Guppedanta Manasu January 9th: తాళి కట్టిందేవరో నిజం చెప్పిన వసు, ఆట ఆడుతున్న దేవయాని- ముక్కలైన రిషి హృదయం
Guppedantha Manasu January 9th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
తల్లిదండ్రుల మీద హత్యాయత్నం చేసినందుకుగాను వసుధార పోలీస్ స్టేషన్ లో ఉంటుంది. విషయం తెలిసి రిషి వసు దగ్గరకి పరుగున వస్తాడు. వాళ్ళతో పాటు మహేంద్ర, జగతి కూడా స్టేషన్ కి వచ్చి వసుతో మాట్లాడేందుకు ట్రై చేస్తారు. అప్పుడు వసు మెడలో తాళి చూసి అది తన కట్టలేదని రిషి అరుస్తాడు. ఎవరు కట్టారో నిజం చెప్పమని జగతి అడిగినా కూడా వసు చెప్పకుండా మౌనంగా ఉంటుంది. అయితే ఆ తాళి నిజంగా ఎవరు కట్టారో తెలుసుకోవడానికి రిషి మరోసారి పోలీస్ స్టేషన్ కి రావడం సోమవారం నాడు జరగబోయే ఎపిసోడ్లో ప్రోమో లో చూపించారు.
ప్రోమో లో ఏముందంటే.. “ఆ తాళి ఎవరు కట్టారో చెప్పు” అని రిషి చాలా ఆవేదనగా వసుని అడుగుతాడు. జరిగింది అంతా తలుచుకున్న వసు నిజం చెప్తుంది కానీ అది ఇన్ డైరెక్ట్ గా చెప్పడం వల్ల రిషి అర్థం చేసుకోలేడు. రిషి తన మెడలో తాళి వేసినట్టుగా ఊహించుకున్న విషయాని వసు గుర్తు చేసుకుంటూ.. “నా ఇష్టంతోనే ఈ తాళి నా మెడలో పడింది. మనస్పూర్తిగానే నాకీ పెళ్లి జరిగింది. ఇక ఇంతకమించి చెప్పాల్సింది ఏమి లేదు. మీకు దణ్ణం పెడతాను సర్ ఇక రాకండి” అని వసు ఏడుపు దిగమింగుకుంటూ చెప్తుంది. ఆ మాటలు విని రిషి గుండె పగిలిపోతుంది. అడుగులు తడబడుతూ వెనక్కి వేసుకుంటూ బాధగా వెళ్ళిపోతాడు. అదంతా రాజీవ్ విన్నట్టే చూపిస్తారు.
Also Read: 'తులసికి సీమంతం చేద్దామా' అని నీచంగా మాట్లాడిన లాస్య- ఇంటిని తాకట్టు పెడుతున్న నందు
వసు చెప్పిన మాటలు నమ్మి నిజంగానే రిషి వెళ్లిపోతాడా? లేదంటే తన మీద ప్రేమతో తనని బయటకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తాడా అనేది చూడాల్సి ఉంటుంది. తాళి రిషి కట్టలేదని రాజీవ్ కి అర్థం అవడంతో రాజీవ్ కి వసుని పెళ్లి చేసుకోవడానికి మరో అవకాశం వచ్చినట్టు అవుతుంది. అటు రిషి కోసం జగతి, మహేంద్ర కంగారుగా ఇంటికి వెళతారు.
శనివారం నాటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
వసుధార తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉంటారు.. బయట ఉన్న సెక్యూరిటీ కాఫీ తాగేందుకు వెళతారు..అప్పడు ఎంట్రీ ఇస్తాడు రాజీవ్.. ఇద్దర్నీ హాస్పిటల్ బెడ్ పై చూసి ఏదేదో మాట్లాడతాడు..
రాజీవ్: మీలాంటి మావయ్యగారు ఉన్నంతవరకూ నాకు ఎలాంటి సమస్యాలేదు..కానీ అత్తయ్యగారే ప్లాబ్లెమ్ అంటూ..సుమిత్ర దగ్గరకు వెళ్లి మీ త్యాగమే నా పెళ్లికి ఉపయోగపడుతుంది.. మీరు త్యాగం చేయండి..మీరు చస్తారనుకుంటే చావలేదు..రేపోమాపో లేచి కూర్చుంటారు తర్వాత జరిగింది మొత్తం మావయ్యగారితో చెప్పేస్తారు ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి..మిమ్మల్ని పొడిచింది నేనే అని అందరికీ తెలిస్తే నా క్యారెక్టర్ ఏమైపోతుంది...మీరు బతికి నన్ను జైలుకి పంపిస్తారా..మీరు చనిపోయి నా పెళ్లి జరిపిస్తారా ఆలోచించుకోండి.. మీరు బతకడం అవసరమా...మీరు బతికినా నాకు సపోర్ట్ చేయరు..పుణ్యస్త్రీగా వెళ్లిపోయే వరాన్ని మీకు ప్రసాదిస్తాను అంటూ ఆక్సిజన్ తీసేస్తాడు.. ఇవే మీకు చివరి ఘడియలు అనేసి వెళ్లిపోతుంటాడు..అప్పుడే కళ్లు తెరిచిన చక్రపాణి...అల్లుడు రాజీవ్ బయటకు వెళ్లడం చూస్తాడు..అదే సమయానికి హాస్పిటల్లో ఎంట్రీ ఇచ్చిన రిషి..పరుగున వెళ్లి ఆక్సిజన్ మాస్క్ పెడతాడు...రిషిని చూస్తాడు చక్రపాణి.
Also Read: సౌందర్యని కలిసిన దీప, కార్తీక్ ని కలిసిన పిల్లలు- చారుశీలకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మోనిత
ఆక్సిజన్ మాస్క్ పెట్టలేదు ఎందుకు...పేషెంట్ ని సరిగా చూసుకోరా అని అంటాడు.. వీళ్లకి ఎవ్వరూ లేరనుకోవద్దు.. నేనున్నాడు ట్రీట్మెంట్ ఇవ్వండని చెబుతాడు రిషి..
జైల్లో ఉన్న వసుధార దగ్గరకు వెలుతుంది దేవయాని
దేవయాని: ఏంటి వసుధారా..భూషణ్ ఫ్యామిలీలోకి కోడలిగా రావాల్సినదావిని ఖైదీగా పోలీస్ స్టేషన్ కి వచ్చావ్. ఇక జన్మలో రిషి నీ మొహం చూడడు..నీ బతుక్కి మీ బావే దిక్కు
వసుధార: మేడం మీరు సంతోషపడుతున్నారు కానీ మీ సంతోషం ఎక్కువ కాలం ఉండదు. మరింత పొగరు పెరిగిన వసుధారని చూస్తారా...
దేవయాని: వెటకారంగా చూసి వెనక్కు తెరిగి వెళ్లిపోతుంటుంది..
చిటికెలు వేసి పిలిచిన వసుధార..మేడం త్వరలో కలుద్దాం అని షాకిచ్చింది...