Anchor Sowmya Rao: నా తల్లి ఎదుర్కొన్న నరకయాతన మరే తల్లికి రాకూడదు - ‘జబర్దస్త్’ యాంకర్ సౌమ్య భావోద్వేగం
జబర్దస్త్ యాంకర్ సౌమ్యారావు తన తల్లిని తలచుకుని ఎమోషనల్ అయ్యింది. చివరి రోజుల్లో ఆమె ఎదుర్కొన్న నరకయాతన మరే తల్లికి రాకూడదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
‘జబర్దస్త్’ యాంకర్ సౌమ్యారావు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. పలు సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల భామ, అనుకోకుండా ‘జబర్దస్త్’ యాంకర్ గా షోలోకి అడుగు పెట్టింది. వచ్చీరాని తెలుగుతో ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. అదిరిపోయే పంచులతో అందరినీ నవ్విస్తుంది. బుల్లితెరపై చలాకీగా ఉండే సౌమ్య, నిజ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంది.
మదర్స్ డే రోజు తల్లి తలుచుకుని ఎమోషనల్ అయిన సౌమ్య
మదర్స్ డే రోజు తన తల్లి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఎమోషనల్ అయ్యింది. ఆమె ఆఖరి రోజుల్లో పడిన కష్టాలు తలుచుకుని భావోద్వేగానికి గురైంది. నా తల్లి ఎదుర్కొన్న నరకయాతన మరే తల్లికి రాకూడదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. “అమ్మ, అంబులెన్స్, డాక్టర్లు, ట్రీట్‌మెంట్, మందులు, బాధ. అమ్మంటే ఒక బాధాకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. అమ్మ కోసం దేవుడి గుడికి వెళ్లి ఎన్నో పూజలు చేశాను. ఉపవాసాలు ఉన్నాను. అయినా దేవుడు నీ మీద, నా మీద కరుణ చూపించ లేదు. దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని చాలా బాధపడుతున్నాను. అందరూ అమ్మ ఫోటో షేర్ చేస్తూ మదర్స్ డే శుభాకాంక్షలు చెప్తుంటే, నాకు మాత్రం చివరి రోజుల్లో నువ్వు పడిన బాధే జ్ఞాపకం వస్తుంది. రాత్రి పగలు నీకు సేవ చేసినా, దేవుడికి పూజలు చేసినా, అన్నీ వృథా అయ్యాయి. నువ్వు లేకుండా నా జీవితం అసంపూర్ణంగానే మిగిలింది. ప్రతి రోజు, ప్రతి క్షణం నిన్ను మిస్ అవుతున్నాను. అమ్మా, నువ్వు నా కోసం మళ్లీ పుడతానని ఎదురు చూస్తున్నాను. దేవుడా! మళ్లీ మా అమ్మానాన్నలను నాకు ఇవ్వు. హ్యాపీ మదర్స్ డే అమ్మా! ఆల్వేస్ మిస్సింగ్ యూ! లవ్ యూ సో సో సో మచ్!” అంటూ తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది.
View this post on Instagram
ఊహించని రీతిలో జబర్దస్త్ యాంకర్ గా వచ్చిన సౌమ్యారావు
నిజానికి ‘జబర్దస్త్’లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి అందర్నీ షాక్ గురయ్యేలా చేసింది సౌమ్యా రావు. ‘జబర్దస్త్’ షోకు యాంకర్ గా ఉన్న అనసూయ వెళ్లిపోవడంతో, ఆ తర్వాత ఎవరు యాంకర్ గా వస్తారా? అంటూ ఎదురు చూశారు బుల్లితెర అభిమాను. ఎవరూ ఊహించని విధంగా యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది సౌమ్య. అంతక ముందు ఓ టీవీ ప్రోగ్రాంలో పాల్గొన్న ఆమెకు మంచి హైప్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెనే ‘జబర్దస్త్’ కొత్త యాంకర్ గా ఎంపిక చేశారు నిర్వాహకులు. ప్రస్తుతం ‘జబర్దస్త్’ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చకుంది. ఓ వైపు ‘జబర్దస్త్’ షో చేస్తూనే, మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను నడిపిస్తోంది. అందులో ఇంట్రస్టింగ్ గా వీడియోలు అప్లోడ్ చేసి ఫాలోవర్స్ ను సంపాదిస్తోంది. ‘జబర్దస్త్’ యాంకర్ గా గుర్తింపు రావడంతో ఆ గ్లామర్ ను ఇలా కూడా వాడుకుంటోంది సౌమ్య.