Guppedantha Manasu September 27th Update:మాట వెనక్కు తీసుకునేది లేదన్న వసు, జగతిని ఆపిన రిషి - అవకాశంగా వాడుకున్న దేవయాని!
Guppedantha Manasu September 27th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు( మంగళవారం) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్ ( Guppedantha Manasu September 27 Today Episode 566)
రిషిని కలసిన జగతి.. వసుధార నీకు చాలా ముఖ్యమైన బంధం కదా తనని పోగొట్టుకోవద్దని చెబుతుంది
రిషి: బంధం అంటే ఇద్దరికీ అనిపించాలి అటువైపు ఉన్నవాళ్లకి కూడా సమాన బాధ్యత ఉంటుంది కదా..తనకోసం నేను వెనకడుగు వేయలేను తనే ముందడుగు వేయాలి. నిర్ణయం తనదే
జగతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది..
నీకోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను వసుధార అనుకుంటారు రిషి... మరోవైపు జగతి వసుధార రూమ్ కి వెళుతుంది.
జగతి: ఏం జరిగింది
వసు: ఏం జరగడం ఏంటి
జగతి: రిషికి నీకు మధ్యా గొడవ ఏమైనా జరిగిందా
వసు: మేడం..అలాంటిదేం లేదు
జగతి: నా దగ్గర కూడా దాస్తున్నావా.. రిషి నాతో మాట్లాడాడు..అంతిమ నిర్ణయం నీదే అంటున్నాడు. నాకేం అర్థం కావడం లేదు. అసలు ఏమైందో చెప్పు..
వసు: గురుదక్షిణ విషయాన్ని రిషి సార్ మర్చిపోమంటున్నారు..
జగతి: తెలివైనదానివే కదా..ఈ గురుదక్షిణ విషయాన్ని అప్పుడే మర్చిపోవాలి కదా రిషి అడిగేవరకూ, గడువిచ్చేవరకూ ఎందుకు తెచ్చుకున్నావ్..నా కారణంగా రిషినువ్వు విడిపోవద్దు..నువ్వు రిషి చెప్పినట్టు విను
వసు: వినను మేడం
జగతి: రిషి నన్ను అమ్మా అని పిలవకపోయినా పర్వాలేదు..మాట్లాడవేంటి..నా కోసం నీ లైఫ్ పాడుచేసుకోవద్దు
వసు: నేనసలు వెనక్కు తగ్గను
జగతి: రిషిని పోగొట్టుకుంటావా
వసు: తనే నా లోకం..తనని ఎలా పోగొట్టుకుంటాను. ఇది మొండికేయడం కాదు..నేనొకదాన్ని నమ్మాను ఆ అభిప్రాయం మీద స్ట్రాంగ్ గా నిల్చున్నాను..
జగతి: ఇదంతా మొదలుపెట్టిన మహేంద్రని అనాలి
వసు: ఎవర్నీ అనాల్సిన అవసరం లేదు..మిమ్మల్ని అమ్మా అనాలి
జగతి: నాకు అవసరం లేదు
వసు: నాకు అవసరం మేడం, రిషి సార్ లో మార్పు అవసరం, రిషి సార్ లో ఎలాంటి మచ్చా లేకుండా చూడడం నాకు అవసరం, నా రిషి సార్ కన్నతల్లిని అమ్మా లేని కఠిన మనసున్నవాడా మేడం..నా కిష్టం లేదు..తనుమారాలి నేను మార్చుకుంటాను
జగతి: జరగని వాటికోసం ఆశపడొద్దు..నాకోసం నీ జీవితాన్ని ఫణంగా పెడుతున్నావ్ వద్దు..చెప్తే అర్థం కావడం లేదా... వాడు నా కొడుకు వాడి సంగతి నాకు తెలియదా
వసు: మీ కొడుకు కాబట్టే ఆయన మనసు మారుతుందని నేను నమ్ముతున్నాను..మీరేం టెన్షన్ పడకండి..
బై వసు అనేసి సీరియస్ గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది జగతి...మీరు ఎంత కోపంగా వెళ్లినా నేను ఏదో ఒకరోజు రిషి సార్ మనసు మార్చి తీరుతాను మేడం..
Also Read: దీపని గుర్తుపట్టేసిన కార్తీక్, శౌర్యని తప్పుదారి పట్టించిన మోనిత
కోపంగా ఇంట్లోకి వచ్చిన జగతిని గమనిస్తాడు రిషి..మేడం ఎక్కడికి వెళ్లారు, అదోలా కనిపిస్తున్నారేంటి అనుకుంటాడు.. మహేంద్ర కూడా జగతిని చూసి ఎక్కడికి వెళ్లావ్ అని అడుగుతాడు.. జగతి మాత్రం సమాధానం చెప్పకుండా బట్టలు సర్దుకుంటుంది. ఎక్కడికి వెళుతున్నావ్ అని మహేంద్ర అడిగితే..వెళ్లిపోతున్నాను ఈ ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్లిపోతున్నాను
మహేంద్ర: ఎవరైనా ఏమైనా అన్నారా.. వదినగారు ఏమైనా అన్నారా..రిషి ఏమైనా అన్నాడా...
జగతి: ఎవ్వరూ ఏమీ అనలేదు..ఇప్పుడు రిషి-వసుధారలు నా మూలంగా విడిపోయేలా ఉన్నారు. ఆ వసుధార నువ్వు కలసి గురుదక్షిణ అనే తలపోటు తెచ్చిపెట్టారు.. వసు మొండికేస్తోంది, మాటవినడం లేదు.. రిషి కూడా ఈ గురుదక్షిణ ఒప్పందం వదిలేయమని చెప్పినా వినడం లేదు. నా కారణంగా వాళ్లిద్దరి మధ్యా గొడవలు అవుతున్నాయి..ఈ ఒక్క కారణంగా వాళ్లు విడిపోతారు..
మహేంద్ర: నువ్వు వెళ్లిపోతే సమస్య పరిష్కారం అయిపోతుందా
జగతి: తీవ్రత తగ్గుతుంది
మహేంద్ర: నా పరిస్థితేంటి..
జగతి: మధ్యలో వచ్చాను మధ్యలో వెళుతున్నాను
అప్పుడు మహేంద్ర కూడా నేను వస్తున్నానంటూ బట్టలు సర్దుకుంటాడు... రిషి ఒంటరైపోతాడు నువ్వొద్దని చెబుతుంది. నా మూలంగా దేవయాని అక్కయ్య రిషిని ఇబ్బంది పెడుతోంది..నేను ఇక్కడ ఉండకూడదు..నువ్వు రిషిని జాగ్రత్తగా చూసుకో .. వసుకి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు రిషితో బాగా ఉండు..రిషిని అపురూపంగా చూసుకో..తనకి ఇబ్బంది కలిగే పనులు చేయొద్దు..
మహేంద్ర: నువ్వు మరోసారి అలోచించు..
జగతి: వెళ్లకపోతే వసు-రిషి బంధం బీటలు వారుతుంది...నా ఉనికి వాళ్లిద్దరి మధ్యా అగాథంలా మారుతుంది.. రిషి జాగ్రత్త మహేంద్ర...నేను వెళుతున్నాను...
మహేంద్ర ఎంత బతిమలాడినా రిషి జాగ్రత్త అనేసి బయటకు వెళ్లిపోతుంది...
ద్వారం దగ్గర నిల్చుని ఉంటాడు రిషి....
Also Read: వసు కోసం మల్లెపూలు కొన్న రిషి - నాకోసం వచ్చేస్తావా వసుధార అని అడిగేసిన మిస్టర్ ఇగో
రిషి: ఏంటి మేడం..ఈ ఇల్లు వదిలిపెట్టిన వెళుతున్నారా..గుడ్ మేడం..గుడ్ డెసిషన్.. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మీరు తెలివైన వారని తెలుసు కానీ ఇంత తెలివిగా ఆలోచిస్తారని ఎప్పుడూ అనుకోలేదు. ఈ ఇల్లు డాడ్ ని వదిలివెళుతున్నారా..అప్పుడు నా చిన్నప్పుడు ఎందుకు వెళ్లారో ఎప్పుడూ అడగలేదు అడగను కూడా.. కానీ..ఇప్పుడు వెళుతోంది మాత్రం నా కారణంగా అంటున్నారు..మీకు మీరే ఓ నిర్ణయం తీసుకుని..మీకు మీరే ఏదో జరుగుతోందని ఊహించుకుంటూ దానికి నన్ను కారణంగా చూపిస్తూ ఇల్లు వదలివెళుతున్నారు..ఇదేంటి మేడం.. మీరు వస్తానని అలేదు.. నేను రమ్మన్నాను..మా డాడ్ సంతోషాన్ని కళ్లారా చూశాను.. ఇప్పుడు నా ఆనందాన్ని మీరు భరించలేకపోతున్నారా...
జగతి: రిషి ప్లీజ్ అలా మాట్లాడకు
రిషి: మీరిలా వెళుతుంటే నేను ఇలాగే మాట్లాడతాను మేడం..డాడ్ ఆనందం, డాడ్ సంతోషం మీకు అవసరం లేదా.. తనని వదిలేసి వెళ్లిపోతారా..ఏంటి మేడం మీరు..ఏం ఆలోచిస్తున్నారు..మీరు వెళ్లిపోతే వసుధార నా లైఫ్ లోకి వస్తుందని మీరెలా అనుకుంటున్నారు..ఆ వసుధారకి పట్టుదల ఆత్మవిశ్వాసం మాత్రమే కాదు పొగరు కూడా ఎక్కువే..మీకు మా డాడ్ అవసరం లేదు వసుధారకి నేను అవసరం లేదు..మీ పంతాలు, పట్టింపులే మీకు కావాలి.. వెళ్లండి మేడం వెళ్లండి. బంధాలు,అనుబంధాలు, బాధ్యతలు, ప్రేమలు ఇవన్నీ బాగా వివరిస్తారు కదా మీరిద్దరూ మరి మీరిలా వెళ్లడం ఏంటి.. మీరు ఇంట్లోంచి వెళ్లాలి అనుకుంటే డాడ్ తో కలసి వెళ్లండి...మీ ఇద్దర్నీ విడదీసిన పాపం నాకెందుకు మేడం...తల్లి లేకుండా బతికినవాడిని తండ్రిని దూరం చేసుకుని బతకడం కూడా అలవాటు చేసుకుంటాను..మీరు వెళ్లండి...
రిషి మాట్లాడి వెనక్కు తిరిగేసరికి దేవయాని అక్కడుంటుంది..ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని నేనెలా వదులుకుంటాను అనుకుంటూ ఆగునాన్న...
దేవయాని: ఏంటి మహేంద్రా ఇది..ఏం జరుగుతోంది ఇంట్లో..రిషిని ఎందుకు బాధపెడుతున్నారు..ఏంటి జగతి చిన్నప్పటి నుంచీ రిషిని బాధపెడుతూనే ఉన్నావ్..నువ్వెన్ని చేసినా ఎందుకు వెళ్లిపోయావని అడిగాడా..రిషిని సాధిస్తే నీకేం వస్తోంది..
జగతి: అక్కయ్యా నేను నాటకాలు ఆడటం ఏంటి...
ఎపిసోడ్ ముగిసింది...