News
News
వీడియోలు ఆటలు
X

Cannes 2023 Live Streaming: రేపటి నుంచే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌, రెడ్ కార్పెట్ మీద బాలీవుడ్ భామల సందడి, లైవ్ ఎలా చూడాలంటే?

ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 మే 16 నుండి మే 27 వరకు ఫ్రాన్స్‌ లో జరుగనుంది. భారత్ నుంచి అనుష్క శర్మ, మానుషి చిల్లార్, షానన్ కె, డాలీ సింగ్ రెండ్ కార్పెట్ మీద నడవనున్నారు.

FOLLOW US: 
Share:

ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్. ప్రతి ఏటా ఫ్రాన్స్ లో ఈ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 76వ ఎడిషన్ రేపటి నుంచి మొదలు కానుంది. మే 16 నుంచి మే 27 వరకు జరగనుంది. ఈ వేడుకల్లో పలువురు భారతీయ నటీనటులు సందడి చేయనున్నారు. 

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 ఎప్పుడు ప్రారంభమవుతుంది?

76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 16న ప్రారంభమవుతుంది.  దాదాపు 11 రోజుల పాటు అంటే మే 27 వరకు కొనసాగుతుంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది?

ఈసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 ఫ్రాన్స్‌ లోని తీర ప్రాంతమైన ఫ్రెంచ్ రివేరాలో జరగనుంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఈ స్పెషల్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై నడవనున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈసారి పలు సినిమాలను ప్రదర్శించనున్నారు.   

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరయ్యే బాలీవుడ్ తారలు ఎవరు?   

L'Oréal Paris బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న నటి అనుష్క శర్మ, కేన్స్ రెడ్ కార్పెట్‌లో భారత్ కు ప్రాతినిధ్యం వహించనుంది.  హాలీవుడ్ నటి కేట్ విన్‌స్లెట్‌తో కలిసి పలువురికి ఆమె అవార్డులను అందజేయనుంది. అటు 2017 మిస్ వరల్డ్, నటి మానుషి చిల్లర్ కూడా ఈ సంవత్సరం కేన్స్‌లోకి అడుగుపెట్టనుంది. ఆమె ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్ట్‌ లో అనుష్క శర్మతో కలిసి పాల్గొననుంది.

సింగర్ కుమార్ సాను కూతురు షానన్ కె కూడా కేన్స్ అరంగేట్రం చేయనుంది. 2018లో 'పూ బేర్'తో సింగర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన షానన్ కుమార్ సాను, 2020లో హాలీవుడ్‌లోని 'ది బిగ్ ఫీడ్'తో పాటు 'గివ్ మి యువర్ హ్యాండ్' అనే పాటతో గుర్తింపు తెచ్చుకుంది.  కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ డాలీ సింగ్ కూడా ఈ సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కనిపించనున్నారు.

రెగ్యులర్ గా ఈ ఫెస్టివల్ కు హాజరయ్యే వారిలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, ఐశ్వర్య రాయ్ బచ్చన్, సోనమ్ కపూర్, మల్లికా షెరావత్,  హీనా ఖాన్ ఉన్నారు.  కత్రినా కైఫ్, పూజా హెగ్డే, తమన్నా భాటియా, అదితి రావ్ హైదరీ కూడా రెడ్ కార్పెట్‌పై నడిచారు. ఈసారి ఎవరెవరో ఈ వేడుకలో పాల్గొంటారో చూడాలి. ఐశ్వర్య రాయ్, విద్యాబాలన్, షర్మిలా ఠాగూర్,  దీపికా పదుకొణె వంటి బాలీవుడ్ ప్రముఖులు ఇంతకుముందు ఫ్రెంచ్ ఫెస్టివల్‌ జ్యూరీలో భాగంగా ఉన్నారు. అయితే ఈ సంవత్సరం ఆ ప్యానెల్‌లో భారతీయులు ఎవరూ లేరు.

పలు భారతీయ చిత్రాల ప్రదర్శన

ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పలు భారతీయ చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఫెస్టివల్‌లోని మిడ్‌నైట్ స్క్రీనింగ్స్ విభాగంలో భాగంగా దర్శకుడు అనురాగ్ కశ్యప్ 'కెన్నెడీ'ని ఎంపిక చేశారు.  రాహుల్ రాయ్ నటించిన 'ఆగ్రా'  డైరెక్టర్స్ ఫోర్త్‌ నైట్ విభాగంలో ప్రపంచ ప్రీమియర్‌ను ప్రదర్శించనున్నారు. దీనిని కను బెహ్ల్ రచించి, దర్శకత్వం వహించారు.  మణిపురి చిత్రనిర్మాత అరిబామ్ శ్యామ్ శర్మ 1990లో అవార్డు గెలుచుకున్న చిత్రం 'ఇషానౌ' ఈ సంవత్సరం కేన్స్‌లో ప్రదర్శించబడుతుంది. ఇది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 ప్రతిష్టాత్మకమైన కేన్స్ క్లాసిక్ విభాగంలో మే 19న రెడ్ కార్పెట్ వరల్డ్ ప్రీమియర్ కోసం అధికారికంగా ఎంపిక చేయబడింది. ఈ రీస్టోర్డ్ ఫిల్మ్ ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ క్లాసిక్ విభాగంలో పరిగణించబడే ఏకైక భారతీయ చిత్రంగా నిలిచింది.

76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లైవ్ ఎక్కడ చూడాలి?

76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ఈవెంట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా Facebook, Twitter, Youtubeతో సహా వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా నేరుగా ప్రసారం చేయనున్నారు.

Read Also: నీ స్టేటు దాటా, నీ గేటు దాటా, నీ పవర్ దాటా - ఫస్ట్ థండర్ తో దుమ్మురేపిన రామ్!

Published at : 15 May 2023 02:09 PM (IST) Tags: Cannes 2023 Live Streaming Cannes 2023 Date Cannes 2023 Cannes 2023 Live Cannes Film Festival 2023 When is Cannes Film Festival 2023 Cannes 2023 Jury Cannes 2023 Ticket Price Cannes Red Carpet Cannes Red Carpet Photos Cannes Film Festival 2023 Live Cannes Film Festival Live Cannes Film Festival Live Streaming

సంబంధిత కథనాలు

NBK 108 Title : టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి - బాలకృష్ణ సినిమా టైటిల్ ఆవిష్కరణకు భారీ ప్లాన్ 

NBK 108 Title : టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి - బాలకృష్ణ సినిమా టైటిల్ ఆవిష్కరణకు భారీ ప్లాన్ 

మనం అనుకుంటున్నట్టు ప్రభాస్ అలాంటి వాడు కాదు: కృతి సనన్

మనం అనుకుంటున్నట్టు ప్రభాస్ అలాంటి వాడు కాదు: కృతి సనన్

Samantha Workout Video : షాక్ ఇచ్చిన సమంత - వందకు తగ్గేదే లే!

Samantha Workout Video : షాక్ ఇచ్చిన సమంత - వందకు తగ్గేదే లే!

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

Guppedanta Manasu June 7th: వసుధార మాట వినిపించి పరుగుతీసిన రిషి, కాలేజీలో వసుకి బెదిరింపులు!

Guppedanta Manasu June 7th:  వసుధార మాట వినిపించి పరుగుతీసిన రిషి, కాలేజీలో వసుకి బెదిరింపులు!

టాప్ స్టోరీస్

Modi Telangana Tour: మరోసారి తెలంగాణకు మోదీ, ఈసారి రోడ్‌ షోకి కూడా ప్లాన్!

Modi Telangana Tour: మరోసారి తెలంగాణకు మోదీ, ఈసారి రోడ్‌ షోకి కూడా ప్లాన్!

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- రక్తంలా కనిపిస్తున్న నీళ్లు!

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- రక్తంలా కనిపిస్తున్న నీళ్లు!

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?