Samantha: సమంత ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా? ఆమె మెనేజర్ ఏం చెబుతోంది?
సమంత ఇన్ స్టా ఖాతా హ్యాక్ అయిందంటూ అభిమానుల్లో సందేహం మొదలైంది.
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది సమంత. ఎప్పటికప్పుడు ఫోటోలతో పాటూ, తన భావాలను పంచుకుంటుంది. అలాంటిది ఆమె అభిమానుల్లో హఠాత్తుగా ఓ సందేహం మొదలైంది. ఆమె ఇన్ స్టా ఖాతాలో ఓ పోస్టు కనిపించింది. అది సినిమాలకు సంబంధించినది కాదు, ఆమె ఫోటో కూడా కాదు, ఓ రాజకీయ నాయకుడి ఫోటో కనిపించింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆమె ఖాతా హ్యాక్ అయిందా అంటూ అనుమానంతో పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో సమంత మళ్లీ ట్రెండవ్వడం మొదలైంది. ‘సమంత ఇన్ స్టా అకౌంట్ హ్యాక్’ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండవుతోంది.
హ్యాక్ అయిందా?
సమంత డిజిటల్ మేనేజర్ శెషాంక బినేష్ స్పందించి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. అదొక ‘టెక్నికల్ గ్లిచ్’ అని చెప్పారు. అంటే ఒక ఖాతాలో పడబోయి మరో ఖాతల పోస్టు కావడం అని వివరించారు. అదొక క్రాస్ పోస్ట్ అని తెలిపారు. ఈ విషయంపై ఇన్ స్టాగ్రామ్ వారికి ఫిర్యాదు చేశామని చెప్పారు. అభిమానుల్లో ఇలా గందరగోళం క్రియేట్ చేసినందుకు క్షమాపణలు కోరారు. దీనిపై సమంత నేరుగా స్పందించలేదు. ఆమె తరుపున ప్రతినిధిగా శెషాంక వివరణ ఇచ్చారు. సమంత ఇంతవరకు రాజకీయపరంగా కామెంట్లు చేయడం, ఫోటోలు పెట్టడం వంటివి చేయలేదు.
Samantha's instagram account hacked?@Samanthaprabhu2 pic.twitter.com/GowUlWNN0P
— 𝙑𝙚𝙣𝙠𝙖𝙩 ™ (@venkatvenky9492) July 4, 2022
ఫుల్ బిజీ...
సమంత విడాకుల తరువాత సినిమాలతో చాలా బిజీగా మారిపోయింది. వరుస పెట్టి సినిమాలు ఒప్పుకుంది. ఒక సినిమా చేయడానికి మూడు నుంచి అయిదు కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్. అలాగే హాలీవుడ్ సినిమాలో నటించేందుకు కూడా ఓకే చెప్పిందని తెలుస్తోంది. తెలుగులో యశోద, ఖుషీ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. శాకుంతలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇదిలా ఉండగా నయనతార తీయబోయే సినిమాలో సమంతనే లీడ్ రోల్ చేయబోతోందని తెలుస్తోంది. బాలీవుడ్లోనూ వెబ్ సిరీస్ లలో నటించేందుకు సిద్ధంగా ఉంది. అలాగే తాప్సీ తీయబోయే సినిమాలో కూడా సమంతనే నటించబోతోందని తెలుస్తోంది. ఏది ఏమైనా సమంత మంచి స్పీడు మీద ఉందనే చెప్పాలి.
Also read: అచ్చు అలియా భట్‌లాగే ఉంది కదా, అదే ఆ పిల్లకు శాపమైంది, ఓ మోడల్ కథ
Also Read: జ్వాల(శౌర్య)కి నిజం తెలిసిపోయింది, ఇప్పుడు హిమ పరిస్థితేంటి - సౌందర్య రియాక్షన్ ఎలా ఉండబోతోంది!