Janaki Kalganaledu July 11th Update: జ్ఞానంబకి అడ్డంగా దొరికిపోయిన జానకి- ఐపిఎస్ చదువుతున్నట్లు తెలిసిపోతుందా?
ఏరువాక పండగ కోసం జ్ఞానంబ కుటుంబం అంతా కలిసి పొలానికి వెళతారు. అక్కడ జానకిని తిట్టించాలని మల్లిక ప్లాన్ వేస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
జానకి విత్తనాలు చల్లుతూ అదుపు తప్పి కింద పడిపోతుంటే సమయానికి రామా వచ్చి కాపాడతాడు. పెద్ద ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కాలికి ఏదో తగిలినట్టు అనిపించింది రామా గారు అని జానకి అనడంతో మల్లిక తన పేరు ఎక్కడ బయటికి వస్తుందో అని కంగారు పడిపోతుంది. మీకేమవుతుందో అని ఒక్క క్షణం ప్రాణం పోయినట్టు అయిందని రామా అల్లాడిపోతాడు. ప్రాణానికి ప్రాణంగా చూసుకునే భర్త ఉండగా జానకికి ఏమవుతుందని గోవిందరాజులు అంటాడు. నువ్వు నీ భార్యని కాపాడుకున్నావ్ తనేమో చేతిలో విత్తనాలు కింద పడకుండా అత్తయ్యకి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంది. నీకిచ్చిన మాట నీ పెద్ద కోడలు నిలబెట్టుకుందని అంటాడు. మల్లిక ఈ కుట్రలో నీ చెయ్యి కాని ఉందా అని విష్ణు అడుగుతాడు. అయ్యయ్యో నాకేం తెలియదని అంటుంది. నేను ఏం చేద్దామన్న అది జానకికే కలిసి వస్తుందని తిట్టుకుంటుంది.
Also Read: మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం, రిషి-వసు మధ్య మళ్లీ చిగురిస్తోన్న ప్రేమ - మధ్యలో వచ్చి చేరిన సాక్షి
ఇక అందరూ సంతోషంగా ఉంటారు. జానకి, రామాకి సిగ్గు ఎక్కువ వాళ్ళ మధ్య దూరం తగ్గించాలని జ్ఞానంబ దంపతులు ఓ ఆట ఆడిస్తారు. భర్త భార్యని ఎత్తుకోవాలి, భార్య నిమ్మకాయని స్పూన్ లో పెట్టుకుని నోట్లో పెట్టుకోవాలి. ఎవరు కిందపడకుండా వెళ్తారో వాళ్ళే విజేతలని గోవిందరాజులు చెప్తాడు. ఇక రెండు జంటలు పోటీలో పాల్గొనేందుకు రెడీ అవుతారు. మల్లిక నోట్లో నుంచి స్పూన్ జారిపడిపోతుంది. రామా, జానకి గెలుస్తారు. మల్లిక ఒడిపోయానని ఏడుస్తుంది. జ్ఞానంబ ఇద్దరు కోడళ్లని దగ్గరకి తీసుకుని ఈ పోటీలో ఇద్దరు గెలిచారని అంటుంది.
Also Read: సౌందర్య ఆనందరావు దగ్గరకు చేరిన శౌర్య (జ్వాల), ఇంట్లో కనిపించని హిమ - మరింత పెరిగిన శోభ పైశాచికత్వం
రామా వాళ్ళు ఉన్న దగ్గరకి అసైన్మెంట్ పేపర్స్ తీసుకున్న వ్యక్తి వచ్చి పలకరిస్తాడు. బాగున్నావా జానకి నన్ను గుర్తుపట్టలేదా నేను అకాడమీ క్లర్క్ ని అని అంటాడు. తాను సివిల్స్ చదువుతున్న విషయం తన కుటుంబానికి తెలియదని, వాళ్ళకి తన చదువు గురించి చెప్పొద్దని జానకి ఇంగ్లీష్ లో చెప్తుంది. అతను తెలుగులో మాట్లాడుతుంటే జానకి ఎందుకు ఇంగ్లీష్ లో మాట్లాడుతుందని మల్లిక అనుమానపడుతుంది. వాళ్ళిద్దరూ ఇంగ్లీష్ లో ఏం మాట్లాడుకుంటున్నారని అఖిల్ ని అడుగుతుంది. నేను జానకి చదువుకున్న కాలేజీలో క్లర్క్ ని అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్లిపోవడంతో గండం గడిచిందని జానకి ఊపిరి పీల్చుకుంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలకి అఖిల్ చెప్పిన విషయానికి పొంతన కుదరడం లేదే విషయం ఇంకేదో ఉంది అది ఎంటో కనిపెట్టాలని మల్లిక ఆలోచిస్తుంది. జ్ఞానంబ కుటుంబం అంతా కలిసి పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తారు. రామా జానకి కోసం పాత పాడుతూ ఉండగా వాళ్ళ పెళ్లి నాటి జ్ఞాపకాలని గుర్తుచేసుకుంటూ సంతోషంగా గడుపుతారు.