Guppedantha Manasu ఫిబ్రవరి 12 ఎపిసోడ్: లైబ్రరీలో ఏం జరిగిందని నిలదీసిన జగతి, రిషి ఏం సమాధానం చెబుతాడు, గుప్పెడంతమనసు శనివారం ఎపిసోడ్
గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. లైబ్రరీ డోర్ లాక్ తీసిన గౌతమ్...లోపల రిషి-వసుధార ఉండడం చూసి షాక్ అవుతాడు. ఫిబ్రవరి 12 శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
గుప్పెడంత మనసు ఫిబ్రవరి12 శనివారం ఎపిసోడ్
లైబ్రరీలో ఇరుక్కుపోయిన రిషి, వసు బయటపడే మార్గం ఆలోచిస్తారు. ఎట్టకేలకు లైబ్రేరియన్ కాల్ లిఫ్ట్ చేయడంతో ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా అని ఫైర్ అవుతుంటే వసు కూల్ చేస్తుంది. వస్తున్నా సార్ అని కాల్ కట్ చేస్తాడు లైబ్రేరియన్. చూశారా నేను చెప్పిందే జరిగింది అంటుంది వసుధార. అవునా లైబ్రేరియన్ ఊరెళుతున్నాడంట రేపు పొద్దున్నే వస్తాడంట అప్పటి వరకూ మనం లైబ్రరీలోనే ఉంటాం అని వసుని ఏడిపిస్తాడు రిషి. ఇక్కడుండాలా దోమలు కుడతాయేమో సార్ అని వసు అంటే..దోమలు కుట్టకుండా ఉండేందుకు ఏదైనా ఉపాయం లేదా అని కౌంటర్ వేస్తాడు. అంత్యాక్షరి ఆడుకుందామా అని రిషి అంటే వసు టెన్షన్ పడుతుంది. మీరు కాలేజీ ఎండీ కదా స్టాఫ్ ని పిలవండి, గౌతమ్ గారిని పిలవండి తాళం బద్దలుకొట్టించి వెళదాం అని సలహాలిస్తుంది. ఏంటి తమరిలో ఉత్సాహం ఒక్కసారిగా అడ్రల్ లేకుండా పారిపోయిందని రిషి అంటే..కొంచెం సేపే ఉంటాం అనుకున్నాం ఇప్పుడు రాత్రంతా అనేసరికి అని నసుగుతుంది. టెన్షన్ పడకు వస్తున్నాడులే అని చెబుతాడు.
వసు-రిషి
వసు మొహంలో రకరకాల ఎక్స్ ప్రెషన్స్ గమనిస్తూ కూర్చున్న రిషి కొద్దిసేపటి తర్వాత ఏమైందని అడుగుతాడు. మొహంలో నవసరాలు ఒలకబోస్తున్నావేంటి అంటే..నాకు నేనే సమాధానం చెప్పుకున్నా అంటుంది. ప్రశ్న ఏంటో అన్న రిషితో మనసులో కొన్ని అనుకుంటున్నా అంటుంది. తిట్టుకుంటున్నావా నన్ను అంటే మనసులో ఎందుకు తిట్టుకుంటా అంటుంది. అంటే బయటకే తిడతావా అంటుంది. నేను ఏమనుకుంటున్నానో చెబుతాను..బయటకు మీరు చెప్పండి అంటుంది. దేవుడా నువ్వు మంచోడివి అన్న వసు మాట విని దేవుడినే ఐస్ చేసే ప్రోగ్రామా అనుకుంటాడు రిషి. ఇలా లైబ్రరీలో ఇరికించావేంటి, అయినా పర్వాలేదు, రిషి సార్ ఉన్నారుగా, రిషి సార్ కి కోపం రాకుండా చూడు...మనసులో ఇదే అనుకున్నా అంటుంది. నన్ను ఇంప్రెస్ చేయడానికి వేసిన ప్రోగ్రామా అంటే..మిమ్మల్ని ఇంప్రెస్ చేయాల్సిన పనేంటి..నిజం చెబితే ఈ పాడు లోకం నమ్మదు అంటుంది. దయచేసి కొటేషన్స్ చెప్పకు అంటాడు రిషి.
Also Read: సౌందర్యకి మాటిచ్చిన దీప , కొంప ముంచిన బిచ్చగాడు, కార్తీకదీపం శనివారం ఎపిసోడ్
లైబ్రేరియన్ వస్తున్నాడు కదా ఇంకా మనసులో ఈ ప్రోగ్రామ్స్ ఏంటో అన్న రిషితో.. వచ్చేదారిలో లైబ్రేరియన్ కి ఏమీ కాకూడదని దేవుడిని కోరుకుంటున్నా అంటుంది. దయచేసి అలా అనుకోవద్దంటాడు రిషి. ఆకాశం, మేఘాలు అంటూ వేరే ఆలోచనలు పెట్టుకో అని సలహా ఇస్తాడు. వాటంతట అవి రావాలి కానీ మనం ఎలా బలవంతంగా ఆలోచిస్తాం అన్న వసుతో..నీకు ప్రతీది ఒక జ్ఞాపకమే కదా అంటూ సెల్ఫీ తీస్తాడు. సెల్ఫీ నాక్కూడా పంపించండి అంటుంది. ఏంటి సార్ లైబ్రేరియన్ ఇంకా రాలేదు కొంపతీసి టైరు అని టెన్షన్ గా మొహం పెడుతుంది. వద్దు అలా ఆలోచించకు అంటాడు రిషి. కాగితాలతో పడవలు చేయడం వచ్చా అన్న రిషితో.. వసుధారకి కాగితం పడవ చేయడం వచ్చా అని అడుగుతున్నారా అంటుంది. ఇంతకీ వచ్చా రాదా అనడంతో పడవ చేసి చూపిస్తుంది. ఇద్దరూ పడవలు చేసుకుని వాటిపై పేర్లు రాసుకుంటారు.
మీ తెలుగు హ్యాండ్ రైటింగ్ బాలేదు అంటుంది వసుధార. ప్రాక్టీస్ తగ్గింది అంతే నా రైటింగ్ బావుంటుంది అంటాడు. మీ రైటింగ్ అంతగా బావోదంటుంది. ఫాస్ట్ గా రాస్తే వచ్చేదే మన అసలైన రైటింగ్ అంటుంది. నేనొకటి చెబుతాను రాయండి అంటూ లీవ్ లెటర్ చెబుతుంది ( గతంలో లవ్ లెటర్ ఎవరు రాశారో తెలియలేదు రిషి సార్ హ్యాండ్ రైటింగ్ చెక్ చేద్దాం అనుకుంటుంది). అదే సమయంలో రిషి కూడా ప్రేమ లేఖ రాసింది ఎవరో తెలుసుకునేందుకు ప్లాన్ చేశావా అనుకుంటూ లెటర్ క్యాన్సిల్ అనేస్తాడు. రాసిన లెటర్ ఇవ్వండని అడుగుతుంది..ఇవ్వనంటాడు రిషి. నీ తెలివి తేటలు మామూలుగా లేవు అనుకుంటాడు.
Also Read: టెన్షన్లో రిషి, ధ్యానంలో వసు, షాక్ లో గౌతమ్, గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్
పార్కింగ్ దగ్గర కూర్చున్న గౌతమ్..లైబ్రేరియన్ మళ్లీ రావడంతో ఇప్పుడే వెళ్లారుగా అప్పుడే వచ్చారేంటి అంటాడు. లైబ్రరీలోపల రిషి సార్ ఉండిపోయారని చెబుతాడు. లైబ్రేరియన్ తో పాటూ గౌతమ్ కూడా వెళతాడు. నువ్వు వాడి ఎదురుగా కనిపిస్తే అయిపోతావ్ జాగ్రత్త..దూరంగా ఉండు అని సలహా ఇస్తాడు. డోర్ చేసిన తర్వాత లోపల రిషి, వసుధారని చూసి షాక్ అవుతాడు గౌతమ్.
సోమవారం ఎపిసోడ్ లో
లైబ్రరీలో అని వసుధారతో గౌతమ్ ఏదో మాట్లాడబోతుంటే రిషి మాట్లాడనివ్వడు..అయితే ఆ విషయం మొత్తం గౌతమ్ కాల్ చేసి జగతికి చెబుతాడు. కాలేజి లైబ్రరీలో ఏం జరిగింది ఓసారి రిషికి కాల్ చేయి అంటుంది. ఈ పొగరు ఇప్పుడు కాల్ చేసింది ఏంటి అనుకుంటాడు రిషి. సార్ నేను జగతిని మాట్లాడుతున్నాను..లైబ్రరీలో జరిగిన సంఘటన గురించి అనగానే షాక్ అవుతాడు...