Theatre-OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు ఇవే!
ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్లతో పాటు ఓటీటీలోనూ సందడి చేయబోతున్నాయి. ఇంతకీ ఆ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఈ వారంలో పలు సినిమాలు వెండి తెరపై సందడి చేయనున్నాయి. తెలుగుతో పాటు పలు డబ్బింగ్ సినిమాలు సైతం తెలుగు ప్రేక్షకలను అలరించనున్నాయి. ఈ వారంలో సినీ ప్రియుల ముందుకు రాబోతున్నట్లు సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
థియేటర్‌లలో రిలీజయ్యే సినిమాలివే
1. ’అన్నీ మంచి శకునములే’- మే 18న విడుదల
ఫ్యామిలీ ఆడియెన్స్ అలరించేందుకు థియేటర్లలోకి రాబోతోంది ‘అన్నీ మంచి శకునములే’ సినిమా. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ హీరో, హీరోయిన్లుగా నందినిరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్వప్నదత్, ప్రియాంకదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మే 18న విడుదలకు రెడీ అవుతోంది.
2. ‘బిచ్చగాడు-2’- మే 19న విడుదల
‘బిచ్చగాడు’ సినిమాతో అద్భుత విజయాన్ని అందుకున్న విజయ్ ఆంటోనీ, ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బిచ్చగాడు-2’లో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మే 19న విడుదలకానుంది. తొలి భాగంలో మాదిరిగానే సీక్వెల్ లోనూ డ్యుయెల్ రోల్ చేసినట్లు తెలుస్తోంది. అన్నా చెల్లెళ్ల మధ్య సెంటిమెంట్ ను ఈ సినిమాలో చూపించనున్నారు.
3. ‘ఫాస్ట్ ఎక్స్’- మే 19న విడుదల
ప్రపంచ వ్యాప్తంగా యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఎంతో ఇష్టమైన సినిమా సిరీస్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’. ఈ ప్రాంచైజీలో వస్తున్న తాజా మూవీ ‘ఫాస్ట్ ఎక్స్’. విన్ డీజిల్ ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో జాసన్ మొమోవా నెగెటివ్ రోల్ చేస్తున్నారు. జస్టిన్ లిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 19న విడుదల కానుంది. కార్ రేస్ లు, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లు సినీ అభిమానులను అలరించనున్నాయి.
ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లు
సోనీ లివ్
1. ’ఏజెంట్’- మే 19న విడుదల
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఏజెంట్’. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఎన్నో అంచనాల నడుమ విడుదలైనా, ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యింది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. మే 19 నుంచి సోనీలివ్ లో అందుబాటులో ఉండనుంది. ఇందులో మమ్ముట్టి ప్రత్యేక పాత్రలో నటించారు.
2. ’కడిన కదోరమీ అంద కదహం’ (మలయాళం)- మే 19న విడుదల
డిస్నీ+ హాట్‌స్టార్
1. ‘డెడ్ పిక్సెల్స్’- మే 19న విడుదల
పెళ్లి తర్వాత కొణిదెల నిహారిక ‘డెడ్ పిక్సెల్స్’ వెబ్ సిరీస్ తో మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సిరీస్ లో వైవా హర్ష, అక్షయ్ లింగుస్వామి, సాయి రోణక్ సహా పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ ను ఆదిత్య మండల తెరకెక్కించారు. మే 19 నుంచి ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో అందుబాటులోకి రానుంది.
నెట్‌ఫ్లిక్స్
1. అయాలవాషి (మలయాళం)- మే 19న విడుదల
2. కథల్ (హిందీ)- మే 19న విడుదల
3. మ్యూటెడ్ (ఇంగ్లీష్)- మే 19న విడుదల
అమెజాన్ ప్రైమ్ వీడియో
1. మోడ్రన్ లవ్ చెన్నై (తమిళ్) మే 18న విడుదల
Read Also: రేపటి నుంచే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, రెడ్ కార్పెట్ మీద బాలీవుడ్ భామల సందడి, లైవ్ ఎలా చూడాలంటే?