అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today February 28th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: రామరాజుకి దొరికిపోయిన నర్మద, సాగర్! పార్టీలో కొట్టుకున్న ఫ్యామిలీ!

Illu Illalu Pillalu Serial Today Episode February 28th పాతిక లక్షలతో ఉద్యోగం కొనడం గురించి రామరాజు సాగర్, నర్మదల్ని నిలదీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode సాగర్ 25 లక్షలు పెట్టి ఉద్యోగం కొన్నాడు అని తన ఫ్రెండ్ చెప్పిందని భాగ్యం రామరాజుకి చెప్తుంది. సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పిందని వీడియో కూడా పెట్టింది అని రామరాజుకి వీడియో చూపిస్తుంది. ఏజెంట్ సాగర్ పేరు చెప్పి 25 లక్షలతో జాబ్ ఇచ్చానని అంటాడు. ఇంట్లో దొంగని ఈశ్వరుడు అయినా పట్టుకోలేరు అంటారు. వనజకు ఇవ్వాల్సిన 20 లక్షలు ఇంకో 5 లక్షలు కూడా వేరే ఎక్కడో తీసుకొని ఉద్యోగం కొన్నాడు. నర్మద కూడా పెద్ద నీతులు చెప్తుంది. మొగుడు చేసిన మోసం  మాత్రం చెప్పకుండా పార్టీలు చేసుకుంటుంది. మీరు సాగర్‌ని ఇలా వదిలేస్తే కాదు.. ఆ రోజు పాతిక లక్షలు కోసం ఇలా దొంగతనం చేసిన వాడు రేపు ఇంకెన్ని చేస్తాడు. ఎన్ని లంచాలు తీసుకుంటాడో అని ఇడ్లీబాబాయ్, భాగ్యం రామరాజుని తగిలించేస్తారు.

రామరాజు ఆవేశంగా పార్టీ దగ్గరకు బయల్దేరుతాడు. పార్టీ దగ్గర అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రేమ, ధీరజ్ కూడా వచ్చేస్తారు. నర్మద బాధగా ఉంటే ఏమైందని ప్రేమ అడిగితే తర్వాత చెప్తా అని నర్మద అంటుంది. మీరు వెళ్లిన పని ఏమైందని నర్మద అడిగితే మొండోడు కారు కొనేశాడు.. నా పేరు మీద బుక్ చేశాడు అని ప్రేమ చెప్తుంది. ఇక అందరూ పార్టీలో కేక్ కట్ చేసి డ్యాన్స్‌లు చేస్తుంటారు. వల్లీ అందర్ని చూసి ఎంజాయ్ చేయండి.. ఇంకాసేపట్లో తుఫాను వస్తుందని అనుకుంటుంది. 

భాగ్యం ఏజెంట్‌కి కాల్ చేసి మేం రావడం లేదు..  మా మనిషికి 5 లక్షలు ఇచ్చి పంపిస్తున్నాం,.. ఆయన ఫోటో పంపిస్తున్నా చూడు అని రామరాజు ఫొటో పంపిస్తుంది. రామరాజు రావడంతో ఏజెంట్ ఆయనే డబ్బు ఇస్తారని అనుకొని తనని తాను పరిచయం చేసుకొని నేనే ఏజెంట్‌ని డబ్బు తీసుకొచ్చావా అని అడుగుతాడు. దాంతో రామరాజు ఏజెంట్‌ని లాగిపెట్టి కొడతాడు. రామరాజు ఏజెంట్‌ని కొట్టడంతో ఏజెంట్‌ పారిపోతాడు. అందరూ పార్టీ నుంచి వెళ్లిపోతారు. ఏమైందని వేదవతి భర్తని అడుగుతుంది. రామరాజు సాగర్‌ని లాగిపెట్టి కొట్టి సిగ్గు లేదారా పాతిక లక్షలు పెట్టి ఉద్యోగం కొనుక్కుంటావా అని అడుగుతాడు. అందరూ షాక్ అయిపోతారు. వేదవతి కొడుకుతో ఏంట్రా మీ నాన్న చెప్పేది నిజమా అని అడిగితే అవును అత్తయ్యా నిజం అని నర్మద ఏడుస్తూ చెప్తుంది. మీకు ఈ విషయం ఎలా తెలిసింది నాన్న అని సాగర్ అడిగితే ఏరా తెలీదు అనుకున్నావా అంటాడు. సాగర్ని కొట్టబోతే ప్రసాద్‌రావు కూర్చొని మాట్లాడుకుందాం అంటాడు.ఇదంతా నీ వల్లేఇంత నీచానికి దిగుతావు అనుకోలేదు అని తిడతాడు.

నర్మద ఏడుస్తుంటే ఏంటి ఇదంతా అని అడుగుతుంది. ధీరజ్ తండ్రితో నాన్న అయినా వీడికి పాతిక లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగితే దొబ్బేశాడురా.. వనజ గారి డబ్బు దొబ్బేశాడు.. అందుకే మనం ఆ డబ్బు గురించి అడిగినప్పుడల్లా కంగారు పడేవాడు.. కన్నతండి పరువు దొబ్బేసి ఉద్యోగం కొనుక్కున్నాడురా అని అంటాడు. సాగర్ మరిది గారు ఏంటి ఇది అని  శ్రీవల్లి పుల్లలు పెడుతుంది. వాడిదేం పోయిందమ్మా పోయింది నా పరువు కదా.. అని అంటాడు. నీకు ఇదంతా తెలిసే జరిగిందా అని వేదవతి నర్మద అని అడిగితే తెలిసే జరిగింది బుజ్జమ్మా.. మొత్తం ముందే ప్లాన్ చేసుకున్నారు వీళ్లు అని అంటాడు రామరాజు. నర్మద ఏడుస్తూ మీరు అంటే నాకు మా నాన్న కంటే ఎక్కువ. మీ పరువు పోయిన పని మేం ఎప్పటికీ చేయలేం.. అందుకే ఉదయం వనజ గారికి డబ్బు ఇచ్చేశాం అంటుంది. డబ్బు ఎలా ఇచ్చావ్ అని వేదవతి అడిగితే నగలు తాకట్టు పెట్టామని నర్మద చెప్తుంది. 

నగలు తాకట్టు పెట్టుకొని ఉద్యోగం కొనుక్కోవాల్సిన ఖర్మ ఏం పట్టింది అని రామరాజు అంటే దానికి ప్రసాద్ రావు ఆ విషయం నీకు అడగాలి..ఇంట్లో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది.. నీ కొడుకు నీకు ఉద్యోగం గురించి చెప్పలేదు అని అంటే నీ పరిస్థితి అర్థమైంది. ఎలా పెంచావ్ పిల్లల్ని.. ఒక్కడినైనా సరిగ్గా పెంచావా.. ఇంటి కోడలు నగలు తాకట్టు పెట్టింది అంటే అంత కన్నా పరువు తక్కువ ఏముంది..ఈయన పెంపకం ఇలా ఉంది కాబట్టి మొన్న అమూల్య పారిపోయింది అని అంటాడు. మా నాన్న గురించి చెల్లి గురించి నీకు ఎందుకురా నీ కూతురు అల్లుడు గురించి చూసుకోండి అని ధీరజ్ నర్మద తండ్రి కాలర్ పట్టుకొని గొడవ పడతాడు. దండం పెడతా ఆగండి అని నర్మద అరుస్తుంది. పిలవని పేరంటానికి రావడానికి సిగ్గు లేదా.. ముందు నా ఇంటి నుంచి అందరూ వెళ్లిపోండి అని ప్రసాద్ రావు అరుస్తాడు. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu TV Movies Today: ఈ ఆదివారం (మార్చి 08) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే - డోంట్ మిస్
ఈ ఆదివారం (మార్చి 08) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే - డోంట్ మిస్
Nindu Manasulu Serial Today March 7th: ప్రేరణ వాళ్ల నాన్నను కనిపెట్టి తీసుకొచ్చిన సిద్ధూ...అతన్ని కిడ్నాప్‌ చేసిందెవరో చెప్పగానే షాక్‌ తిన్న ఎస్‌ఐ గణ
నిండుమనసులు: ప్రేరణ వాళ్ల నాన్నను కనిపెట్టి తీసుకొచ్చిన సిద్ధూ...అతన్ని కిడ్నాప్‌ చేసిందెవరో చెప్పగానే షాక్‌ తిన్న ఎస్‌ఐ గణ
Chinni Serial Today March 7th: తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో దేవా వలలో చిన్ని చిక్కిందా..? మధును నమ్మించి తీసుకెళ్లి దేవా ఏం చేద్దామనుకున్నాడు...?
చిన్ని సీరియల్: తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో దేవా వలలో చిన్ని చిక్కిందా..? మధును నమ్మించి తీసుకెళ్లి దేవా ఏం చేద్దామనుకున్నాడు...?
Illu Illalu Pillalu Serial Today March 7th: ఆఫీసులో అవమానాలతో కన్నీళ్లు పెట్టుకున్న నర్మదా...తోడికోడలిని ప్రేమతో ఓదార్చిన ప్రేమ
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఆఫీసులో అవమానాలతో కన్నీళ్లు పెట్టుకున్న నర్మదా...తోడికోడలిని ప్రేమతో ఓదార్చిన ప్రేమ
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ T20 World Cup 2026 Final: భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన సూర్యకుమార్ యాదవ్
భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన SKY
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Investment Tips: ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Varanasi News: కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
Embed widget