల్లలు వచ్చి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతారు. 

Also Read: లైబ్రరీలో ఏం జరిగిందని నిలదీసిన జగతి, రిషి ఏం సమాధానం చెబుతాడు, గుప్పెడంతమనసు శనివారం ఎపిసోడ్
వంటలక్క ప్రజావైద్యశాల దగ్గర లక్ష్మణ్ భార్య పనిచేస్తుండగా.. కార్తీక్ ఫోన్ దొరికిన బిచ్చగాడు అక్కా అనుకుంటూ అక్కడకు వస్తాడు. తిండానికి తిండిలేకపోతే నీకు తాగడానికి డబ్బులెవరిచ్చారని అడుగుతుంది. ఓ పెద్దమనిషి కనిపించకుండా పోయాడు, వెతికితే డబ్బులిచ్చారంటాడు. లోపలకు వచ్చిన తాగుబోతుని చూసిన మోనిత ఎవడు వీడు అని అడుగుతుంది. మా తమ్ముడు అని చెబుతుంది. ఇంతలో బిచ్చగాడు గోడకున్న కార్తీక్, మోనిత ఫొటో చూసి ఈ సార్ ఫొటో ఇక్కడుందేంటని అడుగుతాడు. మోనిత షాక్ అయి నిలబడుతుంది. 

సోమవారం ఎపిసోడ్ లో
సౌందర్య ఇంట్లో దీప, కార్తీక్ పెళ్లి సంబరం జరుగుతుండగా ఎంట్రీ ఇస్తుంది మోనిత....ఇప్పుడేం జరగబోతోందో చూడాలి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 CSK VS RCB Result Update :చేపాక్ గ‌డ్డ‌పై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల త‌ర్వాత సీఎస్కేపై విక్ట‌రీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
చేపాక్ గ‌డ్డ‌పై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల త‌ర్వాత సీఎస్కేపై విక్ట‌రీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
Quantum Valley: అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
AP 10Th Exams Postpone: ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
MS Dhoni Stumping: అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP DesamShardul Thakur Bowling Strategy vs SRH IPL 2025 | కాన్ఫిడెన్స్ తోనే సన్ రైజర్స్ కు పిచ్చెక్కించాడుShardul Thakur 4Wickets vs SRH | IPL 2025 లో పర్పుల్ క్యాప్ అందుకున్న శార్దూల్ విచిత్రమైన కథ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 CSK VS RCB Result Update :చేపాక్ గ‌డ్డ‌పై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల త‌ర్వాత సీఎస్కేపై విక్ట‌రీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
చేపాక్ గ‌డ్డ‌పై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల త‌ర్వాత సీఎస్కేపై విక్ట‌రీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
Quantum Valley: అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
AP 10Th Exams Postpone: ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
MS Dhoni Stumping: అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
DA Hike:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
IPL 2025:శిఖర్ ధావన్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు అయ్యగారనే నంబర్ వన్
శిఖర్ ధావన్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు అయ్యగారనే నంబర్ వన్
TDP Nominated Posts: కూటమిలో నామినేటెడ్ పోస్టుల జాతర - 47 మార్కెట్ కమిటీల పదవుల ప్రకటన
కూటమిలో నామినేటెడ్ పోస్టుల జాతర - 47 మార్కెట్ కమిటీల పదవుల ప్రకటన
Earth Quake Updates: భూకంపం దాటికి వణికిపోయిన బ్యాంకాక్ హైరైజ్ భవనాలు - మన దగ్గర అలాంటి పరిస్థితి వస్తే?
భూకంపం దాటికి వణికిపోయిన బ్యాంకాక్ హైరైజ్ భవనాలు - మన దగ్గర అలాంటి పరిస్థితి వస్తే?
Embed widget