Guppedanta Manasu September 26th Update: వసు కోసం మల్లెపూలు కొన్న రిషి - నాకోసం వచ్చేస్తావా వసుధార అని అడిగేసిన మిస్టర్ ఇగో
గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
రిషి, వసు ఒక చోట మాట్లాడుకోవడానికి కలుస్తారు. ఏంటి సార్ ఇక్కడికి రమ్మన్నారు అని అడుగుతాడు. రిషి సార్ ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారు అని వసు మనసులో అనుకోగానే అదే మాట రిషి బయటకి అడుగుతాడు.
రిషి: ఈ ప్రపంచంలో అందరూ నన్ను బాధపెట్టినా ఓర్చుకున్నా కానీ చివరికి నువ్వు కూడా నా దగ్గర అలాగే ప్రవర్తించావ్
వసు: నేనేం చేశాను సార్ అనగానే రిషి తన ఫోన్లో సాక్షి ఎగ్జామ్ కి వెళ్తున్న తనకి మత్తు మందు ఇచ్చి కిడ్నాప్ చేయించిన వీడియో చూపిస్తాడు.
రిషి: ఏంటి ఇది వసుధార.. సాక్షి విషయం నా దగ్గర ఎందుకు దాచావ్. ఇంత జరిగినా కూడా నాదగ్గర దాస్తావా
వసు: నేను దాయడానికి కారణం ఉంది సార్
రిషి: నేను దాయడానికి కారణాలు అడగలేదు, ఒక నిజం చెప్పకపోవడం పొరపాటు.. దాచిపెట్టడం మోసం అవుతుంది కదా. సాక్షి విషయాన్ని నాకు ఎందుకు చెప్పలేదు
వసు: సాక్షి విషయాన్ని కావాలనే చెప్పలేదు. అందరి మంచి కోసమే దాచాను నిజం మీరు సాక్షిని కోపంతో ఏమంటారో అనే భయంతో చెప్పలేదు
Also Read: సత్య షాకింగ్ నిర్ణయం- హాస్పిటల్ కి వచ్చిన దేవుడమ్మ, రాధని దాచిపెట్టిన చిన్మయి
రిషి: నీ భయం మాత్రమే ఆలోచిస్తావా.. నీకు ఏమవుతుందో ఏమైందో అని నేను భయపడతాను కదా.. అసలు సాక్షి అంత సాహసం ఎందుకు చేసింది అసలు తన ఉద్దేశం ఏంటి అనేది నీకేం తెలుసు నాకేం తెలుసు. దాపరికాలు లేని ప్రేమ మన మధ్య ఉండాలని అనుకున్నాం కదా. అలాంటిది నువ్వు కూడా నా దగ్గర అన్నీ దాచేస్తే మన ప్రేమ అబద్ధమా నువ్వు, నేను అబద్ధమా
వసు: మీ మనసుకు కష్టం కలిగించేది అని చెప్పలేదు సర్
రిషి: సాక్షి విషయం నా దగ్గర దాచావ్ నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి.. నా ప్రేమయం లేకుండా డాడ్ నువ్వు మేడమ్ ని అమ్మ అని పిలవాలని డిసైడ్ చేసుకున్నారు. ఒప్పందాలు జరుగుతాయి కానీ నాకు చెప్పరు, నేను చాలా మందికి అవసరం లేదని అనిపిస్తుందేమో. నా విలువ నెనే చెప్పుకోవాల్సి రావడం చాలా దురదృష్టకరం. జగతి మేడమ్ ని అమ్మా అని పిలిపించాలని నాతో ప్రేమగా దగ్గర అయ్యావా?
వసు: నా ప్రేమ స్వచ్చమైనది
Also Read: వేద ప్లాన్ తెలుసుకున్న యష్- శర్మ దగ్గర సులోచనని ఇరికించిన మాలిని
ఈ రిషింద్ర భూషణ్ ఒకసారి ప్రేమిస్తే ఆకాశమంత చూపిస్తాడు. ఒకదాని మీద కోపం ఇంకోదాని మీద చూపించే స్వభావం నాది కాదు. ఎదురయ్యే ప్రతి సమస్యని పరిష్కరిస్తూ ముందుకు సాగడం నేర్చుకున్నా.. కానీ నువ్వే నాకు సమస్య కాకూడదు. సాక్షి విషయంలో నువ్వు జరిగిన దాన్ని దాచావ్ ముందు ముందు ఇంకేం చేస్తుందో ప్రతిసారీ దాస్తే ఎలా అని రిషి ఎమోషనల్ గా మాట్లాడతాడు. ఇప్పటి వరకు జరిగిన వాటిని మనసులో నుంచి తీసేయ్ నన్ను బాధించే విషయాలు చేయవద్దు నాదగ్గర ఏ విషయాలు దాచకు. జగతి మేడమ్ లెక్చరర్ చాలా మేధస్సు ఉన్నవాళ్ళు కాదని అనను.. కానీ పేగు బంధం లాంటివి మాత్రం ఉండవు కూడ. ఇంకోసారి చెప్తున్న మేడమ్ ప్రస్తావన మన మధ్య రాకూడదు అని చెప్తాడు.
రిషి వసు కోసం పూలు కొనిస్తాడు. అది చూసి వసు మురిసిపోతుంది. ఆ పూలు వసు రూమ్ కి తీసుకుని వచ్చి వాటితో హార్ట్ సింబల్ చేసి చూసుకుంటుంది. అందుకో వీఆర్ అని పేపర్ మీద రాసి ఆ పూల మధ్యలో పెడుతుంది. దాన్ని ఫోటో తీసి రిషికి పంపిస్తుంది. వసు రిషికి ఫోన్ చేసి నా మీద కోపం తగ్గిందా అని అడుగుతుంది. నా కోసం వచ్చేస్తావా అని రిషి వసుని అడుగుతాడు. నువ్వు ఈ ఇంటికి నా కోసం రావడానికి సిద్ధమా అని అంటాడు. వసు మాట్లాడకుండా ఉండటంతో రిషి కాల్ కట్ చేస్తాడు.