Boyapati Rapo Movie: నీ స్టేటు దాటా, నీ గేటు దాటా, నీ పవర్ దాటా - ఫస్ట్ థండర్ తో దుమ్మురేపిన రామ్!
రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ ను ఫస్ట్ థండర్ పేరుతో చిత్ర బృందం విడుదల చేసింది.
మాస్ సినిమాలను రూపొందించడంలో బోయపాటి శ్రీను స్టైలే వేరు. ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ మాస్ ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో ఓ సినిమా చేస్తున్నారు. సినిమాలో కథానాయికగా నటిస్తున్న శ్రీలీల, సీనియర్ హీరో శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రామ్ ను ఇప్పటి వరకూ చూడని మాసీగా చూపించబోతున్నారు బోయపాటి.
రామ్ పోతినేనికి బోయపాటి బర్త్ డే గిఫ్ట్
స్టైలిష్ హీరో రామ్ పోతినేని ఇవాళ(మే 15) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఫస్ట్ థండర్ (Boyapati RAPO First Thunder) పేరుతో సినిమా గ్లింప్స్ విడుదల చేశారు. రామ్ బర్త్ డే గిఫ్టుగా, ఉదయం 11.25 గంటలకు గ్లింప్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఫస్ట్ థండర్ లో రామ్ మామూలు మాస్ లుక్కులో లేరు. బోయపాటి శ్రీను ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో హీరోలను చూసినా సరే... ఇంత కంటే మాసీగా ఉన్నట్టు ఎక్కడ కనిపించదు. ఫస్ట్ లుక్ పోస్టల్లో చూపించినట్లుగానే రామ్ లుక్ ఊరమాస్ గా ప్రేక్షకులను అలరిస్తోంది.
అదిరిపోయే డైలాగ్స్, అంతకు మించి యాక్షన్ సీన్స్!
ఫస్ట్ థండర్ ఓపెనింగ్ లో రామ్ పెద్ద కత్తితో నడుచుకుంటూ వస్తూ కనిపిస్తారు. బాంబు పేలుడు ధాటికి జీపులోని విలన్స్ అంతా కత్తులతో చెల్లాచెదురుగా పడతారు. ఆ తర్వాత దున్నపోతును పట్టుకుని సదర్ ఉత్సవంలోకి రామ్ ఎంట్రీ ఇస్తారు. “ నీ గేటు దాటలేను అన్నావ్, దాటా. నీ గేటు దాటలేను అన్నావ్, దాటా, నీ పవర్ దాటలేను అన్నావ్, దాటా, ఇంకేటి దాటేది నా బొంగులో లిమిట్స్” అంటూ రామ్ చెప్పే మాసీ డైలాగ్స్ అదిరిపోయాయి. విలన్స్ ను చితకబాదే విజువల్స్ మరింత ఆకట్టుకుంటున్నాయి. ఇక ఫస్ట్ గ్లింప్స్ వెనుక మ్యూజిక్ మరింత హైలెట్ గా నిలుస్తుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఫస్ట్ థండర్ విడుదల చేశారు.
విజయ దశమి కానుకగా విడుదల
విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 20నబోయపాటి శ్రీను, రామ్ పోతినేని సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆల్రెడీ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అది చూస్తే... దున్నపోతును రామ్ తీసుకుని వెళుతున్నారు. మాసివ్ లుక్ ప్రేక్షకులను అట్ట్రాక్ చేసింది. సినిమాలో ఫైట్స్ కూడా అంతే మాసివ్ గా ఉంటాయని తెలిసింది. సినిమాలోని హైలైట్స్‌లో ఆ బుల్ ఫైటింగ్ సీన్ ఒకటి అని తెలిసింది. సుమారు పదకొండు రోజుల పాటు ఆ ఫైట్ తీశారట. దానికి భారీ ఖర్చు అయ్యిందని, నిర్మాత శ్రీనివాసా చిట్టూరి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని టాక్. ఇది కాకుండా 1500 మందితో మరో ఫైట్ తీశారట. బుల్ ఫైటింగ్ యాక్షన్ సీక్వెన్సు కోసం భారీ లైట్స్ యూజ్ చేశారు. హైదరాబాదులోని ఓ ప్రయివేట్ స్టూడియోలో ఆ సీన్ తీశారు.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'ది వారియర్' తర్వాత రామ్ తో ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఇందులో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు.
Read Also: ఎన్టీఆర్, కొరటాల శివ చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్! జూనియర్ బర్త్ రోజున రివీల్?