Gruhalakshmi September 26th: సామ్రాట్ విషయంలో తగ్గేదెలే అన్న తులసి- 'నాన్న కానీ ఈ నాన్న'ని క్షమించమని హనీని అడిగిన సామ్రాట్
తులసి, సామ్రాట్ కలిసిపోయినట్టు మీడియా ముందు చెప్పడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారు. కానీ దాని చెడగొట్టాలని లాస్య ప్లాన్ వేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
తులసి, సామ్రాట్ మీడియా వాళ్ళ ముందు కూర్చుంటారు. తులసి వనం గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వడానికి మీ అందరినీ ఇన్వైట్ చేశామని సామ్రాట్ అంటాడు. మీరు అప్ డేట్ ఇచ్చే ముందు మా అనుమానాలు కొన్ని క్లారిఫై చేసుకుంటామని లాస్య పురమాయించిన విలేకరి అడుగుతుంది. లాస్య ఏమి తెలియనట్టు ముందు సామ్రాట్ గారు మాట్లాడేది వినమని లాస్య అంటుంది. అలా అయితే ఎలా మేము వెళ్లిపోతామని అందరూ లేస్తే వద్దు ఉండండి అని సామ్రాట్ ఆపుతాడు. భూమి పూజ జరిగిన రోజే తులసి గారు పార్టనర్షిప్ నుంచి తప్పుకున్నారు.. మళ్ళీ ఈరోజు మీ పక్కన కూర్చున్నారు అంత త్వరగా మీ మనసు ఎలా మార్చుకున్నారు? మీ కంపెనీ పరువు కోసం ఆమె కాళ్ళు పట్టుకున్నారా? అని ఒక విలేకరి అడుగుతుంది. ఆ మాటలకి అందరూ షాక్ అవుతారు.
తెర వెనుక ఏం జరిగింది? మీరు రాజీ పడ్డారా? అని అంటుంది. ప్రశ్న అడగండి కానీ మంచి భాష మాట్లాడమని తులసి కోపంగా అంటుంటే సామ్రాట్ అడ్డుపడతాడు. ఏ మాత్రం చదువురాని తులసిగారిని మీ కంపెనీలో అతిపెద్ద పోస్ట్ లో కూర్చోబెట్టడం కూడా రూమరేనా? ఆఫీసుఓ ఎవరి మీద చూపించని శ్రద్ధ తులసి గారి మీదే ఎందుకు చూపిస్తున్నారు? మీ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. మీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారంట కదా? త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నారంట కదా? ఈ విషయం మీ ఇళ్ళల్లో తెలిసి మీ పార్టనర్ షిప్ వదులుకోవాలని తులసిగారు అనుకున్నారంట కదా అందులో నిజమెంత? అని మీడియా వాళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉంటారు.
Also Read: వసు కోసం మల్లెపూలు కొన్న రిషి - నాకోసం వచ్చేస్తావా వసుధార అని అడిగేసిన మిస్టర్ ఇగో
మీ భార్య సంగతి ఏంటి? నిందలు అన్నీ నిజాలని ఒప్పుకున్నట్టేనా అని మీడియా వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ఆ మాటలకి తులసి ఫైర్ అవుతుంది. ఆడ, మగ కలిసి బిజినెస్ పార్టనర్ గా ఉంటే తప్పు ఏంటి? ఎందుకు అందరూ దాన్ని నేరంగా చూస్తున్నారు? ఎందుకు ఆయనకి దురుద్దేశం అంటగడుతున్నారు? ఒక ఆడది మగాడి సాయం తీసుకుంటే అమ్ముడుపోయినట్టేనా.. ఇది ఎక్కడ అన్యాయం. మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం వ్యాపార భాగస్వామ్యం మాత్రమే. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆ భాగస్వామ్యం తెగిపోదు. ఎవరు ఏమనుకున్నా భయపడి వెనక్కి తగ్గేది లేదు అని తులసి తెగేసి చెప్తుంది. ఆ మాటలకి అందరూ చప్పట్లు కొడతారు.
చాలా థాంక్స్ తులసి గారు ప్రెస్ మీట్ లో నేను మీకు అండగా నిలబడదామని అనుకున్నా కానీ మీరు నాకు అండగా నిలబడ్డారు అని సామ్రాట్ అంటాడు. దివ్య తులసిని చూసి ఎమోషనల్ అవుతుంది. నా కోడలు ఎప్పుడు తప్పు చేయదు అని అనసూయ కూడా అంటుంది. అభి ఈ విషయం మీద కోపంగా ఉంటాడు. దాని గురించి ఆయన మాట్లాడకుండా ఉంటే ఎలా అని అభి అంటాడు. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారో నాకు అర్థం కాలేదని తులసి అంటుంది. ఆయన మౌనం వెనుక ఏదో చెప్పుకోలేని కారణం ఉంటుందని అంటుంది. సామ్రాట్ హనీ దగ్గరకి వెళ్ళి బాధపడతాడు. నిప్పు లాంటి నిజాన్ని నా గుండెల్లో దాచుకుని సమాజం ముందు మీ నాన్నలా నిలబడ్డాను, ఒక విధంగా నిన్ను మోసం చెయ్యడమే అవుతుంది, నువ్వు బాధపడకుండా ఉండటం కోసం నేను తప్పు చేస్తున్న అని సామ్రాట్ హనీని చూసి బాధపడతాడు.
Also Read: సత్య షాకింగ్ నిర్ణయం- హాస్పిటల్ కి వచ్చిన దేవుడమ్మ, రాధని దాచిపెట్టిన చిన్మయి
నాన్న కానీ ఈ నాన్నని క్షమించమ్మా.. ఈ అన్న ప్రేమని వదులుకుని నా చెల్లి తన జీవితాన్ని కాదని వెళ్ళిపోయింది నీలో నా చెల్లిని చూసుకుంటున్నా. ఇది తప్పా, ఒప్ప అనేది నాకు తెలియదు భారం అంతా ఆ దేవుడికే వదిలిపెడుతున్నా అని ఎమోషనల్ అవుతాడు.