News
News
X

Karthika Deepam September 26th: వంటలక్క ప్లాన్ సక్సెస్- దీపని వెళ్లొద్దని అరిచిన కార్తీక్, మోనిత కారు డిక్కిలో శౌర్య

టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ నుంచి మోనితను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది వంటలక్క...

FOLLOW US: 

కాలనీ వాళ్ళు నాటకం వేసే దాని గురించి మాట్లాడుకుంటూ ఉండగా దీప వాళ్ళ మాటలు వింటుంది. అక్కడికి దీప వంట చెయ్యడానికి వస్తుంది. మేడమ్ నా దగ్గర ఒక కథ ఉంది నాటకం వేస్తారా చెప్తాను అని అడుగుతుంది. నువ్వు కొత్త కథ చెప్తే అది విని ఎప్పుడు విని ఎప్పుడు ప్రాక్టీస్ చెయ్యాలి అని అడుగుతుంది. నేను చెప్తాను ఒక్కసారి వినండి అని అడుగుతుంది. దీప కథ చెప్తుంది. అది విని అదిరిపోయింది అని అందరూ మెచ్చుకుంటారు. గుండెలి పిండేసే కథ చెప్పావ్.. అందులో మెయిన్ క్యారెక్టర్ నువ్వే వేస్తావా అని అడుగుతారు. అందుకు దీప సరే అంటుంది. మోనిత డాక్టర్ దగ్గరకి వస్తుంది. పేషెంట్ ఎక్కడ అని డాక్టర్ అడుగుతాడు.

నాకు తెలిసిన ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అవడం వల్ల గతం మర్చిపోయింది, వాళ్ళ భార్య గతం గుర్తు చెయ్యడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది అలా చేస్తే గతం గుర్తుకు వచ్చే ఛాన్స్ ఉందా అని డాక్టర్ ని అడుగుతుంది. అలాంటి అవకాశాలు ఉన్నాయి కానీ చాలా తక్కువ అని అంటాడు. వాళ్ళ పెళ్లి జరిగిన విషయాలు గుర్తు చేస్తే గతం గుర్తుకు వస్తుందా అని అంటుంది. ఏదైనా బలమైన సంఘటన కనిపిస్తే మాత్రం గతం గుర్తుకు వచ్చే అవకాశం ఉందని డాక్టర్ అంటాడు. ఆ మాట విని మోనిత టెన్షన్ పడుతుంది. దీప డాక్టర్ బాబు దగ్గరకి వస్తుంది. మీరు నాతో బయటకి రావాలి అని అడుగుతుంది. కాలనీ వార్షికోత్సవం ఉంది అందులో నేను ఒక నాటకం వేస్తున్నా మీరు అది చూడాలి అని దీప అడుగుతుంది.

Also Read: సత్య షాకింగ్ నిర్ణయం- హాస్పిటల్ కి వచ్చిన దేవుడమ్మ, రాధని దాచిపెట్టిన చిన్మయి

కార్తీక్: రోజుకొక నాటకం వేస్తున్నావ్ మళ్ళీ స్టేజ్ మీద ఎందుకు

News Reels

దీప: మీరు కూడా డాక్టరమ్మలా మాట్లాడుతున్నారు

కార్తీక్: మరి ఏం చెయ్యమంటావ్ నీ మొహం చూస్తే జాలిగా అనిపిస్తుంది అందుకే ఏమి అనలేకపోతున్నా అది అలుసుగా తీసుకుని నువ్వు ఏవేవో ప్రయత్నాలు వేస్తున్నావ్. నువ్వు నాటకం వేస్తే నేను ఎందుకు రావాలి. నేను లేకపోతే నాటకం వెయ్యవా? ఏదో ఒకటి మాట్లాడి బయటకి తీసుకెళ్లాలి. నీ భర్త ఎవరు నిన్ను వదిలేసి వెళ్లిపోయారంట కదా

దీప: మీకు గతం గుర్తుకు వచ్చేలా చెయ్యాలని అనుకుంటున్నా అది మీకు ఎలా చెప్పాలి. మీకు నా భర్త ఎవరో తెలియాలి కదా.. ఇప్పుడు నాతో వచ్చి నేను వేయబోయే నాటకం చూడండి నిజం తెలిసిపోతుంది

కార్తీక్: నిజంగా తెలిసిపోతుందా అయితే వస్తా.. శివ నేను వంటలక్కతో నాటకం చూడటానికి వెళ్తున్న మీ మేడమ్ వస్తే చెప్పు శివా

శివ: మేడమ్ కి తెలిస్తే ఒప్పుకోరు సార్

కార్తీక్: ఇక్కడ సమస్య సాల్వ్ అవుతుంటే మళ్ళీ సమస్య అంటావెంటీ మీ మేడమ్ వస్తే చెప్పు కమిటీ హాల్ నాటకం అవి మాత్రమే చెప్పు అనేసి కార్తీక్ దీపతో వెళ్ళిపోతాడు.

Also Read: వేద ప్లాన్ తెలుసుకున్న యష్- శర్మ దగ్గర సులోచనని ఇరికించిన మాలిని

కాలనీలో "కార్తీక దీపం కథ.. ఇది నిజంగా జరిగిన ఒక భార్య కథ" అని నాటకం మొదలుపెడతారు. నాకు ఈ నాటకాలు పెద్దగా నచ్చావు నీ భర్త గురించి తెలుస్తుందని వచ్చాను అని కార్తీక్ చెప్తాడు. శౌర్య సౌందర్య వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని తెలియకుండానే మోనిత కారు డిక్కిలో ఎక్కి కూర్చుంటుంది. అక్కడికి డాక్టర్ అన్నయ్య కూడా వస్తాడు. నాటకం స్టార్ట్ కాలేదు నాకు బోర్ కొడుతుంది నేను వెళ్లిపోతాను అని కార్తీక్ అంటాడు. నీ భర్త విషయం మీ డాక్టర్ అన్నయ్యకి తెలుసా అని అడుగుతాడు. తెలుసు సార్ అందుకే కలిపే ప్రయత్నం చేస్తున్నా అని అని డాక్టర్ అన్నయ్య చెప్తాడు. అసలు ఆ ప్రయత్నమే చేస్తే నా వెంట ఎందుకు పడుతుందని కార్తీక్ అంటాడు.

తరువాయి భాగంలో..

దీప స్టేజ్ మీద నాటకం మొదలు పెడుతుంది. తన కడుపులో బిడ్డకి తండ్రిని నేను కాదు అని కార్తీక్ క్యారేక్టర్ అరుస్తాడు. అప్పుడు కార్తీక్ కి కూడా గతం తాలూకు జ్ఞాపకాలు మసకగా కనిపిస్తాయి. దీప అవమానంతో ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నట్టుగా వెళ్తుంటే కార్తీక్ సడెన్ గా లేచి దీప దీప.. అని అరుస్తూ వెళ్లొద్దని కిందపడిపోతాడు.    

Published at : 26 Sep 2022 08:33 AM (IST) Tags: Karthika Deepam Serial Nirupam Paritala karthika Deepam Serial Today Episode Karthika Deepam Serial Written Update Premi Vishwanathan

సంబంధిత కథనాలు

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

ఓటీటీలోకి ‘లవ్ టుడే’ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

ఓటీటీలోకి ‘లవ్ టుడే’ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై బాలకృష్ణ క్లారిటీ, డైరెక్టర్ ఆయనేనా?

మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై బాలకృష్ణ క్లారిటీ, డైరెక్టర్ ఆయనేనా?

అల్లు అర్జున్ పక్కన ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల?

అల్లు అర్జున్ పక్కన ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల?

టాప్ స్టోరీస్

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి