News
News
X

Gruhalakshmi September 29th Update: తులసి తప్పు చేసిందన్న సామ్రాట్- అమ్మలక్కల మాటలు విని రగిలిపోయిన అనసూయ

తులసి, సామ్రాట్ గురించి టీవీలో మళ్ళీ నీచంగా వస్తుంది. కానీ దాన్ని పట్టించుకొనని తులసి చెప్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
 

వాళ్ళెవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు నన్ను ఒంటరి వాడిని చేసి మాట్లాడుతుంటే బాధగా ఉంది మామ్ తట్టుకోలేకపోతున్నా.. నా ఆరాటం నువ్వు ఎదగకుండా కాళ్ళు అడ్డుపెట్టాలని కాదు నువ్వు ఎక్కడ చిక్కుల్లో పడతావో అని నిన్ను అడుగడునా ప్రశ్నించేది ఎవరి మాయలోనే పడి కాదు మామ్. ఎదురుదెబ్బ తగిలి ఎక్కడ కుంగిపోతావో మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదని. నువ్వు మళ్ళీ బాధపడకూడదు, నువ్వు బాధపడితే నేను చూడలేను. ఎవరైనా నీకు అన్యాయం చేస్తుంటే నేను తట్టుకోలేను. నువ్వంటే ద్వేషం కాదు ఐ లవ్యూ మామ్ అని అభి తులసి కాళ్ళ దగ్గర కూలబడి ఏడుస్తాడు. అబద్ధం చెప్పడం లేదు నన్ను నమ్ము మామ్ అని అభి అంటాడు. తులసి కొడుకుని కౌగలించుకుని ఓదారుస్తుంది.

నీ ఆరాటం అర్థం అయ్యింది నువ్వు నా గురించి ఎంతగా ఆలోచిస్తున్నావో నా గురించి నేను అంతకంటే ఎక్కువ ఆలోచిస్తాను, దేన్ని తేలికగా తీసుకోను. మనసు విప్పి మాట్లాడావు సంతోషంగా ఉంది. నా విషయంలో ఏదైనా తప్పు జరిగితే, తప్పు చేస్తున్నా అని అనిపిస్తే అడిగే హక్కు నికెప్పుడు ఉంటుంది. ఈ ఇంటికి తలవంపులు తెచ్చే తప్పు నేనెప్పుడూ చెయ్యను అలా చేసే రోజు అదే మీ అమ్మ జీవితంలో ఆఖరి రోజు అవుతుంది. ఆ తర్వాత మీ అమ్మ మీకెవ్వరికి కనిపించదు అని తులసి ఎమోషనల్ అవుతుంది. అంకిత అభికీ సోరి చెప్తుంది. నిన్ను అర్థం చేసకోలేకపోయాను సోరి అభి అంటుంది. నువ్వు సోరి చెప్పినంత మాత్రాన జరిగింది మర్చిపోలేను నా ఆత్మాభిమానం నాకు ఉంటుంది. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయ్ అని అంటాడు.

Also Read: వెళ్లిపొమ్మన్న రిషి , ఇద్దరం ఒక్కటే అన్న వసు - రిషిధార ప్రేమయుద్ధం

అభిని బుజ్జగించి అంకిత ప్రేమగా అన్నం తినిపిస్తుంది. అనసూయ కూరగాయలు కొనడానికి బయటకి వస్తుంది. అక్కడ అమ్మలక్కలు తులసి గురించి తలాఒక మాట అంటారు. నీ మాజీ కోడల వల్ల మీ ఫ్యామిలికి పబ్లిసిటీ బాగానే దొరుకుతుందిగా.. నీ కోడలిని అచ్చోసిన ఆంబోతులా ఊరి మీదకి వదిలేశారా అని అనసూయని నానా మాటలు అంటారు. పెద్దదానివి కోడలికి బుద్ధి చెప్పాల్సింది పోయి నువ్వు కూడా ఇలా చేస్తున్నావ్ ఏంటి అని అంటారు. డబ్బు వస్తుంటే ఇంకేం మాట్లాడుతుందని అందరూ చండాలంగా మాట్లాడతారు. తులసికి సామ్రాట్ ఫోన్ చేసి ఆఫీసుకి వస్తున్నారా అని అడుగుతాడు. నాకు ఇబ్బంది అనిపించిన రోజు నేనే నిర్ణయం తీసుకుంటాను అని తులసి చెప్తుంది. రేపు హనీ బర్త్ డే ఈవినింగ్ పార్టీ మీరే దగ్గరుండి మరి చూసుకోవాలి అందరూ తప్పకుండా రావాలి అని పిలుస్తాడు.

News Reels

అనసూయ ఇంటికి వచ్చి చితపటలాడుతుంది. రాత్రి టీవీలో వచ్చిన ఇంటర్వ్యూ చూసి అందరూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. తులసి వల్ల ఈ కాలానికే చెడ్డపేరు వస్తుందంట తులసికి చెప్పేస్తాను ఇక ఆ సామ్రాట్ తో కలిసి పని చేయవద్దని అనసూయ అంటే పరంధామయ్య మాత్రం అడ్డుపడతాడు. తులసికి మీరు చెప్తారా నేను చెప్పేదా డిసైడ్ చెయ్యండి అని అనసూయ తేల్చి చెప్పేస్తుంది. హాయిగా ఇంట్లో కూర్చోకుండా ఎందుకు ఈ సంపాదన వెంపర్లాట అని అనసూయ సీరియస్ గా చెప్తుంది. ఏదైనా తులసి ముందు దీని గురించి మాట్లాడటానికి వీల్లేదని పరంధామయ్య అంటాడు. తులసి వచ్చేసరికి మాట్లాడుకునే అందరూ మౌనంగా ఉంటారు.

Also Read: కార్తీకదీపం నాటకంతో సీరియల్ మరో మలుపు, కార్తీక్ భార్య మోనిత కాదని ఫిక్సైపోయిన శివ!

ఏమైంది ఎందుకు అందరూ సీరియస్ ఉన్నారని తులసి అడుగుతుంది. రేపు మన హనీ పుట్టినరోజంట మనల్ని అందరూ ఇంటికి రమ్మని పిలిచారు అని తులసి అనేసరికి మన హనీ ఏంటి నువ్వు తొమ్మిది నెలలు మోసి కన్నట్టు మాట్లాడుతున్నావ్ అని అనసూయ కోపంగా అంటుంది. అదేదో కీళ్ల నొప్పుల బాధలో అలా ఉందిలే నువ్వు వెళ్ళు మనం రేపు సామ్రాట్ ఇంటికి వస్తున్నామని చెప్పమని పరంధామయ్య తులసికి చెప్తాడు. తులసి ఆఫీసులో కూర్చుని ఫైల్స్ చూస్తూ ఉంటే లాస్య చూసి కుళ్లుకుంటుంది.

తరువాయి భాగంలో..

నేను చూసి ఉండకపోతే కంపెనీకి రూ.10 కోట్ల లాస్ వచ్చేది అని నందు తులసి మీద ఫైర్ అవుతాడు. అంత గుడ్డిగా ఉంటే ఎలా తులసి అని లాస్య అంటుంటే థాంక్యూ నందగోపాల్ అని సామ్రాట్ ఎంట్రీ ఇస్తాడు. మీకు సంబంధించిన ఫైల్ కాకపోయినా కంపెనీ కోసం చూసి నష్టం రాకుండా చేశారు. అయినా నేను ఫెరిపై చేయకుండా ఉన్న ఫైల్ మీ దగ్గరకి ఎలా వచ్చిందని అంటాడు. తెలిసి చేసినా తెలియకుండా చేసిన తప్పు తప్పే అని సామ్రాట్ అనేసరికి తులసి బాధపడుతుంది.

 

Published at : 29 Sep 2022 09:22 AM (IST) Tags: Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Today Episode Written Update Gruhalakshmi Serial Gruhalakshmi Serial September 29th

సంబంధిత కథనాలు

Bhavadeeyudu Bhagat Singh: పవన్ ఫ్యాన్స్‌లో కొత్త ఆశలు - భవదీయుడుపై లేటెస్ట్ న్యూస్!

Bhavadeeyudu Bhagat Singh: పవన్ ఫ్యాన్స్‌లో కొత్త ఆశలు - భవదీయుడుపై లేటెస్ట్ న్యూస్!

Inaya in Bigg Boss: క్యారెక్టర్లు మార్చుకున్న హౌస్‌మేట్స్ - మళ్లీ రొమాన్స్ మొదలెట్టిన శ్రీహాన్, ఇనయా

Inaya in Bigg Boss: క్యారెక్టర్లు మార్చుకున్న హౌస్‌మేట్స్ - మళ్లీ రొమాన్స్ మొదలెట్టిన శ్రీహాన్, ఇనయా

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

FALL Series Review: ఫాల్ సిరీస్ రివ్యూ: అంజలి కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉంది?

FALL Series Review: ఫాల్ సిరీస్ రివ్యూ: అంజలి కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉంది?

Pawan Kalyan Harish Shankar : పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో ప్రభాస్ దర్శకుడు

Pawan Kalyan Harish Shankar : పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో ప్రభాస్ దర్శకుడు

టాప్ స్టోరీస్

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp :  కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు