Bigg Boss 6 Telugu: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!
బిగ్ బాస్ సీజన్ 6 ఆదివారం ఎపిసోడ్ లో నేహా చౌదరి ఎలిమినేట్ అయింది.
వీకెండ్ వచ్చేసింది. హోస్ట్ నాగార్జున స్టైలిష్ గా రెడీ అయి బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చేశారు. సన్ డే కాబట్టి హౌస్ మేట్స్ తో కొన్ని గేమ్స్ ఆడించారు నాగార్జున. 'సుత్తి దెబ్బ' పేరుతో ఓ గేమ్ నడిచింది. ఇందులో భాగంగా హౌస్‌లో నోటి దురద ఎవరికి అని ఆదిరెడ్డిని అడిగితే.. అతను గీతూను సుత్తితో కొట్టాడు. ఆడియన్స్ లో కూడా ఎక్కువ మంది ఎస్ చెప్పారు. అయితే, ఒకరిద్దరు మాత్రం నో చెప్పారు. దీంతో వారిని ఎందుకు నో చెప్పారని నాగ్ అడిగితే.. గీతూ ఏది మాట్లాడినా కరెక్టుగా మాట్లాడుతుందని తెలిపాడు. ఆ తరువాత రోహిత్-మెరీనాలను ఈ హౌస్ లో బ్రెయిన్ లెస్ పర్సన్ ఎవరని అడిగారు. దానికి వారు రాజ్ తలపై సుత్తితో కొట్టారు. కానీ ఆడియన్స్ మాత్రం దానికి ఒప్పుకోలేదు.
ఈ హౌస్ లో పని దొంగ ఎవరని రాజ్ ని అడగ్గా.. అతడు రేవంత్ తలపై కొట్టాడు. దానికి కూడా ఆడియన్స్ ఒప్పుకోలేదు. ఈ హౌస్ లో ఓవర్ డ్రమాటిక్ ఎవరని రేవంత్ ని అడగ్గా.. అతడు నేహా పేరు చెప్పారు. దానికి ఆడియన్స్ ఎక్కువ మంది నో చెప్పారు. హౌస్ లో మోస్ట్ అన్నాయింగ్ ఎవరని నేహాని అడగ్గా.. గీతూ పేరు చెప్పింది. ఈ సమాధానికి ఆడియన్స్ ఎక్కువ మంది నో చెప్పారు. ఈ హౌస్ లో లూజర్ ఎవరని గీతూని అడగ్గా.. ఆమె రేవంత్ తలపై సుత్తితో కొట్టింది. కానీ ఆడియన్స్ నుంచి నో రెస్పాన్స్ వచ్చింది.
హౌస్ లో అటెన్షన్ సీకర్ ఎవరని శ్రీసత్యని అడగ్గా.. దానికి ఆమె బాలాదిత్య తలపై సుత్తితో కొట్టింది. దీనికి కూడా ఆడియన్స్ ఒప్పుకోలేదు. గుడ్డి ఎద్దు ఎవరని బాలాదిత్యను అడగ్గా.. దానికి అతడు కీర్తి తలపై సుత్తితో కొట్టాడు. ఇంట్లో ఫైటర్ కాక్ ఎవరని కీర్తిని అడగ్గా.. ఆమె రేవంత్ తలపై కొట్టింది. కానీ ఆడియన్స్ 'నో' చెప్పారు.
శ్రీహాన్, గీతూ సేఫ్..
నామినేషన్స్ లో ఉన్నవారి చేతికి ఎన్విలాప్స్ ఇచ్చి అందులో ఎక్కువ డబ్బు ఎవరిదగ్గర ఉంటుందో వారిద్దరూ సేఫ్ అని చెప్పారు నాగార్జున. ఈ టాస్క్ లో గీతూ, శ్రీహాన్ ల దగ్గర ఎక్కువ డబ్బు ఉండడంతో వారిద్దరూ సేఫ్ అయ్యారు.
హౌస్ లో యారోగంట్ ఎవరని వసంతిని అడగ్గా.. ఆమె ఇనయా తలపై సుత్తితో కొట్టింది. దానికి ఆడియన్స్ ఎస్ చెప్పారు. ఈ హౌస్ లో డామినేటింగ్ పర్సన్ ఎవరని ఇనయాని అడగ్గా.. ఆమె ఆరోహి తలపై సుత్తితో కొట్టింది. దానికి ఆడియన్స్ నుంచి నో ఆన్సర్ వచ్చింది. ఈ హౌస్ లో హార్ట్ లెస్ పర్సన్ ఎవరని ఆరోహిని అడగ్గా.. ఆమె శ్రీసత్య తలపై సుత్తితో కొట్టింది. దానికి ఆడియన్స్ ఒప్పుకోలేదు. ఈ హౌస్ లో యూజ్ లెస్ పర్సన్ ఎవరని శ్రీహాన్ ని అడగ్గా.. అతడు ఇనయా తలపై కొట్టింది. దానికి ఆడియన్స్ ఎస్ అని చెప్పారు. సుదీపను హౌస్ లో తిండిబోతు ఎవరని అడిగితే ఆమె రేవంత్ తలపై సుత్తితో కొట్టింది. కానీ ఆడియన్స్ ఒప్పుకోలేదు.
ఈ హౌస్ లో బిట్టర్ పర్సన్ ఎవరని చలాకీ చంటిని అడగ్గా.. అతడు ఇనయా తలపై కొట్టారు. దానికి ఆడియన్స్ ఎస్ అని చెప్పారు. హౌస్ లో బోరింగ్ సుత్తి ఎవరని సూర్యని అడగ్గా.. గీతూ తలపై కొట్టాడు. దానికి ఆడియన్స్ నో చెప్పారు. ఈ హౌస్ లో ఫేక్ ఎవరని ఫైమాని అడగ్గా.. దానికి ఆమె ఆరోహి తలపై సుత్తితో కొట్టింది. దానికి ఆడియన్స్ నో చెప్పారు. ఈ హౌస్ లో ఎయిమ్ లెస్ ఎవరని అర్జున్ ని అడగ్గా.. మెరీనా-రోహిత్ ల తలపై కొట్టాడు. దానికి ఆడియన్స్ కూడా ఒప్పుకున్నారు.
రేవంత్, ఇనయా సేఫ్..
నామినేషన్స్ లో ఉన్న వారికి ఒక టాస్క్ ఇచ్చి రేవంత్, ఇనయా సేఫ్ అని ప్రకటించారు. ఇంకా బాలాదిత్య, వసంతి, చలాకీ చంటి, నేహా, ఆరోహి నామినేషన్ లో మిగిలి ఉన్నారు.
ఇంటి సభ్యులకు కొన్ని జంతువుల పేర్లు రాసి ఉన్న ట్యాగ్‌లను ఇచ్చి, ఆ పేర్లు ఎవరికి సరిపోతాయో వారి మెడలో వేసి, సరైన కారణం చెప్పమని అడిగారు నాగార్జున. ఇందులో గీతూ 'ఊసరవెల్లి' అనే ట్యాగ్‌ను నేహా మెడలో వేసింది. నేహా పరిస్థితులకు తగ్గట్టు మారిపోతుందని చెప్పింది. నేహా కూడా 'ఊపరవెల్లి' ట్యాగ్‌ను గీతూ మెడలో వేసింది. 'నాకు తెలుసు, నాకే తెలుసు అనేస్తాది, తరువాత రియలైజ్ అయి మాట మార్చుకుంటుంది' అని చెప్పింది నేహా.
రేవంత్ 'గాడిద', ఆరోహి 'పాము':
చంటి 'గాడిద' అనే ట్యాగ్‌ను రేవంత్ మెడలో వేశాడు. 'గాడిదలాగా ఎంతో కష్టపడి పనిచేస్తాడు. దానిలో ఒక పద్ధతి ఉండదు' అన్నాడు. రేవంత్ 'పాము' అనే ట్యాగ్‌ను ఆరోహి మెడలో వేశాడు. 'ఎప్పుడు బావుంటుందో, ఎప్పుడు రియాక్ట్ అవుతుందో తెలియదు' అన్నాడు. దానికి ఆరోహి 'నా పక్కనుంచి వెళితే నేను ఏమీ అనను. అలాంటి పాముని. కానీ నామీదకొస్తున్నారు అనిపిస్తే మాత్రం బుస కొట్టడం కాదు, ఏకంగా కాటేస్తా' అంటూ డైలాగ్ వేసింది.
సూర్య 'సింహం' ట్యాగ్‌ను గీతూ మెడలో వేశాడు. దానికి నాగార్జున 'అడవిలో సింహం ఆకలేస్తేనే వేటాడుతుంది, కానీ ఈ సింహం ఎప్పుడూ వేటాడుతుంది' అన్నారు.ఫైమా 'సింహం' ట్యాగ్ ను చంటి మెడలో వేసింది. 'సింహం ఒకేసారి ఎటాక్ చేస్తుంది, అలాగే ఈ సింహం కూడా నామినేషన్లలో రెండు మూడు మాటలు మాట్లాడేసి పక్కకెళ్లిపోతుంది' అని చంటి గురించి చెప్పింది.
ఆదిరెడ్డి 'ఏనుగు', కీర్తి 'గాడిద':
బాలాదిత్య 'ఏనుగు' అనే ట్యాగ్‌ను ఆదిరెడ్డి మెడలో వేశాడు. 'ఏనుగు ఎంత కంగారులో ఉన్న అడుగు తప్పదు. అలాగే ఆదిరెడ్డి కూడా ఎంత కంగారులో ఉన్న ఆయన శ్రుతిమించడు, అదుపు తప్పుడు' అని చెప్పారు. ఆరోహి.. 'గాడిద' ట్యాగ్ ను కీర్తి మెడలో వేసింది. కీర్తి.. 'ఊసరవెల్లి' ట్యాగ్ ను ఇనయా మెడలో వేసింది. ఫస్ట్ వీక్ నుంచి చూసుకుంటే ఆమె చాలా ఫేసెస్ చూపించిందని రీజన్ చెప్పింది. సుదీప.. 'ఏనుగు' ట్యాగ్ ని మెరీనాకి ఇచ్చింది. శ్రీసత్య.. 'గాడిద' ట్యాగ్ ను కీర్తి మెడలో వేసింది. ఇక శ్రీహాన్.. ఇనయా మెడలో 'పాము' ట్యాగ్ వేశారు.
వసంతి.. 'సింహం' ట్యాగ్ ను రేవంత్ మెడలో వేసింది. ఇనయా.. 'ఊసరవెల్లి' ట్యాగ్ ను శ్రీహాన్ మెడలో వేసింది. మెరీనా-రోహిత్.. 'ఏనుగు' ట్యాగ్ ను బాలాదిత్య మెడలో వేశారు. ఆదిరెడ్డి.. 'పాము' ట్యాగ్ ను శ్రీసత్య మెడలో వేశారు. మొదటి రెండు వారాల్లో సైలెంట్ గా ఉన్న ఆమె.. మూడో వారం నుంచి బుస కొట్టడం మొదలుపెట్టిందని అన్నారు. రాజ్.. 'గాడిద' ట్యాగ్ ను అర్జున్ మెడలో వేశారు. అర్జున్.. 'గాడిద' అనే ట్యాగ్ ను సుదీప మెడలో వేశారు.
బాలాదిత్య, ఆరోహి సేఫ్..
నామినేషన్స్ లో ఉన్న ఐదుగురిలో బాలాదిత్య, ఆరోహిలు సేఫ్ అయ్యారు.
ఆ తరువాత హౌస్ మేట్స్ ని రెండు గ్రూపులుగా విడగొట్టి వారితో డంబ్ షరాడ్స్ గేమ్ ఆడించారు.
ఆ తరువాత మొక్క టాస్క్ ఇచ్చి చలాకీ చంటి సేవ్ అయినట్లు ప్రకటించారు.
నేహా ఎలిమినేషన్:
ఫైనల్ గా నామినేషన్స్ లో మిగిలిన వాసంతి, నేహాలలో.. నేహా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. తన నామినేషన్ ప్రకటించగానే.. నేహా షాకైంది. వెళ్లిపోతూ.. తనకు ఎవరైతోనైతే బాండింగ్ అయిందో వాళ్లే ఈ పొజిషన్ లో పెట్టారనే బాధతో వెళ్తున్నట్లు చెప్పింది.
రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను:
స్టేజ్ పైకి వెళ్లిన నేహాకి దమ్మున్న ఐదుగురు కంటెస్టెంట్స్, దుమ్ము కంటెస్టెంట్స్ ఎవరని అడిగారు నాగార్జున. దుమ్ము లిస్ట్ లో ఇనయా, రేవంత్, ఆరోహి, అర్జున్ కళ్యాణ్, గీతూ, వసంతి పేర్లు చెప్పింది. రేవంత్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను అంటూ డైలాగ్ వేసింది. దమ్మున్న కంటెస్టెంట్స్ లిస్ట్ లో చంటి, సుదీప, శ్రీహాన్, బాలాదిత్య, ఆదిరెడ్డి, శ్రీసత్య, రాజ్ ల పేర్లు చెప్పింది. రాజ్ తో మంచి కనెక్షన్ ఏర్పడిందని.. తను ఫ్రెండ్ అయిపోయాడని ఎమోషనల్ అయింది.
Also Read : 'ఆదిపురుష్' ట్రెండ్ సెట్టర్ - నేను ప్రభాస్ వీరాభిమాని : సోనాల్ చౌహన్ ఇంటర్వ్యూ
Also Read : ప్లూటు బాబు ముందు ఊదు, జగనన్న ముందు కాదు - బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్