Gruhalakshmi Septembar 30th Update: తులసికి వెన్నుపోటు పొడిచిన అనసూయ- ప్రేమ్ కి మ్యూజిక్ ఆఫర్, లాస్యని అజమాయిషీ చేసిన తులసి
తులసి, సామ్రాట్ గురించి నీచంగా మాట్లాడేసరికి అనసూయ కోపంతో రగిలిపోతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
తులసి ఆఫీసులో దర్జాగా కూర్చుని ఫైల్స్ చూస్తుంటే నందు, లాస్య కుళ్లుకుంటారు. తులసిని ఎలాగైనా ఇరికించాలని ప్లాన్ చేస్తానుగా అని లాస్య మనసులో అనుకుంటుంది. పక్కన చూసేసరికీ తులసి ఉంటుంది. బడ్జెట్ ఫైల్ కావాలి రెడీ చెయ్యమని చెప్పాను కదా తులసి అడిగేసరికి లేట్ అవుతుందని అంటే మధ్యాహ్నం లోపు నాకు ఫైల్ రెడీ చేసి పంపించు లేదంటే వేరే వాళ్ళకి ఆ వర్క్ ఇవ్వమని సామ్రాట్ గారికి చెప్తాను అని కమాండింగ్ గా మాట్లాడుతుంది. చెప్పింది వినపడిందా అని నందు కూడా తులసికి సపోర్ట్ గా మాట్లాడటంతో లాస్య మరింత రగిలిపోతుంది. నీ మాజీ భార్య నీ భార్యని నిలదీస్తే నువ్వు సపోర్ట్ గా నిలబడాల్సింది పోయి సంకలు గుద్దుకుంటావా అని లాస్య చిరాకుగా అడుగుతుంది.
జాబ్ కావాలంటే నోరు మూసుకుని పని చెయ్యాలని నువ్వే చెప్పావ్ కదా నువ్వే చూసుకో అని నందు అనేసి వెళ్ళిపోతాడు. అభి, అనసూయ తులసి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మామ్ ఒక బాహుబలి అందుకే ఎంత కష్టం వచ్చినా ఫేస్ చేస్తాను అంటుంది నాకు సపోర్ట్ ఇవ్వు నానమ్మా అని అభి అడుగుతాడు. సామ్రాట్ గారి ఆఫీసులో అమ్మ ఉద్యోగం మానేయాలి అదే ఈ సమస్యకి పరిష్కారం అనేసి అభి వెళ్ళిపోతాడు. అనసూయ సామ్రాట్ ఇంటికి వస్తుంది. మిమ్మల్ని ఒక కోరిక కోరడానికి వచ్చాను అని అడుగుతుంది. మీకు ఏం కావాలో అడగండి తప్పకుండా చేస్తాను అని సామ్రాట్ మాట ఇస్తాడు. మాట ఇచ్చాక తప్పకూడదు అని అనసూయ అంటుంది.
Also Read: రామూర్తి కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్- సత్యని అనుమానం తగ్గించుకోమన్న దేవుడమ్మ
మా తులసి ఇక మీ ఆఫీసు మొహం చూడకూడదు, మీకు మీరుగా తులసిని దూరం చెయ్యాలి, తులసికి దూరంగా ఉండాలి. అర్థం అయ్యింది కదా అని అంటుంది. ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఇప్పుడు ఏం జరిగిందని సామ్రాట్ అడుగుతాడు. ఏం జరగకూడదనే నా ఆరాటం మీరు ప్రశాంతంగా ఉండాలి, నేను ప్రశాంతంగా ఉండాలి అని అంటుంది. ఈ విషయం తులసిగారికి తెలుసా? తను ఒప్పుకున్నారా అని సామ్రాట్ అడుగుతాడు. తులసి ఒప్పుకుంటే మీ దాకా వచ్చే అవసరమే వచ్చేది కాదు నాలుగు గోడల మధ్యే సమస్య పరిష్కారం అయ్యేది. అది కుదిరే పని కాదని మీదగ్గరకి వచ్చానని చెప్తుంది.
తప్పు చేస్తున్నారేమో అమ్మ అని సామ్రాట్ అంటాడు. తులసిగారికి అన్యాయం చేస్తున్నారని అనిపిస్తుందని చెప్తాడు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను, నేను వచ్చి ఇలా అడిగినట్టు తులసికి తెలియకూడదు మీరు చెప్పకూడదు అని అనసూయ చెప్తుంది. ఇది మరి అన్యాయం మీరు నిర్ణయం తీసుకుని తప్పు నా మీద వేస్తున్నారని సామ్రాట్ అంటే మీరు మ్యూజిక్ స్కూల్ కి పెట్టుబడి పెట్టబట్టే కదా ఇంతవరకు వచ్చింది అందుకే తెగదెంపులు కూడా మీరే చెయ్యాలి అని అంటుంది. ఇన్ని రోజులు ఇంతగా సపోర్ట్ చేసి ఇప్పుడు వెన్నుపోటు పొడవడం చాలా అన్యాయం అని సామ్రాట్ అంటాడు. మా పరువు కాపాడుకోవడం వెన్నుపోటు ఎలా అవుతుందని, తన జీవితం మీద మచ్చ పడకూడదని అడుగుతున్నా. మీకు చేతులెత్తి వేడుకుంటున్నా ఈ ఒక్క పని చెయ్యండని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. మ్యూజిక్ ఆడిషన్స్ కి ప్రేమ్ వెళ్తాడు. అందులో ప్రేమ్ ని సెలెక్ట్ చేస్తారు. అక్కడ ఒకడు ప్రేమ్ కి అడ్డుపడతాడు.
Also Read: 'ఐ లవ్యూ నాన్న' అని ఏడిపించేసిన ఆదిత్య- శ్రీవారికి వేద ప్రేమలేఖ