అన్వేషించండి

సుమతో ఆడేసుకున్న అనుదీప్, శివ కార్తికేయన్ - ఆ పంచులకు నవ్వు ఆగదు!

ఇన్నాళ్లూ యాంకర్ సుమా అందరినే ఆడేసుకొనేవారు. అయితే, ఈసారి అది రివర్స్ అయ్యింది. తాజా ‘క్యాష్’ ప్రోమో చూస్తే మీకూ అదే అనిపిస్తుంది.

టీవీ చానెల్స్‌లో వచ్చే కొన్ని ప్రోగ్రామ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలాంటి వాటిలో క్యాష్ ప్రోగ్రాం ఒకటి. యాంకర్ సుమ నిర్వహిస్తున్న ఈ షో ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా ఈ షో నడుస్తోన్నా ఇప్పటికీ టాప్ రేటింగ్ ప్రోగ్రామ్స్ లో ఒకటిగా నిలిచి దూసుకుపోతోంది. క్యాష్ ప్రోగ్రాంకి చాలా మంది సెలబ్రిటీలు వస్తుంటారు. అందులో కొన్ని ఎపిసోడ్ లు మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోతాయి. ఆ సెలబ్రెటీలు అలా గుర్తిండిపోతారు. అబ్బా భలే కామెడీ చేశారు. వాళ్ళు మళ్లీ ఇలాంటి ప్రోగ్రాంమ్స్ కి వస్తే బాగుండేది అనుకుంటాం. అలా ఓసారి క్యాష్ ప్రోగ్రాంకి వచ్చి మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు.. జాతిరత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ. గతంలో ఒకసారి అనుదీప్ క్యాష్ ప్రోగ్రాంకి అతిథిగా వచ్చారు. ఆ ప్రోగ్రా లో అనుదీప్ కామెడీ టైమింగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు. దీంతో అనుదీప్ కి అక్కడ నుంచి మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. 

‘జాతిరత్నాలు’ హిట్ తర్వాత అనుదీప్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ప్రిన్స్. ఈ సినిమాలో తమిళ హీరో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నారు. ఇటీవలే సినిమాకు సంబంధించి ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా డైరెక్టర్ అనుదీప్ తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రిన్స్ సినిమా బృందం క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొంది. అందుకు సంబంధించిన ప్రోమో ఇటీవలే యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రోమో చూస్తుంటే ఈ ప్రోగ్రాంలో కూడా నవ్వులు పువ్వులు పూయించినట్లు తెలుస్తోంది. అనుదీప్ ను ప్రత్యేకంగా ఎంట్రీ చేయించారు. రావడం రావడంతోనే మా షో గురించి ఏమైనా చెప్పండని యాంకర్ సుమ అడగ్గా.. ‘‘షో చూసి ఎంజాయ్ చేయండి’’ అని పంచ్ వేశాడు. ఈ ప్రోగ్రాంలో అనుదీప్ తోపాటు హీరో శివకార్తికేయన్, నటి మారియా, రాహుల్ లు పాల్గొన్నారు. 

ప్రోమోలో యాంకర్ సుమ ‘‘నా గురించి ఏమైనా చెప్పొచ్చు’’గా అని అడిగితే నేను మీకు ఫ్యాన్ ని అని పంచ్ వేశాడు అనుదీప్. ‘‘చాక్ లెట్ తింటే ఎంత సేపటికి ఏకాగ్రత పెరుగుతుంది’’ అని సుమ అడగ్గా.. ‘‘నా ఏకాగ్రత అంతా చాక్ లెట్ మీదే ఉంటుంది’’ అని హీరో శివకార్తికేయన్ నవ్వులు పూయించారు. ఇదే ప్రశ్న అనుదీప్ ని అడిగితే ‘‘మొత్తం చాక్ లెట్ తినాలా’’ అని  పంచ్ వేసి ఆశ్చర్యపరిచాడు. ఇలాంటి ఊహించని పంచ్ లతో క్యాష్ ప్రోమో నిండిపోయింది. ఇంక పూర్తి షో ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. అనుదీప్ పంచ్ లతో పాటు శివకార్తికేయన్ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. శివకార్తికేయన్ అనుదీప్ ను ఇమిటేట్ చేయడం ఫన్నీ గా అనిపించింది. పూర్తి షో చూడాలంటే ఈ వారం క్యాష్ ప్రోగ్రాం చూడాల్సిందే. ఇక కామెడీ డ్రామా గా తెరకెక్కిన ‘ప్రిన్స్’ సినిమా ఈ నెల 21 న విడుదల కానుంది. అనుదీప్, శివకార్తికేయన్ ల కామెడీ టైమింగ్ సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి మరి.

Also Read: ‘ప్రిన్స్’పై భారీ అంచనాలు, అనుదీప్‌కు అగ్నిపరీక్షే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Embed widget