Rishab Shetty: ‘హనుమాన్‘ మూవీ చూసిన ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి - ఆయన స్పందన ఇదే
Rishab Shetty: ‘హనుమాన్’ సినిమాపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించగా, తాజాగా ఈ లిస్టులో చేరారు ‘కాంతార’ నటుడు రిషబ్ శెట్టి. ప్రశాంత్ వర్మ దర్శకత్వం, తేజ సజ్జ నటన అద్భుతం అన్నారు.
Kannada Stars Hero Rishab Shetty Praise on 'Hanuman' Movie: చిన్న సినిమాగా సంక్రాంతి బరిలో నిలిచిన ‘హనుమాన్’ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. మహేష్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేష్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగ’ సినిమాలను వెనక్కి నెట్టి మరీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, రోజు రోజుకూ వసూళ్ల వర్షం కురిపిస్తూ ముందుకెళ్తోంది. భారత్ తో పాటు ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. జనవరి 12న విడుదలైన ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది. అమెరికాలోనూ 3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. తొలి వారంలో ‘RRR’, ‘బాహుబలి’, ‘సలార్’ రికార్డులను ‘హనుమాన్’ బద్దలు కొట్టింది.
‘హనుమాన్’ సినిమాపై కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ప్రశంసలు
ఇక ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వ ప్రతిభ, తేజ సజ్జ నటన అద్భుతం అంటూ ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ, గోపీచంద్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ లిస్టులోకి కన్నడ హీరో రిషబ్ శెట్టి చేరారు. తాజాగా ‘హనుమాన్’ సినిమా చూసిన ఆయన, తాజాగా ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ, నటుడు తేజ సజ్జను పొగడ్తలలో ముంచెత్తారు. “’హనుమాన్’ సినిమాను అభినందించే లిస్టులో చేరడం సంతోషంగా ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ స్టోరీ చెప్పే విధానం అద్భుతంగా ఉంది. తేజ సజ్జ నటన సైతం చాలా బాగుంది. ఆయన నటన చాలా కాలం వరకు ప్రేక్షకులకు గుర్తుంటుంది” అని తన ట్వీట్ లో వెల్లడించారు. రిషబ్ శెట్టి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ‘హనుమాన్’ సినిమాను ప్రశంసించిన రిషబ్ ను నెటిజన్లు అభినందిస్తున్నారు. ‘కాంతార’ మాదిరిగానే ‘హనుమాన్’ సైతం బ్రహ్మాండమైన విజయాన్ని సాధించిందంటున్నారు.
Joining the chorus of praise for 'Hanuman' – a triumph in storytelling and filmmaking by Prashant Verma. Teja Sejja performance stays with you long after the credits roll. #Hanuman@PrasanthVarma @tejasajja123
— Rishab Shetty (@shetty_rishab) January 16, 2024
‘హనుమాన్’ సినిమా గురించి..
టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించాడు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు. ఒక సాధారణ యువకుడు ‘హనుమాన్’ కారణంగా సూపర్ పవర్స్ సాధిస్తే, ఎలా ఉంటుంది? అనే విషయాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
Also Read: రోజూ రెండు రౌండ్లు మద్యం, స్వీట్స్ తినకపోతే నిద్ర రాదు - నాగార్జున ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఇవేనట