Samantha: 'యశోద' సినిమాలో మెయిన్ పాయింట్ ఇదేనా?
'యశోద' సినిమా కథ..సైన్స్ అండ్ సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ చుట్టూ తిరుగుతుంది.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత(Samantha). వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది. ఓ పక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరోపక్క ఇతర భాషల్లో ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతోంది. అలానే వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'యశోద'(Yashoda) అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను హరి, హరీష్ అనే దర్శకులు తెరకెక్కిస్తున్నారు. శ్రీదేవి మూవీస్(Sridevi Movies) బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులు అవుతుంది.
ఇప్పుడు రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు. నవంబర్ 11న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో గర్భవతి రోల్ చేశారు సమంత. ఆ మధ్య విడుదల అయిన టీజర్ ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమా కథ..సైన్స్ అండ్ సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ చుట్టూ తిరుగుతుంది. కథ ప్రకారం.. సినిమాలో ముకుందన్ క్యారెక్టర్ ఒక మందు కనిపెడతాడట.
Interesting Super Natural element in Yashoda Movie: దాన్ని మనిషి శరీరంలోకి పంపిస్తే.. చాలా తక్కువ వయసున్న వ్యక్తిగా మారిపోతాడట. అలానే బిహేవియర్ లో కూడా కొన్ని మార్పులు వస్తాయట. సినిమా మొత్తం ఈ పాయింట్ చుట్టూనే తిరుగుతుందని సమాచారం. ఈ సినిమాను సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందించినట్లు తెలుస్తోంది. స్క్రీన్ ప్లే కూడా డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న 'యశోద' సినిమాలో సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి పాటలు రాస్తున్నారు.
హైలైట్ గా యాక్షన్ సీక్వెన్సెస్:
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో 3 యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నారయట. మూడు వేటికవి భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. అందులో ఓ యాక్షన్ సీన్ ని 'ఫ్యామిలీ మ్యాన్' టీమ్ కి పని చేసిన ఫారెన్ కొరియోగ్రాఫర్ కంపోజ్ చేశారు. ఈ యాక్షన్ సీన్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2కి పని చేసిన యాక్షన్ మాస్టర్లే ఈ సినిమాకి కావాలని సమంత డిమాండ్ చేయడంతో నిర్మాతలు వాళ్లతోనే వర్క్ చేయించారు. క్లైమాక్స్ కి ముందు ఓ భారీ యాక్షన్ సీన్ ఉంటుందని.. అందులో సమంత పోరాటలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా కోసం సమంత చాలా కష్టపడింది. స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకుంది. మరి ఆ యాక్షన్ ఫీట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.
Also Read: సుమతో ఆడేసుకున్న అనుదీప్, శివ కార్తికేయన్ - ఆ పంచులకు నవ్వు ఆగదు!