News
News
X

Aadi movie release: తారక్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్న ‘ఆది‘

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సినిమా ‘ఆది’. ఈ బ్లాక్ బస్టర్ మూవీ థియేటర్లలో మరోసారి సందడి చేయబోతున్నది.

FOLLOW US: 
 
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ఆయా హీరోల బర్త్ డేలు, స్పెషల్ అకేషన్స్ సందర్భంగా వారు నటించి బ్లాక్ బస్టర్ సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. మరోసారి ఫ్యాన్స్ ను ఉర్రూతలు ఊగిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన జల్సా, తాజాగా నందమూరి బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమాలు రీరిలీజ్ చేశారు. ఈ సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో సినిమా థియేటర్లకు వచ్చారు.  కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమాలకు రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ తాకిడికి సినిమా థియేటర్లు సందడిగా మారిపోయాయి.  వసూళ్ల పరంగానూ పోకిరి, జల్సా సినిమాలు దుమ్మురేపాయి.

ఈనేపథ్యంలో మరో టాలీవుడ్ టాప్ హీరో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ రీరిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటి వరకు రిరిలీజ్ అయిన సినిమాల లిస్టులోకి జూనియర్‌ ఎన్టీఆర్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం కూడా చేరబోతుంది. ఆయన  కెరీర్‌ల్లో అద్భుత విజయం సాధించమే కాకుండా.. తనకు అదిరిపోయే స్టార్ డమ్ తీసుకొచ్చిన సినిమా ‘ఆది’. ఫ్యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించారు.  ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డులు బద్దలు కొట్టింది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీని సృష్టించింది. అప్పట్లోనే రూ. 18 కోట్ల షేర్ సాధించి అదుర్స్ అనిపించింది.  మాస్ హీరోగా తనకు తిరుగులేని గుర్తింపును తీసుకొచ్చిపెట్టింది. ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా రీరిలీజ్ కు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 22 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే నవంబర్ లో ఈ మూవీని మళ్లీ థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ‘ఆది’ సినిమా యూనిట్ వర్గాల సమాచారం. బాలకృష్ణ ‘చెన్నకేశవరెడ్డి’ రీరిలీజ్ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ మూడో వారంలో ‘ఆది’ రీరిలీజ్ ఉండబోతున్నట్లు వెల్లడించారు. ఈ విషయం తెలియడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాలో జూ. ఎన్టీఆర్ సరసన కీర్తి చావ్లా హీరోయిన్ గా నటించింది.

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాంచరణ్ తో కలిసి తారక్ నటించారు. పాన్ ఇండియన్ మూవీగా విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయాన్ని అందుకుంది. వసూళ్ల పరంగానూ అదరగొట్టింది. రూ. 610 కోట్ల కు పైగా షేర్, రూ. 1200 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ హిట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా జీ5తో పాటు నెట్‌ ఫ్లిక్స్‌ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు సినిమా పరిశ్రమలోకి నందమూరి ఫ్యామిలీ నుంచి అడుగు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తన అద్భుత నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ.. ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోగా ఎదిగారు.  

News Reels

Also read: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

Also read: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి

Published at : 26 Sep 2022 02:35 PM (IST) Tags: Hero Jr NTR aadi movie release Aadi Movie Re Release

సంబంధిత కథనాలు

Bhavadeeyudu Bhagat Singh: పవన్ ఫ్యాన్స్‌లో కొత్త ఆశలు - భవదీయుడుపై లేటెస్ట్ న్యూస్!

Bhavadeeyudu Bhagat Singh: పవన్ ఫ్యాన్స్‌లో కొత్త ఆశలు - భవదీయుడుపై లేటెస్ట్ న్యూస్!

Inaya in Bigg Boss: క్యారెక్టర్లు మార్చుకున్న హౌస్‌మేట్స్ - మళ్లీ రొమాన్స్ మొదలెట్టిన శ్రీహాన్, ఇనయా

Inaya in Bigg Boss: క్యారెక్టర్లు మార్చుకున్న హౌస్‌మేట్స్ - మళ్లీ రొమాన్స్ మొదలెట్టిన శ్రీహాన్, ఇనయా

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

FALL Series Review: ఫాల్ సిరీస్ రివ్యూ: అంజలి కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉంది?

FALL Series Review: ఫాల్ సిరీస్ రివ్యూ: అంజలి కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉంది?

Pawan Kalyan Harish Shankar : పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో ప్రభాస్ దర్శకుడు

Pawan Kalyan Harish Shankar : పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో ప్రభాస్ దర్శకుడు

టాప్ స్టోరీస్

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp :  కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు