Janaki Kalaganaledu August 25th Update: జ్ఞానంబతో సేవలు చేయించుకుంటున్న మల్లిక- అఖిల్ తో పెళ్లి జరగదని జెస్సీకి తెగేసి చెప్పిన జానకి
మల్లిక కడుపు డ్రామా ఆడి జ్ఞానంబ ముందు మార్కులు కొట్టేస్తుంది. జానకిని చదువుకోకుండా చెయ్యాలని ప్లాన్స్ వేస్తుంది.
మల్లిక గర్భవతి కాదని జ్ఞానంబకి డాక్టర్ చెప్పేస్తుంది. దాంతో జ్ఞానంగా ఉగ్ర రూపం దాల్చి మల్లిక అని అరుస్తుంది. వద్దు అత్తయ్యగారు నన్ను మా పుట్టింటికి పంపించొద్దు అని నిద్రలో అరుస్తూ ఉంటుంది. విష్ణు లేచి ఏమైందని అడుగుతాడు ఏమి లేదని అంటుంది. తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయని అంటారు. అసలే జానకి ఐపీఎస్ చదువుతుంది తన పోలీసు బుర్రతో కనిపెట్టిన కనిపెట్టేస్తుంది. ఎలాగైనా తను చదువుకోకుండా ఆపాలి ఐదు తప్పులు చేసేలా చేసి పోలేరమ్మతో తిట్టించాలని మనసులో అనుకుంటుంది.
జానకి పరీక్షకి టైం అవుతుందని రామా పిలుస్తాడు. తనని ఆపేందుకు మల్లిక కుట్ర చెయ్యాలని అనుకుంటుంది. ఇడ్లీ తీసుకొచ్చి తినమని ఇస్తుంది.. నాకు ఇడ్లీ తినాలని అనిపించడం లేదు జీడిపప్పు ఉప్మా చేసి పెట్టి కాలేజీకి వెళ్లవా అని అడుగుతుంది. అప్పుడే గోవిందరాజులు, జ్ఞానంబ వస్తారు. తనకి పరీక్ష ఉంది వెళ్లనివ్వమని అంటాడు. పర్లేదులే మావయ్యగారు తనకి ఉప్మా చేసి పెట్టి వెళ్తాను అని అంటుంది. క్రమం తప్పకుండా పరీక్షలు రాస్తేనే మనం చదువుకున్నది వస్తుందని జ్ఞానంబ చెప్పి ఎగ్జామ్ కి వెళ్ళమని చెప్తుంది. నువ్వే వంట చేసి నాకు మేపుతాను అంటే నాకు అంతకన్నా సంతోషం ఏముందని మల్లిక మనసులో అనుకుంటుంది. గోవిందరాజులు నువ్వు ఎందుకు జ్ఞానం చెయ్యడం అని అంటాడు. చిన్న కోడలు కడుపుతో ఉంది ఆ మాత్రం కూడా చేయకపోతే ఎలా అని జ్ఞానంబ అంటుంది.
Also Read: నా కళ్లముందే ఉండాలని కోరిన రిషి, మీరు లేనిదే నేను లేను నా ప్రేమని అంగీకరించండన్న వసుధార
దొరికిందే ఛాన్స్ కదా అని మల్లిక తెగ లాగించేస్తుంది. జెస్సి జానకి కోసం కాలేజీలో ఎదురు చూస్తూ ఉంటుంది. ఎలాగైనా జానకి అక్క హెల్ప్ తీసుకుని అఖిల్ ని పెళ్లి చేసుకుని ఆ ఇంటి కోడలు అయిపోవలని అనుకుంటుంది. నేను నీకు కొత్తగా కనిపించడం లేదా అని జెస్సి జానకిని అడుగుతుంది. నాకేమీ తేడా అనిపించలేదని జానకి అంటుంది. ట్రెడిషనల్ డ్రెస్స్ వేసుకున్నాను, మీరంతా అఖిల్ వాళ్ళమ్మగారు పద్ధతులు నిక్కచ్చిగా పాటిస్తారని చెప్పారుగా అందుకే ఇలా ట్రెడిషనల్ డ్రెస్స్ వేసుకోవాలని ఫిక్స్ అయినట్టు చెప్తుంది. మీ ఇంటికి నీతో పాటు తోడుగా రావడానికి నన్ను నేను మార్చుకుంటున్నాను, మీ ఇంటి అలవాట్లను అలవాటు చేసుకుంటున్నాను, అక్కా మీ ఆచారాలు కూడా నేర్చుకుంటాను వాటిని పాటిస్తాను, ఫుడ్ కి సంబంధించిన విషయాలు అయినా నేర్చుకుని పాటిస్తాను, మీతో పాటే నేను కలిసిపోతాను. నువ్వే ఇంటి పెద్ద కోడలు కాబట్టి ఎలా ఉండాలో చెప్పు నేర్చుకుని ఫాలో అవుతాను అని జెస్సి అంటుంది.
ఇలాంటి ఆలోచనలు మానుకుని చదువు మీద శ్రద్ద పెట్టమని చెప్పినా కూడా జెస్సి ఇంక అఖిల్ ని పెళ్లి చేసుకోవాలనే ఆశలు పెంచుకుంటుంది అది నెరవేరదని అర్థం అయ్యేలాగా చెప్పాలని మనసులో జానకి అనుకుంటుంది. 'అఖిల్ తో నీ పెళ్లి చాలా కష్టం, నువ్వు అక్కా అని వరస కలిపి సాంప్రదాయాలు నేర్చుకున్నంత మాత్రాన మా ఇంటి కోడలివి కాలేవని ముందే చెప్పాను. మళ్ళీ చెప్తున్నా అఖిల్ భవిష్యత్ మీద మా కుటుంబం అంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. వాళ్ళ మాటలు ప్రకారం అఖిల్ నడుచుకోవాలి. వాళ్ళ మాట కాదని సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎవరికి ఉండదు. టైం వెస్ట్ చేసుకోకు, నీ కెరీర్ మీద దృష్టి పెట్టు' అని చెప్తుంది. ఇంట్లో ఎవరు లేకపోయేసరికి మల్లిక నీలావతి మాట్లాడుకుంటూ ఉంటారు. నా కడుపు పోవడానికి కారణం కూడా జానకి అని చెప్పి నా తోటికోడలికి చెక్ పెడతాను, అటు నా కడుపు పోయిందని అందరినీ నమ్మించి ఇటు జానకి పని ఔట్ చేస్తాను అని అంటూ ఉండగా రామా, జానకి అక్కడ ఉంటారు.
Also Read: మోనితని ఫాలో అవుతూ వెళ్లిన దీపకు పెద్ద షాక్, కార్తీక్ అక్కడే ఉన్నాడా!