News
News
వీడియోలు ఆటలు
X

Gruhalakshmi May 3rd: నందు ముందే లాస్య చెంపలు వాయించేసిన తులసి- నిజం చెప్పమని ప్రియని నిలదీసిన దివ్య

దివ్య, విక్రమ్ పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

విక్రమ్, దివ్య మొదటి రాత్రి గదిలో ఉండగా రాజ్యలక్ష్మి మెట్ల మీద నుంచి జారీ పడి గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి విక్రమ్ పరిగెత్తుకుంటూ వస్తాడు. కాలు బాగా నొప్పిగా ఉందని నటిస్తుంది. బొట్టు చెదరలేదు, తలలో పూలు నలగలేదు అంటే ఇంకా కబుర్లలోనే ఉన్నారని రాజ్యలక్ష్మి మనసులో సంబరపడుతుంది. అందరూ కలిసి తనని తీసుకొచ్చి మంచం మీద పడుకోబెడతారు. దివ్య కాలు చూసి ప్రమాదమేమి లేదని అంటుంది. కాలు మడత పడింది అంటే కంగారుపడాల్సింది ఏమి లేదని చెప్తుంది. కానీ బసవయ్య మాత్రం ఎందుకైనా మంచిది హాస్పిటల్ లో చేర్చుదామని అంటాడు. ఫస్ట్ నైట్ జరగకుండా చేశానని లాస్య రాజ్యలక్ష్మికి సైగ చేస్తుంది. దివ్య ట్యాబ్లెట్ వేసుకోమని తీసుకొస్తుంది. మీరిద్దరూ గదిలోకి వెళ్ళండి ప్రియ పక్కనే ఉండి చూసుకుంటుందిలే అంటుంది. అందరూ అదే మాట చెప్తారు కానీ విక్రమ్ మాత్రం అమ్మ బాధపడుతుంటే వెళ్లలేను ఇంకొక ముహూర్తం చూసుకుందామని చెప్తాడు.

రాత్రంతా మేమిద్దరం పక్కనే ఉంటామని విక్రమ్ అంటాడు. అందరూ వెళ్లిపోతారు. తన ప్లాన్ సక్సెస్ అయినందుకు లోలోపల సంతోషపడుతుంది. ఇదంతా నిజమనుకుని విక్రమ్ వాళ్ళు బాధపడతారు. తెల్లారి లాస్యకి ఫోన్ చేసి తెగ నవ్వుతుంది. ఇది నా రాజ్యం ఇక్కడ నేను చెప్పిందే శాసనం అంటుంది. మంచి ప్లాన్ వేశావని లాస్య మెచ్చుకుంటుంది. విక్రమ్ దివ్యకి దగ్గర కావడం జరిగే పని కాదని వాడికి కూడా తెలియాలని చెప్తుంది. డబ్బు తీసుకోవడం ఎలా చూసిందో తులసి చూసేసి నిలదీసింది. ఇక చేసేది లేక అప్పు చేశానని చెప్పాను. దివ్యని బలి పశువుని చేశానని ఇంట్లో ఎవరికీ తెలియదు. మళ్ళీ ఆ డబ్బులు తిరిగి ఇవ్వు వాటితో అవసరం ఉందని లాస్య ఫోన్ మాట్లాడటం మొత్తం తులసి వింటుంది. అది చూసి లాస్య నోట మాట రాదు. నా మాటలన్నీ వినేసిందా ఏంటని లాస్య టెన్షన్ పడుతుంది. తులసి లాగిపెట్టి చెంప పగలగొడుతుంది.

Also Read: మురారీ గురించి నిజం తెలుసుకున్న కృష్ణ- ప్లాన్ తిప్పికొట్టిన భవానీ, ఆగ్రహంతో ఊగిపోతున్న ముకుంద

తులసి: నిన్ను కొట్టడం కాదు చంపేస్తా, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావ్ నా కూతురు జోలికి వచ్చావ్ దాని జీవితంతో ఆటలాడుకున్నావ్. నా కూతురి జోలికి రావొద్దని చెప్తే నీకు అర్థం కాలేదా

అనసూయ: ఏమైంది ఏంటి ఈ గొడవ

తులసి: ఇక్కడితో వదిలి పెట్టను వెంటాడతా

లాస్య: మీ మాజీ కోడలికి చెప్పండి నా తప్పు లేకుండా నా చెంప పగలగొట్టింది. చూడు ఈ ఇంటి కోడలికి వచ్చే గౌరవం చూడు. పశువు కంటే దారుణంగా చూస్తున్నారు. ఈ ఇంట్లో నాకు విలువ లేకుండా పోయింది అత్తయ్య మావయ్య కూడా తులసికి వత్తాసు పలుకుతున్నారు

తులసి: కన్నీళ్ళు పెట్టుకుని కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన వదిలిపెట్టను అందరి ముందు మళ్ళీ కొడతానని చెంప పగలగొడుతుంది. నువ్వు చేసిన పనికి తవ్వి పాటి పెట్టాలి

లాస్య: నీ ముందే నన్ను కొట్టింది

నందు: ఎందుకు కొట్టావ్

తులసి: తప్పు చేసింది కాబట్టి కొట్టాను 

లాస్య: తులసి నిజం చెప్తే నందు నా పీక పిసికేస్తారు

Also Read: 'సరిఒడి' భోజనాలు చేసిన యష్ దంపతులు- మాళవికకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన వేద

తులసి: దివ్యకి ఏదో జరిగిందని కల వచ్చిందని కంగారు పడ్డారు. ఈ విషయం తెలిస్తే అసలు తట్టుకోలేరు

ఎంత మంది ఎన్ని విధాలుగా అడిగినా కూడా తులసి మాత్రం నిజం చెప్పదు. లాస్యకి సోరి చెప్పమని అంటాడు. తులసి మాత్రం చెప్పనని తెగేసి చెప్తుంది. ఈ అవమానం భరించలేను ఇంత విషం ఇవ్వు చస్తానని లాస్య బెదిరించినా కూడా తులసి మాత్రం చచ్చినా సోరి చెప్పనని తేల్చి చెప్తుంది. ఈ ఫస్ట్ నైట్ జరగదని నీకు ముందే ఎలా తెలుసని ప్రియని దివ్య నిలదీస్తుంది.

Published at : 03 May 2023 09:48 AM (IST) Tags: Gruhalakshmi Serial Written Update Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Kasthuri Gruhalakshmi Serial May 3rd Update

సంబంధిత కథనాలు

బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్లీ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే

బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్లీ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే

‘అఖండ’ నిర్మాతతో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కొత్త మూవీ

‘అఖండ’ నిర్మాతతో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కొత్త మూవీ

Bharateeeyans Movie : చైనా పేరు తొలగించమని సెన్సార్ ఆర్డర్ - ఎంత దూరమైనా వెళ్తానంటున్న 'భారతీయాన్స్' నిర్మాత!

Bharateeeyans Movie : చైనా పేరు తొలగించమని సెన్సార్ ఆర్డర్ - ఎంత దూరమైనా వెళ్తానంటున్న 'భారతీయాన్స్' నిర్మాత!

Suma Adda Show Promo: పార్టీ అంటే పరిగెత్తుకొచ్చే బ్యాచ్ ఒకటి ఉంది, ఆ ముఠాకు మేస్త్రీని నేనే: రానా

Suma Adda Show Promo: పార్టీ అంటే పరిగెత్తుకొచ్చే బ్యాచ్ ఒకటి ఉంది, ఆ ముఠాకు మేస్త్రీని నేనే: రానా

Ruhani Sharma's HER Movie : నో పాలిటిక్స్, ఓన్లీ పోలీసింగ్ - రుహనీ శర్మ ఖాకీ సినిమా అప్డేట్ ఏంటంటే?

Ruhani Sharma's HER Movie : నో పాలిటిక్స్, ఓన్లీ పోలీసింగ్ - రుహనీ శర్మ ఖాకీ సినిమా అప్డేట్ ఏంటంటే?

టాప్ స్టోరీస్

Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు - నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !

Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు -  నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !

Telangana Congress : టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !

Telangana Congress :  టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?