‘జబర్దస్త్’ ఫేమ్ రోహిణికి సర్జరీ, ఆపరేషన్ అనవసరంగా చేయించుకున్నానని వెల్లడి
బుల్లితెరపైనే కాకుండా ఇటీవలి కాలంలో వెండితెరపైనా అలరిస్తోన్న లేడీ ఆర్టిస్ట్ రౌడీ రోహిణి ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. కాలులోని రాడ్డును తీయించుకునేందుకు వెళ్లిన ఆమెకు.. డాక్టర్లు షాకింగ్ న్యూస్ చెప్పారు.
Rohini: 'జబర్దస్త్' ద్వారా ఫేమ్‌ను సొంతం చేసుకున్న నటి, కమెడియన్ రౌడీ రోహిణి ఆస్పత్రిలో జాయినయ్యారు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన యాక్సిడెంట్ లో కాలు ఫ్యాక్చర్ కావడంతో లోపల రాడ్డు వేశారు. అయితే దాన్ని తీయించేందుకు ఇటీవల ఆమె హాస్పిటల్‌కు వెళ్లి, టెస్ట్ చేయించుకోగా డాక్టర్లు ఆమెకు భారీ షాక్ ఇచ్చారు. ఇంతకీ ఏమైందంటే..
పలు సీరియల్స్, షోస్, పోగ్రామ్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులతో పాటు ఇటీవల వచ్చిన సినిమాల్లోనూ నటించి పాపులారిటీ తెచ్చుకున్న లేడీ ఆర్టిస్ట్ రోహిణి. 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఆడియెన్స్ కు మరింత దగ్గరైన ఆమెకు.. కెరీర్ లో బిజీ అయ్యేలా చేసింది. ఈ నేపథ్యంలో ఆమెకు ఊహించలేని ఇబ్బంది ఎదురైంది. ఇది ఆమె కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించేదిలా ఉంది. ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ, అందర్నీ నవ్విస్తూ ఉండే రోహిణి.. హాస్పిటల్ బెడ్ ఉండి మాట్లాడుతున్న ఓ ఎమోషన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆమెకు ఏమైందా అని ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. 2016లో రోహిణికి యాక్సిడెంట్ అయ్యింది. కాలికి తీవ్ర గాయం కావడంతో అప్పట్లో.. డాక్టర్స్ కాలికి రాడ్ వేశారు. నటిగా బిజీగా ఉండటం వల్ల ఆ రాడ్‌ను ఇప్పటివరకూ తొలగించే అవకాశం రాలేదు. ఈ మధ్య టీవీ డాన్స్ షోస్‌లో డాన్స్ చేస్తున్న ఆమెకు కాలిలో నొప్పి మొదలైంది. దీంతో ఆమె డాక్టర్లను సంప్రదించింది. అయితే వారు ఆమెకు షాకింగ్ విషయాన్ని చెప్పారు. అదేంటంటే.. యాక్సిడెంట్ సమయంలో అమర్చిన రాడ్‌ను తొలగించలేమని.
దీనికి సంబంధించిన వీడియోనే రోహిణి యూట్యూబ్ లో షేర్ చేసింది. ఈ వీడియోలో ‘‘యాక్సిడెంట్ సమయంలో ఎముకకు సపోర్ట్‌గా వేసిన రాడ్ ఇరుక్కుపోయింది. డాక్టర్స్ దాన్ని తొలగించలేకపోయారు. ఒకవేళ బలవంతంగా తొలగించాలని ప్రయత్నిస్తే ఎముక విరిగిపోయే ప్రమాదముందని డాక్టర్స్ అన్నారు. కాబట్టి ఆ రాడ్‌ను తొలగించకపోవటమే మంచిదని వారు సలహా ఇచ్చారు’’ అని రోహిణి చెప్పింది.
Read Also: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు ఇవే!
‘‘ప్రస్తుతం వరుస షోస్, సినిమాలు, అవకాశాలతో బిజీగా ఉన్నాను. కాలిలోని రాడ్‌ను తీయించేస్తే బావుంటుందని, ఆపరేషన్ చేయించుకుందామని వచ్చాను. అనవసరంగా ఆపరేషన్ చేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ కొన్ని నెలలు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రాడ్ బయటకు రాలేదు, ఆఫర్స్ ఉన్నప్పుడు ఇలా గ్యాప్ రావటం అనేది చాలా ఇబ్బందికరం. బయటకు నవ్వుతున్నా లోపల చాలా బాధగా ఉంది’’ అంటూ ఆమె చేసిన ఎమోషనల్ కామెంట్స్ అందర్నీ కంటతడి పెట్టించేవిలా ఉన్నాయి. రోహిణి పరిస్థితి తెలిసి ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.