Karthika Deepam Serial ఆగస్టు 24 ఎపిసోడ్: మోనితని ఫాలో అవుతూ వెళ్లిన దీపకు పెద్ద షాక్, కార్తీక్ అక్కడే ఉన్నాడా!
Karthika Deepam August 24 Episode 1439: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. డాక్టర్ బాబుకోసం దీప, మోనిత ఇద్దరూ వెతుకుతుంటారు..ఇదే పెద్ద ట్విస్ట్...
కార్తీకదీపం ఆగస్టు 24 బుధవారం ఎపిసోడ్ (Karthika Deepam August 24 Episode 1439)
ఈ రోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...దీప ఓ పార్క్ కి వెళ్లి కార్తీక్ ఫోటో పట్టుకుని చూపిస్తూ అందర్నీ అడుగుతుంటుంది. ఎవ్వరూ చూడలేదని చెబుతారు. మరోవైపు మోనిత కూడా కార్తీక్ ఫొటో పట్టుకుని వెతుకుతూ...దీపకి చూపించి అడుగుతుంది. ఇద్దరూ ఒకర్నొకరు చూసుకుని షాక్ అవుతారు.
మోనిత: నువ్వు బతికే ఉన్నావా..నా కార్తీక్ ఎక్కడున్నాడు
దీప: నా డాక్టర్ బాబుని హాస్పిటల్ నుంచి తీసుకెళ్లింది నువ్వేకదా
మోనిత:నువ్వు చెప్పింది వింటుంటే..నా కార్తీక్ బతికే ఉన్నాడు, ఆ దేవుడు నా మొర ఆలకించాడు..శుభవార్త చెప్పావ్.. నా కార్తీక్ ఎక్కడ చెప్పు..
దీప: నీ నాటకాలు చాలు..డాక్టర్ బాబు కోసం హాస్పిటల్ కి వెళ్లి అడిగితే తన భార్య వచ్చిందని చెప్పారు. నిన్ను చూస్తేనే డాక్టర్ బాబు అసహ్యించుకుంటారు కదా అందుకే నువ్వు కాదని సరిపెట్టుకున్నాను.. నువ్విక్కడ కనిపించావంటే డౌటే లేదు.. నువ్వే డాక్టర్ బాబుని తీసుకెళ్లావ్..ఎక్కడున్నారో చెప్పు..
మోనిత: నిజంగానే కార్తీక్ నాదగ్గరుంటే ఈ ఫోటో పట్టుకుని ఎందుకు తిరుగుతాను. కార్తీక్ చనిపోయాడని చెబుతున్నా..యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచీ ప్రతి వీధి దగ్గరా కార్తీక్ కోసం వెతుకుతూనే ఉన్నాను. ఇక కార్తీక్ లేడని నిరాశపడతుండగా నువ్వు కనిపించావ్. నా ఆశని బతికించావ్. మళ్లీ దిగులేంటంటే..నువ్వుండి నీ దగ్గర కార్తీక్ లేకపోవడం ఏంటి..ఎవరో తీసుకెళ్లారు అంటున్నావ్..ఎవరది..కార్తీక్ ని ఎవరు తీసుకెళ్లారు..
దీప: ఎలా కనిపిస్తున్నానే నీ కంటికి..నువ్వు చెప్పే సోదందా నమ్మే పిచ్చిదానిలా కనిపిస్తున్నానా..నువ్వు తప్ప డాక్టర్ బాబుని తీసుకెళ్లే అవసరం ఎవరికీ లేదు. నాటకాలు ఆడకుండూ డాక్టర్ బాబు ఎక్కడున్నారో చెప్పు..
మోనిత: కార్తీక్ నాతో ఉంటే ఎంత సంతోషంగా ఉంటానో..లేకపోతే ఎంత బాధగా ఉంటానో తెలియదా..పైగా లేడు అనుకున్న వ్యక్తి కనిపిస్తే ఇంకెంత సంతోషంగా ఉంటుంది చూడు..నా మొహంలో ఆ సంతోషం కనిపిస్తోందా..కార్తీక్ కోసం పిచ్చిదాన్ని అయిపోతున్నాను దీపా..ఆలోచించి ఆలోచించి..ప్రాణం ఉందో పోయిందో తెలియడం లేదు. అవేవీ అర్థం చేసుకోకుండా నన్నే అనుమానిస్తున్నావ్ న్యాయంగా ఉందా దీపా..ముందు కార్తీక్ ఏమయ్యాడో ఆలోచించు..నీకూ కనిపించలేదు నాకూ కనిపించలేదు... అంటే ఏమైనట్టు.ఎవరు తీసుకెళ్లినట్టు.. అని చెప్పేసి కార్తీక్ ఫొటో పట్టుకుని మళ్లీ వెతకడం ప్రారంభిస్తుంది మోనిత
Also Read: మోనిత వచ్చేసిందోచ్ - డాక్టర్ బాబు కోసం వెతుకులాట, దీపకు ఊహించని షాక్
హిమ: అమ్మ నాన్నల్ని తిరిగి తేలేము. కనీసం శౌర్యని అయినా తిరిగి తేవచ్చు కదా నానమ్మ
సౌందర్య: తను రావడం లేదు అంటే నన్నేం చేయమంటావు శౌర్య అంటే నీ ఒక్కదానికే ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు.
ఆనందరావు: మాకు శౌర్య అంటే ఇష్టమే కానీ అది మొండికేసింది. రానంటే రానంటోంది
హిమ:ఇప్పుడు శౌర్య ఎక్కడుందో తెలిసింది కదా వెళ్లి తీసుకొద్దాం
సౌందర్య: ఇప్పటికీ శౌర్య అక్కడే ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ ఇంటికి రావాలనిపిస్తే ఫోన్ నెంబర్ ఉంది కదా.
మనం అమెరికా వెళ్ళినప్పుడు వచ్చినట్లయితే ఫోన్ చేసేది కదా... అంటే శౌర్య రాలేనట్టే కదా .వెళ్లి వెతుకుదాం పోనీ ప్రయత్నం చేద్దాం...ప్రమాదం జరిగిన దగ్గరికి వెళ్దాం అంటారు మీ తాతయ్య..అక్కడికి వెళ్లి గతమంతా గుర్తుతెచ్చుకు మీ ఆరోగ్యం పాడుచేసుకుంటారు
ఆనందరావు: ఎప్పుడైతే నా కొడుకు కోడలు దూరమయ్యారు అప్పుడే నా గుండు రాయిపోయింది అని అంటాడు అనందరావు.
Also Read: నువ్వెవరో తెలియదన్న కార్తీక్, ఇన్విస్టిగేషన్ ప్రారంభించిన దీప, మోనిత ఎంట్రీకి టైమ్ వచ్చేసింది
ఆ తర్వాత సీన్ లో కార్తీక్, శివ కార్లో వెళ్తూ మధ్యలో దిగుతారు. అప్పుడు కార్తీక్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగితే మిమ్మల్ని ఎలా ఇంటి నుంచి బయటకు తీసుకు వచ్చాను అలాగే ఇంటికి వెళ్లి మేడంకి అప్పగించాలి సార్ అంటాడు. ఎందుకయ్యా నన్ను ఇంత పంజరంలో చిలకల ఉంచుతున్నారు. ఇల్లు కారు, ఇల్లు కారు అని..అసలు అది నా భార్యే కాదు..భార్య కాకపోవడం ఏంటి సార్ అని అడుగుతాడు.మరి లేకపోతే భర్తను ఎవరైనా ఇలా స్వతంత్ర్యం లేకుండా చూసుకుంటారా అని ఫైర్ అవుతాడు..
సౌందర్య...దీప-కార్తీక్ ఫొటో దగ్గర నిల్చుని..శౌర్య రానంటే రాను అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది. మీరు వదిలేసి వెళ్ళిపోయారు..కనీసం శౌర్యనైనా తిరిగి తెచ్చుకుందాం అంటే అది మొండికేస్తోంది. మా దగ్గర ఉన్న ఏకైక ఆనందం అది మాత్రమే అది వస్తే నైనా ఇంట్లో కొంచెం సంతోషం వస్తుందని ఏడుస్తుంది సౌందర్య.
ఎపిసోడ్ ముగిసింది
రేపటి(గురువారం) ఎపిసోడ్ లో
మోనితని ఫాలో అవుతూ వెళుతుంది దీప.. ఇది పెద్ద నాటకాలు ఆడుతోంది..అవసరం అయితే ఈరోజు దీన్ని చంపేసి అయినా డాక్టర్ బాబుని తీసుకెళతాను అనుకుంటూ లోపలకు వెళుతుంది. లోపల అడుగుపెట్టగానే షాక్ అవుతుంది దీప...