Krishna Mukunda Murari May 3rd: మురారీ గురించి నిజం తెలుసుకున్న కృష్ణ- ప్లాన్ తిప్పికొట్టిన భవానీ, ఆగ్రహంతో ఊగిపోతున్న ముకుంద
నందిని పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
మురారీని భవానీకి ఫోన్ చేసి మాట్లాడమని కృష్ణ సలహా ఇస్తుంది. కానీ తను లిఫ్ట్ చేయకపోవడంతో కృష్ణ ఆవేశంగా కడిగేస్తానని అంటుంటే మురారీ వద్దని ఆగమని చెప్తాడు. కృష్ణ మాత్రం ఒప్పుకోదు. మిమ్మల్ని నేను పెంచాను నేను పెంచాను అంటున్నారు ఏం పెంచారు నా బొంద కోపం, ద్వేషం పెంచుకున్నారని వాగేస్తుంది. సరే వెళ్ళు అడగాల్సినవన్నీ అడగమని చెప్తాడు. కృష్ణ గుమ్మం దాకా వెళ్ళి గతంలో తన తలకి గన్ గురి పెట్టిన విషయం గుర్తు చేసుకుని గట్టిగా అరిచి వచ్చి మురారీ ఒడిలో పడిపోతుంది. ఏంటి వెళ్లలేదని అంటే ఆవిడ దగ్గర గన్ ఉందని మర్చిపోయాను ఈసారి షూట్ చేస్తే అని అమాయకంగా మొహం పెడుతుంది. ఇద్దరూ కాసేపు సరదాగా నవ్వుకుంటారు. అప్పుడే అటుగా వచ్చిన ముకుంద వాళ్ళని చూసి కోపంతో రగిలిపోతుంది.
Also Read: 'సరిఒడి' భోజనాలు చేసిన యష్ దంపతులు- మాళవికకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన వేద
నేను మిమ్మల్ని వదిలి వెళ్తానని చెప్పాను నేను ఎక్కడికి వెళ్ళను మన మధ్య ఉన్న అగ్రిమెంట్ ని రద్దు చేస్తున్నానని కృష్ణ వచ్చి మురారీకి చెప్తుంది. నిజంగా నన్ను వదిలి వెళ్లవా అని సంతోషపడతాడు. మన పెళ్లి అగ్రిమెంట్ మ్యారేజ్ అని ఇంట్లో ఎవరికీ తెలియదు కదా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారని అనుకుంటున్నారు అలాగే ఉండానిద్దామని అగ్రిమెంట్ కాగితాలు కృష్ణ చింపేస్తుంది. ఇద్దరూ సంతోషంగా కౌగలించుకున్నట్టు ముకుంద ఊహించుకుని నో అని గట్టిగా అరుస్తుంది. మళ్ళీ వాళ్ళ గదికి వెళ్ళి చూసేసరికి కృష్ణ హాల్లో మురారీ తలకి ఆయిల్ పెట్టి మర్దన చేస్తుంది. అది చూసి ముకుంద బాధగా లోపలికి వెళ్ళిపోతుంది. రేవతి గదిలోకి వచ్చి మౌనంగా ఉండటంతో ఈశ్వర్ బాధపడతాడు. ఇంట్లో ఎంత మంది ఉన్న మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఎవరూ లేరని అంటాడు. ఇష్టమైన వాళ్ళు మాట్లాడకపోతే ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు. కన్న కొడుకు మాట వినకుండా ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు. వాడు తప్పు చేశాడు అందుకే శిక్ష విధించామని ఈశ్వర్ చెప్తాడు.
రేవతి: శిక్ష వాడికి మాత్రమే కాదు మనకి కూడ. భవానీ అక్కకి కృష్ణ వైద్యం చేసి కాపాడితే మనసు కరగాల్సింది పోయి మళ్ళీ జ్వరం తిరగబెడితే బాగుండని అంటారు ఇది ఎంత వరకు కరెక్ట్
ఈశ్వర్: ఏది కరెక్ట్ అనేది మాకు తెలుసని తిట్టేసి వెళ్ళిపోతాడు.
Also Read: 'నీ ఇంటికొచ్చానంటూ' బాలయ్య లెవల్ లో మధుకర్ కి వార్నింగ్ ఇచ్చిన జానకి- తల్లికి ధైర్యం చెప్పిన రామ
మురారీ తలంటుకుని వస్తాడు. కృష్ణ ఫోన్లు మాట్లాడుతూ ఇంటికొచ్చి పెళ్లి తాలూకూ బిల్ తీసుకువెళ్ళమని చెప్తుంది. మీరు అడిగితే మీ పెద్దమ్మ మాట్లాడే అవకాశం ఉంది ప్రయత్నం చేయమని మురారీకి సలహా ఇస్తుంది. కృష్ణ ఫోన్ చేసిన వాళ్ళందరూ ఇంటికి వస్తారు. పెళ్లి పనులు చేసింది అంతా మా అబ్బాయి కదా వాడితో చెప్పి డబ్బులు ఇప్పిస్తాడాని రేవతి వాళ్ళని భవానీ దగ్గరకి తీసుకొస్తుంది. వీళ్ళని అడ్డం పెట్టుకుని మురారీ పెద్దత్తయ్య మాట్లాడతాడని ప్లాన్ వేసింది కానీ అదేమీ జరగదని ముకుంద మనసులో అనుకుంటుంది. భవానీ డబ్బు తీసుకొచ్చి ముకుంద చేతికిచ్చి వాటిని ఇచ్చి పంపించమని చెప్తుంది. నాకు కూతురు లేదు కాబట్టి ఆ పెళ్లి నా చేతుల మీదుగా జరగలేదు, ఆ పెళ్లి జరిపించిన వాళ్ళు నీకొడుకు కోడలు. ఆ పెళ్లి బిల్లు జీతం రాగానే నీ కొడుకు ఇస్తాడో కోడలు ఇస్తుందో తీసుకుని తనకి రిటర్న్ ఇచ్చేయమని కోపంగా చెప్పేసి వెళ్ళిపోతుంది.