News
News
X

Karthika Deepam September 27 Update: దీపని గుర్తుపట్టేసిన కార్తీక్, శౌర్యని తప్పుదారి పట్టించిన మోనిత

కార్తీకదీపం సెప్టెంబరు 27 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ నుంచి మోనితను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది వంటలక్క...

FOLLOW US: 

Karthika Deepam September 27th Episode 1468 (కార్తీకదీపం సెప్టెంబరు 27 ఎపిసోడ్)

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..మోనిత ఇంటి ముందు కారు ఆపుతుంది. కారు డిక్కీలో దాక్కున్న శౌర్య కిందకు దిగుతుంది. శౌర్యను చూసిన మోనిత షాక్ అవుతుంది. ఇది ఇక్కడకు వచ్చిందేంటి అనుకుంటుంది. నువ్వు ఈ కార్లో ఉన్నావేంటి అని మోనిత అంటే మీ కారు అని నాకు తెలియదు లేదంటే నేను ముందే కూర్చునేదాన్ని అంటుంది. 
మోనిత: నువ్వెందుకు ఇక్కడున్నావ్
శౌర్య: అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారని నాకు అనిపిస్తోంది. మా అమ్మా నాన్న చనిపోలేదు అందుకే వాళ్లకోసం ఇక్కడే ఉన్నాను
మోనిత: వాళ్ల డెడ్ బాడీస్ ని కళ్లారా చూశాను, నేనే దగ్గరుండి పోస్ట్ మార్టం చేయించాను దహన సంస్కారాలు చేయించానంటుంది.
శౌర్య: మీరు అబద్ధం చెబుతున్నారంటూ మోనితని పట్టుకుని ఏడుస్తుంది
మోనిత: నీకు బాధ కలిగించినా నేను చెప్పేది నిజం అన్న మోనిత.. మనసులో అబద్ధం కాకపోతే నిజం అని ఎలా చెబుతాను మీ అమ్మ ఉండి సాధిస్తున్నది సరిపోదా నిజం ఎలా చెబుతాను..కార్తీక్, దీప చూడకముందే దీన్ని పంపించేయాలి.. కార్తీక్ దీన్ని చూసినా ప్రమాదం లేదు ఇది కార్తీక్ ని చూడకుండా చూసుకోవాలి అనుకుంటుంది. నువ్వు వాళ్ల గురించి వెతుకుతూ టైమ్ వేస్ట్ చేసుకోవద్దు..బస్సెక్కిస్తాను హైదరాబాద్ వెళ్లిపో
శౌర్య: లేదాంటీ నాకు ఈ ఊర్లో తెలిసిన వాళ్లు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి అక్కడ నుంచి వెళ్తాను అని శౌర్య అనడంతో అక్కడకు తీసుకెళ్లి దింపుతుంది మోనిత

Also Read: వంటలక్క ప్లాన్ సక్సెస్- దీపని వెళ్లొద్దని అరిచిన కార్తీక్, మోనిత కారు డిక్కిలో శౌర్య

ఈ నాటకం ఎప్పుడు మొదలవుతుందో నేను వెళ్లిపోతాను అంటాడు..కానీ దీప వాళ్ళ అన్నయ్య బలవంతం చేయడంతో కూర్చుంటాడు. వెనకాల ఆడవాళ్లు మాట్లాడుకుంటూ బ్యానర్ చూసి, కార్తీకదీపం అంటే కార్తీక్, దీపల ప్రేమ కదా అయ్యుంటుందా! 
కింద ఇది ఒక భార్య జీవితంలో జరిగిన అసలైన కదా అని రాసింది అనడంతో కార్తీక్ కోపంతో దీప దగ్గరికి వెళ్లి ,కార్తీకదీపం అంటే ఏంటి కార్తీక్, దీప నా!కింద భార్య కదా అన్నావు అంటే నువ్వు నా భార్యవని ఇప్పటివరకు నా వెనకాతలు తిరిగావు ఇప్పుడు ఊరందరికీ తెలిసేలా చేయాలా అని అంటాడు. అప్పుడు దీప వాళ్ళ అన్నయ్య, కార్తీక్ అంటే మీరు కాదు బాబు దీప వాళ్ళ భర్త పేరు కూడా కార్తీక్ ఇది మీ గురించి ఎందుకు అనుకుంటున్నారు దీప తన భర్త విషయంలో జరిగిన కథ ఇది దయచేసి కూర్చోండి అని కూర్చోబెడతాడు.

News Reels

ఆ తర్వాత సీన్లో సౌందర్య ఆనందరావు, హిమ తిరిగి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు సౌందర్య, హిమతో,దారిలో రెస్టారెంట్ ఉంది ఆపమంటావా అంటుంది. ఈ మధ్య ఇది, ఆ రౌడీ కలిసి ప్రసాదాలు తింటూ బతుకుతున్నారటండి అని అంటుంది .అప్పుడు ఆనందరావు హిమతో దీన్ని బట్టి నీకు ఏమి అర్థమైందమ్మా అని అడుగుతాడు
హిమ: శౌర్య ఇక మనతో తిరిగి రాదు మన ఆశలన్నీ నిరాశలే అంటుంది
సౌందర్య: ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు వెళ్లి నీ చదువు మీద దృష్టి పెట్టు నేను శౌర్యని ఎలాగైనా ఇంటికి తెప్పించే ప్రయత్నాలు చేస్తాను. నేను నీకు హామీ ఇస్తున్నాను ఎప్పటికైనా శౌర్య ఇంటికి తిరిగి వస్తుంది

Also Read: వసు కోసం మల్లెపూలు కొన్న రిషి - నాకోసం వచ్చేస్తావా వసుధార అని అడిగేసిన మిస్టర్ ఇగో
ఆ తర్వాత సీన్లో కార్తీక దీపం నాటకం మొదలవుతుంది. అప్పుడు దీప శివునికి పూజ చేస్తూ కార్తీకదీపం పాట పాడుతుంది. అప్పటికే కార్తీక్ ఇబ్బందిగా వెళ్ళిపోతాను అంటాడు. అప్పుడు దీప వాళ్ళ అన్నయ్య మనసులో, త్వరగా నాటకం అయితే బాగుండు లేకపోతే సగంలోనే కార్తీక్ వెళ్లిపోతాడేమో అని భయం వేస్తోంది అనుకుంటాడు. ఇంతలో నాటకం మొదలవుతుంది. నాటకం మొదలవుగానే దీప వాళ్ళ అమ్మ దీపని, నీకు నీ జాతకానికి ఇంక నీకు ఎప్పటికీ పెళ్లి అవ్వదు.నీ నల్ల మొఖాన్ని ఎవడు చేసుకుంటాడే అని తిడుతుంది.అప్పుడు దీప వాళ్ళ నాన్నకి కార్తీక్ ఫోన్ చేసి, నాకు మీ కూతురు అంటే ఇష్టం నేను మీ అమ్మాయిని పెళ్లి చేయాలనుకుంటున్నాను కానీ నాకు పిల్లలు పుట్టరు ఈ విషయం మీ అమ్మాయికి చెప్పండి నచ్చితేనే పెళ్లి అని అనడంతో దీపకు నచ్చి పెళ్లి చేసుకుంటుంది. 

ఆ తర్నాత సౌందర్య నుంచి ఎదురైన ఇబ్బందులు, హనీమూన్, విహారి పరిచయం, దీప కడుపుతో ఉంటే కార్తీక్ అనుమానించడం అవన్నీ నాటకంలో ప్రస్తావిస్తుంది. ఈ బిడ్డకి తండ్రిని నేను కాదని కార్తీక్ అరవడంతో.. ఇంత నీచమైన స్థితికి దిగజారుతారని నేను అనుకోలేదు..నాకు ఇంట్లో విలువ లేనప్పుడు నేను ఒక్క క్షణం కూడా ఉండను అని అంటుంది. అప్పటికే కార్తిక్ కి ఏదో గుర్తొస్తున్నట్టు అనిపిస్తుంది, తలనొప్పిగా ఉంటుంది. ఎపిసోడ్ ముగిసింది

రేపటి (బుధవారం) ఎపిసోడ్ లో
దీపా ఆగు అని అరుస్తూ కిందపడిపోతాడు కార్తీక్... కార్తీక్ ని హాస్పిటల్ కి తీసుకెళతారు దీప-డాక్టర్ అన్నయ్య. అక్కడకు మోనిత వస్తుంది. కళ్లు తెరిచిన కార్తీక్ దీపా అని పిలుస్తాడు... 

Published at : 27 Sep 2022 08:26 AM (IST) Tags: Karthika Deepam Serial karthika Deepam Serial Today Episode Karthika Deepam Serial Written Update Karthika Deepam Serial September 27 Karthika Deepam 1468 Episode

సంబంధిత కథనాలు

Guppedantha Manasu December 1st Update: తండ్రి రాకతో రిషిలో ఉత్సాహం, అర్థరాత్రి వసుతో షికార్లు

Guppedantha Manasu December 1st Update: తండ్రి రాకతో రిషిలో ఉత్సాహం, అర్థరాత్రి వసుతో షికార్లు

Prabhas Kriti Sanon : ప్రభాస్, కృతి డేటింగ్ గోల - తప్పంతా ఛానల్‌దేనా?

Prabhas Kriti Sanon : ప్రభాస్, కృతి డేటింగ్ గోల - తప్పంతా ఛానల్‌దేనా?

Karthika Deepam December 1Update:కార్తీక్ గురించి దీపకి నిజం చెప్పేసిన డాక్టర్, మోనితను బంధించిన సౌందర్య

Karthika Deepam December 1Update:కార్తీక్ గురించి దీపకి నిజం చెప్పేసిన డాక్టర్, మోనితను బంధించిన సౌందర్య

Sankranti 2023 Telugu Movies : చిరంజీవి, బాలకృష్ణ సినిమాలను వెంటాడుతున్న మహేష్, బన్నీ బాకీలు?

Sankranti 2023 Telugu Movies : చిరంజీవి, బాలకృష్ణ సినిమాలను వెంటాడుతున్న మహేష్, బన్నీ బాకీలు?

Gruhalakshmi December 1st: తులసి, లాస్య మాటల యుద్దం- ఒక్కరోజు గృహిణిగా మారిన సామ్రాట్

Gruhalakshmi December 1st: తులసి, లాస్య మాటల యుద్దం- ఒక్కరోజు గృహిణిగా మారిన సామ్రాట్

టాప్ స్టోరీస్

Breaking News Live Telugu Updates: గుజరాత్‌లో మొదటివిడత పోలింగ్ షురూ, బీజేపీదే విజయం - మాజీ సీఎం ధీమా

Breaking News Live Telugu Updates: గుజరాత్‌లో మొదటివిడత పోలింగ్ షురూ, బీజేపీదే విజయం - మాజీ సీఎం ధీమా

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఈడీ విచారణ పూర్తి, ఏకంగా 9 గంటలు - ఏ ప్రశ్నలు వేశారంటే

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఈడీ విచారణ పూర్తి, ఏకంగా 9 గంటలు - ఏ ప్రశ్నలు వేశారంటే