Gruhalakshmi January 9th: 'తులసికి సీమంతం చేద్దామా' అని నీచంగా మాట్లాడిన లాస్య- ఇంటిని తాకట్టు పెడుతున్న నందు
లాస్య నిజస్వరూపం బయటపడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
బిజినెస్ పెట్టాలని అనుకుంటునట్టు నందు ఇంట్లో అందరికీ చెప్తాడు. బాధ్యత మీది, బరువు మీది మీ ఇష్టం అని అభి అంటాడు. నువ్వు ఎదగాలని అనుకోవడం మాకు సంతోషమే కానీ లక్షలు పెట్టి బిజినెస్ ఎలా చేస్తావ్ అని పరంధామయ్య అడుగుతాడు. డబ్బు ఎక్కడ నుంచి తీసుకొస్తావ్ అప్పులు ఎలా తీరుస్తావ్ అని అంటాడు. దానికి లాస్య కౌంటర్ ఇస్తుంది. ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నా ఈ అవకాశం అందుకొనివ్వండి అని నందు బతిమలాడతాడు. మావయ్య గారికి డబ్బులు వచ్చినప్పుడు ఈ ఇల్లు కొనకుండా డబ్బులు ఇచ్చినట్టేయితే బిజినెస్ ఎప్పుడో పెట్టె వాళ్ళు అని లాస్య పుల్ల వేస్తుంది. డబ్బులు లాస్య ఫ్రెండ్ ఇస్తుందని చెప్పేసరికి సరే అంటాడు.
అప్పుడే సామ్రాట్ పరంధామయ్యకి ఫోన్ చేసి తులసి గురించి చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. వెంటనే హాస్పిటల్ కి బయల్దేరతారు. తులసి తల్లి, తమ్ముడు దీపక్ హాస్పిటల్ కి వస్తారు. తులసి పరిస్థితి క్రిటికల్ గా మారుతుందని, ట్రీట్మెంట్ కి సహకరించడం లేదని డాక్టర్ చెప్తుంది. ఆ మాటకి సామ్రాట్ కంగారుగా అలా అనొద్దని ఎలాగైనా కాపాడమని వేడుకుంటాడు. ప్రేమ్ వాళ్ళందరూ హాస్పిటల్ కి వస్తారు. మీలాంటి వాళ్ళని కన్నందుకు చావాలా బతకాలా అని కొట్టుమిట్టాడుతుందని దీపక్ కోపంగా అంటాడు. పిల్లలు తల్లిని గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేస్తాడు. ‘మీ అమ్మని పట్టించుకోకుండా ఉంటారా? స్పృహ తప్పే ముందు మీఅందరికీ ఫోన్ చేసింది ఒక్కరూ కూడా రెస్పాండ్ అయి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. మీరు మీ అమ్మకి ఇస్తున్న బహుమతి ఏంటో తెలుసా పెరాలసిస్ స్ట్రోక్ ఇవ్వడం, కోమాలోకి వెళ్ళడం. అదే మంచిదేమో తనకి ఇప్పటికైనా రెస్ట్ దొరుకుతుందని’ దీపక్ బాధగా అంటాడు.
Also Read: సౌందర్యని కలిసిన దీప, కార్తీక్ ని కలిసిన పిల్లలు- చారుశీలకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మోనిత
తప్పు తనదేనని తులసి తల్లి అంటుంది. దాన్ని గాలికి వదిలేసింది నేను పిల్లలు కాదు అని అంటుంది. తులసిని ఎవరు ఇంట్లో నుంచి వెళ్లమని అనలేదు తనే వెళ్ళిందని నందు అంటాడు. వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చారని సరస్వతి అంటుంది.
లాస్య; తన తప్పుని తప్పు అని వేలెత్తి చూపించారు అది నచ్చక వెళ్ళిపోయింది. ఆ పాపాన్ని వేరే ఎవరి అకౌంట్ లో వేయకండి
సరస్వతి: కేవలం మీ ఆయన కారణంగానే మనుషులకి దూరంగా ఒంటరిగా బతకడానికి సిద్ధపడింది
సామ్రాట్: పరిస్థితి ఇది కాదు ఎవరు గొడవపడకండి
అందరూ తులసి గురించి బాధపడుతూ ఉంటారు. ఒక్కొక్కరు తమతో తులసికి ఉన్న అనుబంధం తలుచుకుని కన్నీళ్ళు పెట్టుకుంటారు. దేవుడి దగ్గరకి వెళ్ళి తులసి కొలుకోవాలని మొక్కుకుంటారు. డాక్టర్ మళ్ళీ వచ్చి తులసి ఇప్పుడు బాగానే ఉందని చెప్తుంది. ఆ మాటకి అందరూ ఊపిరి పీల్చుకుంటారు. నర్స్ వచ్చి తులసి గారి హజ్బెండ్ మీరే కదా అని సామ్రాట్ ని అడుగుతుంది. అది విని అందరూ షాక్ అవుతారు. డాక్టర్ మీతో మాట్లాడాలని రమ్మని చెప్పి వెళ్ళిపోతుంది.
Also Read: యష్, వేదని కలిపేందుకు పడిన తొలిఅడుగు- రాజాకి గుండెపోటు, టెన్షన్ లో రాణి
లాస్య: ఆయన తులసి భర్త అని ఎవరు చెప్పారు
నర్స్: పేషెంట్ కన్సన్ ఫామ్ లో ఆయనే రాశారు
లాస్య: ఓపెన్ అయిపోయారు, భర్తగా సైన్ చేశాడు దాని అర్థం ఏంటి
సరస్వతి: ఎందుకు అంత చిన్న విషయాన్ని పెద్దది చేసి గొంతు చించుకుంటున్నావ్
నందు: ఇటువంటి పరిస్థితిలో కూడా అడగకపోవడం ఏం బాగోలేదు నాన్న
తులసి విడిగా ఇల్లు తీసుకుంది కూడా మన మీద కోపంతో కాదు తన మీద ఇష్టంతో అని లాస్య నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. కళ్ళు తిరిగి పడిపోవడానికి కారణం లోబీపీ అయి ఉండదు ఇంకేదో అయి ఉంటుందని అంటుంది. ఆ మాటకి దీపక్ కోపంతో ఊగిపోతాడు. నేను సామ్రాట్ మీద మోజు పడ్డాను అతన్నే పెళ్లి చేసుకుంటాను, అతనితో ఉంటాను అంటే సరిపోయేది కదా లాస్య అంటుంది. దీంతో బజారు మనిషివి నువ్వు పరాయి వాళ్ళ మొగుడిని లాక్కునే దానివి అని దీపక్ లాస్యని అనేసరికి నందు కోపంగా దీపక్ మీద చెయ్యి చేసుకుంటాడు.