Janaki Kalaganaledu May 3rd: జానకిని శత్రువులా చూస్తున్న జ్ఞానంబ- ఇంట్లో సునామీ సృష్టిస్తానన్న మధుకర్
జానకి మధుకర్ మధ్య జరుగుతున్న పోరాటంలో రామ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జీవితంలో ఒడిపోతే మళ్ళీ ఎప్పుడైనా కష్టపడొచ్చు కానీ నమ్మకం పోతే సంపాదించుకోవడం కష్టమని ఇప్పుడు తెలుస్తుంది. జైలుకి వెళ్లొచ్చాడని అందరూ చులకనగా చూస్తున్నారు నేను కోర్టులో నిర్దోషిగా ఎప్పుడు బయట పడతానో ఏమో అని రామ అనుకుంటూ ఉండగా నలుగురు రౌడీలు వస్తారు. స్వీట్స్ కావాలని అడిగిన రేటుకి ఇవ్వమని నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఇవ్వడం కుదరదని రామ అనేసరికి రౌడీలు స్వీట్ బండి మొత్తం పడేసి రామని రక్తం వచ్చేలా కొట్టేసి వెళ్లిపోతారు. తర్వాత పక్కకి వెళ్ళి రౌడీలు మనోహర్ కి ఫోన్ చేస్తారు. మీరు చెప్పినట్టే మొత్తం చేశామని చెప్తారు. వాడి పెళ్ళాం వెతుకుతుంది చుట్టుపక్కల ఎక్కడ కనిపించొద్దని చెప్తాడు. దెబ్బలతో వెళ్ళిన రామని చూసి ఇంట్లో గొడవ జరుగుతుందని సంబరపడతాడు.
జానకికి ఒక అమ్మాయి ఫోన్ చేసి కాల్ డేటా పంపించానని చెప్తుంది. ఎస్సై నుంచి బిల్డర్ కి చాలా సార్లు ఫోన్ వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ మిస్ అవడానికి కారణం కూడా ఎస్సై అన్ని ఆధారాలు దొరికిన తర్వాత విషయం బయట పెడతానని అనుకుంటుంది. అప్పుడే జానకికి ఫోన్ చేసి రామని కొట్టిన విషయం చెప్తారు. ఇంట్లో రామకి జ్ఞానంబ మందు రాస్తూ ఉంటుంది. ఎస్సై ఇంట్లో వాళ్ళకి ఏం జరుగుతుందో కళ్ళకి కట్టినట్టు చెప్పారు ఇప్పుడు అదే జరుగుతుందని మల్లిక పుళ్ళు వేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు బావకి ఎవరి వల్ల దెబ్బలు తగిలాయోనని దెప్పి పొదుపు మాటలు మాట్లాడుతుంది. జానకి కంగారుగా వచ్చి గాయాలు ఏంటి ఎవరు కొట్టారని అడుగుతుంది.
Also Read: భార్యగా రాజ్ గదిలోకి అడుగుపెట్టిన కావ్య- బురదలో పడేసి కల్యాణ్‌ని కుళ్లబొడిసిన అప్పు
జ్ఞానంబ: నీలాంటి భార్య ఉంటే ఇలాంటి దెబ్బలు అవమానాలు తప్పవు
జానకి: ఏమైంది ఎందుకు అందరూ ఇలా మాట్లాడుతున్నారు
జ్ఞానంబ: చేయాల్సినవి చేసి ఏమి తెలియనట్టు మాట్లాడకు. వాడిని రోడ్డు మీదకు తీసుకొచ్చావ్. మొత్తం నువ్వే చేశావ్. ఖాకీ డ్రెస్ ఒంటి మీదకు రాగానే ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తున్నావ్
రామ: చేసేది పోలీస్ ఉద్యోగం ఆ మాత్రం తెగింపు ఉంటుంది
జ్ఞానంబ: అనవసరపు గొడవల్లో తల దూర్చి అనవసరపు అహంకారం వల్ల నువ్వు బలవుతున్నావ్. నువ్వు కేవలం కానిస్టేబుల్ వి మాత్రమే పైవాళ్ళ సహకారం లేనిదే ఏమి చేయలేవు అలాంటిది ఎందుకు రెచ్చిపోతున్నావ్. జరిగే నష్టం ఇంతటితో ఆగిపోదు ఈరోజు రామ వంతు రేపు ఇంకొకరు. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో నీ తలనొప్పులు ఇంటి దాకా తీసుకురావద్దు.
మల్లిక: జానకికి ఏం బుద్ధి వచ్చినట్టు కనిపించడం లేదు మీరు చెప్పినట్టు వింటానని తల కూడా ఊపలేదు ఈ గొడవలన్నీ తేలే వరకు మనం ఎక్కడికైనా దూరంగా పారిపోదాం. ఎందుకైన మంచిది మీ సంగతి కూడా ఆలోచించుకోండి అఖిల్. మన మధ్య పోలీస్ కాదు క్రిమినల్ ఉన్నంత భయం వేస్తుంది
Also Read: నందు ముందే లాస్య చెంపలు వాయించేసిన తులసి- నిజం చెప్పమని ప్రియని నిలదీసిన దివ్య
రామ దెబ్బలు చూసి జానకి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. రామ మాత్రం భార్యని సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. ఈ కేసు నుంచి మిమ్మల్ని బయట పడేసేందుకు ప్రయత్నిస్తున్నా ఇందులో నాకు ఏమైనా జరగవచ్చు. మర్డర్ జరిగిన రోజు సీసీటీవీ ఫుటేజ్ దొరికితే కేసు నుంచి బయట పడొచ్చని జానకి మనసులో అనుకుంటుంది. దీని గురించి ఆలోచిస్తూ ఉంటే జానకికి మధుకర్ ఫోన్ చేస్తాడు. ఇంకా ఎదురు తిరిగితే నీకు మొగుడు ఉండదు ఒంటి మీద ఖాకీ యూనిఫాం ఉంటే చాలా అని బెదిరిస్తాడు. నా కళ్ళు కప్పి ఎలాంటి ఎంక్వైరీ చేయలేవు నన్ను శిక్షించడం కాదు మీ ఆయన్ని రక్షించుకోవడం గురించి ఆలోచించు. అలా కాదని ముందుకు వెళ్తే నీ ఫ్యామిలీలోకి సునామీలా చొచ్చుకుని వస్తానని వార్నింగ్ ఇస్తాడు.