Janaki Kalaganaledu September 29th: భర్తతో జానకి ముద్దులాట, దొంగగా మారిన రామా- మల్లికని అనుమానించిన విష్ణు
చదువు మీద దృష్టి పెట్టించాలని రామా ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జ్ఞానంబ బాధగా పూజలో జరిగిన దాని గురించి గోవిందరాజులతో పంచుకుంటుంది. అఖిల్ ఉన్నతమైన చదువులు చదివి సమాజంలో గొప్ప పేరు తేస్తాడని ఆశపడ్డాను కానీ వాడు నా కలలు చెరిపేసిందే కాక ఘనంగా వాడి పెళ్లి చేసే అవకాశం కూడ లేకుండా చేశాడని జ్ఞానంబ బాధపడుతుంది. మనకి చేదు జ్ఞాపకం అనుకోకుండా వాళ్ళకి మంచి జ్ఞాపకంగా చెయ్యాలి అని సర్ది చెప్పేందుకు చూస్తాడు. మన పద్ధతుల్లో ఇమడలేక ఆ అమ్మాయి మనల్ని బాధపెడుతుంది. ఇటు మల్లిక విష్ణు బాధ్యత లేకుండా ఉంటున్నారు, ఇవన్నీ మోస్తూ రామా ఒంటరిగా కష్టపడుతున్నాడు. అందరూ బాగుండాలని కష్టపడుతూ వాడి సంతోషం మర్చిపోతున్నాడు. వీళ్ళ ప్రవర్తన వల్ల జానకి చదువుకి భంగం కలుగుతుంది. ఇంట్లో అందరం కలిసి ఉన్నామె కానీ ఎవరి తీరున వాళ్ళు ఉంటున్నారు’ అని జ్ఞానంబ బాధపడుతుంది.
పూజ చెడగొట్టినందుకు మల్లిక సంబరంగా గదిలోకి వచ్చి డాన్స్ వేస్తుంది. అది చూసి విష్ణు బిత్తరపోతాడు. మల్లిక మల్లిక అని అరుస్తాడు. అదేమీ పట్టకుండా మల్లిక డాన్స్ వేస్తుంటే నువ్వు ప్రెగ్నెంట్ అని గట్టిగా అరుస్తాడు. అవును కదా ఆ విషయం మర్చిపోయి డాన్స్ వేశా ఇప్పుడు ఎలా కవర్ చెయ్యాలి అని ఆలోచిస్తుంది. కడుపుతో ఉన్న వాళ్ళు వాకింగ్, డాన్సింగ్ చేస్తే సుఖ ప్రసవం అవుతుందని చెప్తే అదేంటి మరి ఏ పని చేయకూడదని నువ్వే చెప్పావు కదా అని విష్ణు అంటాడు. నన్నే అనుమానిస్తారా నేను అలిగాను అని బుంగమూతి పెట్టాను అని సాగించుకుంటుంది. విష్ణు అదంతా నిజమని నమ్మి మళ్ళీ మల్లికని బుజ్జగించేందుకు చూస్తాడు.
Also Read: తులసి తప్పు చేసిందన్న సామ్రాట్- అమ్మలక్కల మాటలు విని రగిలిపోయిన అనసూయ
జానకి జ్ఞానంబ గురించి ఆలోచిస్తూ ఉంటుంటే రామా వస్తాడు. వాటి గురించి ఆలోచించడం మానేసి ముఖ్యమైన వాటి గురించి ఆలోచించమని రామా చెప్తాడు. ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను మీ ఐపీఎస్ మీద దృష్టి పెట్టండి మీ చదువు మీద నేను అమ్మ చాలా ఆశలు పెట్టుకున్నాం, రేపటి నుంచి ఎగ్జామ్స్, వ్యాయామం మీద దృష్టి పెట్టాలి అని రామా ఖరాఖండిగా చెప్తాడు. మీరు ట్రైనింగ్ కోసం వెళ్తే నేను ఒక్కడినే ఎలా ఉండాలి చెప్పండి అందుకే నాకు గుర్తుండేలా రోజు రోజు కొంచెం శక్తి ఇవ్వండి అని రామా అనేసరికి జానకి ముద్దు పెట్టేస్తుంది. ముద్దు పెట్టేసరికి రామా తెగ సిగ్గుపడిపోతాడు. పొద్దునే రామా, జానకి రన్నింగ్ మొదలుపెట్టేస్తారు. కాసేపు పరిగెత్తి జానకి అలిసిపోతుంది. ఇంటి పనుల్లో పడి జానకి గారు అలిసిపోతున్నారు ఉత్తేజాన్ని నింపాలని అనుకుంటాడు.
రామా ముఖానికి టవల్ చుట్టుకుని అక్కడ కూర్చున్న వ్యక్తి ఫోన్ కొట్టేసి పారిపోతాడు. అది చూసి దొంగ దొంగ అని అరుస్తుంటే జానకి గమనించి వాడి వెనుక పరిగెడుతుంది. ఫాస్ట్ గా పరిగెత్తి వెళ్ళి అతన్ని పట్టుకుని ముఖానికి ఉన్న టవల్ లాగేసరికి రామా కనిపిస్తాడు. మీరు ఇలా ఎందుకు చేశారు అని జానకి అనేసరికి మిమ్మల్ని పరిగెత్తించడానికి నాకు వేరే దారి కనిపించలేదు. ఇంటి పరువు బాధ్యత అని చదువు మీద దృష్టి పెట్టడం లేదు అందుకే మిలొ ఉత్తేజం నింపడానికి ఇలా చేశాను, నేను నిజంగా దొంగ అనుకుని మీరు ఎంత వేగంగా పరిగెత్తారో తెలుసా అని రామా అంటాడు. ఇక వెళ్లబోతుంటే జానకి కాలు నొప్పి అనడంతో రామా ఎత్తుకుంటాడు.
Also Read: వెళ్లిపొమ్మన్న రిషి , ఇద్దరం ఒక్కటే అన్న వసు - రిషిధార ప్రేమయుద్ధం